ఉగాది నాడు ఉదయించిన యుగద్రష్ట డాక్టర్‌జీ

కాలం అనంతమైనది. అనంతమైన ఈ కాలాన్ని లెక్కించటంలో ఉగాది (సంవత్సరాది) విశిష్టమైనది. మన కాలగణనకు ప్రతీక పంచాగము. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఉగాది పండుగ జరుపు కుంటాము. ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది? అధునిక శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారు; మన కాలగణన; మన పంచాగం ఏమి చెబుతున్నదీ గమనిద్దాం. 

అమరవాణి


శ్లో|| విక్లవో వీర్యహీనో యః

     సదైవ మనువర్తతే |

     వీరా సంభావితాత్మనో 

     న దైవం పర్యుపాసతే ||

    - శ్రీమద్‌ రామాయణం (2:23:16)

భావం : భయస్తుడు, పరాక్రమహీనుడు మాత్రమే అదృష్టాన్ని నమ్ముకుంటాడు. కానీ లోకం గౌరవింపదగిన మహావీరులు, ధైర్యవంతులు, పరాక్రమశీలురు అదృష్టం మీద ఆధారపడరు. దాన్ని నమ్ముకోరు. తమ శక్తిసామర్ధ్యాలపైనే ఆధారపడతారు.

ప్రముఖులు మాట

దైవానుగ్రహం ఉండాలంటే సత్కార్యాలు తప్పనిసరి. తోటివారి సేవ పుణ్యానికి మంచి మార్గం. సమాజంలో అట్టడుగున ఉండి అన్నానికి, వస్త్రానికి నోచుకోని వారు, వైద్యసేవలు అందనివారు కోకొల్లలుగా ఉన్నారు. వారందరికి సాయం చేయడం సులువైన మోక్షమార్గం. కంచి పీఠం ప్రధాన లక్ష్యం సేవే.     
- శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి 

శ్రీరామ నవమి

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ద నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీరాముని జన్మతిథిని శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. శ్రీ సీతారాముల కళ్యాణము కూడా నమినాడే జరిగినదని ప్రజల విశ్వాసము. 

సేవాభాగ్యంలేని స్వర్గమెందుకు? (స్ఫూర్తి)


ముద్గలుడు సామాన్య కుటుంబీకుడు. చెమటోడ్చి జీవనం గడిపేవాడు. తన పొలంలో పండిన ధాన్నాన్నే అడిగినవారికి అడిగినంత దానంచేసి, పక్షులు, జంతువులు తిన్నన్నితినగా మిగతావాటితో జీవయాత్ర గడిపేవాడు. అతని త్యాగనిరతికి మెచ్చి అతన్ని బొందితో స్వర్గానికి తీసుకుపోవడానికి దేవతలు విమానం తీసుకువచ్చాడు.

మనది దైవీ జాతీయవాదం (హితవచనం)

సాత్వికప్రవృత్తితో కూడిన జాతీయతకు అంటే దైవీ జాతీయవాదానికి మనం వారసులం. ఈ చరాచర సృష్టి ఆరంభంలోనే, మహానుభావులైన మన పూర్వులు యోచించి ఆ నిర్ణయానికి వచ్చారు. ఇదే పరంపరకు సాకారమూర్తులుగా భగవాన్‌ శ్రీరాముడు, భగవాన్‌ శ్రీకృష్ణుడు మున్నగువారు ఇచ్చట అవతరించారు.

హిందూ ధర్మ పరిరక్షకులు, సమాజ పరివర్తకులు జయేంద్ర సరస్వతి స్వామి

సనాతన ధర్మ పరిరక్షణ, ప్రచారం కోసం, సామాజిక వ్యవస్థల ఉద్ధరణ కోసం ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు మఠాలతో పాటు కంచి మఠం కూడా ఆ అపూర్వమైన కార్యాన్ని నిర్వర్తిస్తూ వచ్చింది. ఎన్నో విపత్కర, వ్యతిరేక పరిస్థితులను కూడా ఎదుర్కొంది. మఠాలు కొద్దిమంది సన్యాసులకు ఆశ్రయం కల్పించే కేంద్రాలని, మఠాధిపతులకు సాధారణ సమాజంతో సంబంధం లేదని, వాళ్ళు తమ మఠాలను వదిలి బయటకురారని, ప్రజల కష్టనష్టాల్లో పాలుపంచు కోరని... ఇలా అనేకానేక ఆరోపణలు, అసత్య ప్రచారాలు సాగాయి. 

హిందూధర్మ రక్షకులు శ్రీ విద్యారణ్యులు

ఏకశిలానగరం (నేటి వరంగల్‌) లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ముగ్గురు మగ పిల్లలలో పెద్దవాడు మాధవుడు (విద్యారణ్యులు). వారి తల్లిదండ్రులు మాయణాచార్యుడు, శ్రీమతిదేవి. వారిది పేద,పండిత కుటుంబం. మాధవుని తమ్ముళ్ళు సాయణుడు, భోగనాధుడు. భోగనాధుడు మంచి కవిగా పేరు తెచ్చుకున్నాడు. చిన్నతనంలోనే మరణించాడు. మాధవ, సాయణులు శృంగేరీపీఠంలో ఆశ్రయంపొందారు.   శృంగేరి పీఠాధిపతి వీరికి సన్యాసదీక్ష ఇచ్చారు. మాధవులకు విద్యారణ్యులని ఆశ్రమనామం ఇచ్చారు. భారతి కృష్ణ తీర్థ, శంకరానందుల దగ్గర మాధవులు శాస్త్రాభ్యాసం చేశారు. ఆ విధంగా అన్నాతమ్ముళ్ళిద్దరు సన్యాసం స్వీకరించారు (క్రీ.శ.1331).

ఆర్‌.ఎస్‌.ఎస్‌., సైన్యం మధ్య ఉన్నది పరస్పర విశ్వాసమే ..

అవసరమైనప్పుడు, రాజ్యాంగం అనుమతిస్తే  సైన్యం ఎవరికైనా సైనిక శిక్షణ ఇవ్వవచ్చని, అయితే సాధారణ ప్రజానీకం కంటే క్రమశిక్షణాయుతమైన నిత్య కార్యక్రమాలలో పాల్గొనే స్వయంసేవకులకు శిక్షణ ఇవ్వడం సులభమని ఇటీవల ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ సంఘచాలక్‌ అన్న మాటలను పలువురు వక్రీకరించి పెడర్ధాలు తీశారు. ఇంతకీ సంఘ్‌కి, సైన్యానికి ఉన్న సంబంధం ఏమిటి?

ప్రజాస్వామ్యం అంటూ ప్రజలను రెచ్చగొడుతున్న శక్తులు


అన్ని మతాలనూ ఆదరిస్తోన్న ప్రజాస్వామిక దేశం భారతదేశం. వసుధైవకుటుంబకం అని ప్రపంచమంతా ఒక కుటుంబంగా భావించిన మహోన్నత ఔదార్యం భారతీయులది. కానీ రాజకీయ, ఆర్ధిక, సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం కొందరు హిందూ సమాజాన్ని చీల్చే పనిలో పడ్డారు. మతాలు వేరైనా కలిసి ఉంటున్న జనం మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా ప్రజాస్వామ్యం పేరిట కొద్దిమంది ప్రజలను రెచ్చగొట్టే స్థాయికి దిగజారుతున్నారు. ఆ ప్రజాస్వామ్యం వల్లే తమలాంటి మతాలకు ఇక్కడ చోటు దక్కిందన్న ఇంగిత జ్ఞానాన్ని మర్చి పోతున్నారు.

మీరట్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ సమ్మేళనంలో వెల్లివిరిసిన సమరసత


మీరట్‌లో ఫిబ్రవరి 25న జరిగిన రాష్ట్రోదయ సమ్మేళనంలో 3లక్షలమంది స్వయంసేవకులు పాల్గొన్నారు. వారికి మీరట్‌ వాసులే ఆహారం అందజేశారు.6లక్షల ఇళ్ళ నుండి స్వయంసేవకులకు ఆహారపొట్లాలు వచ్చాయి. 

ఆయుర్వేద ప్రాధాన్యాన్ని పెంచేలా యూపీ ప్రభుత్వం అడుగులు - కాలేయ వ్యాధి, కీళ్ల నొప్పులు వంటి రోగాలకు మందుల తయారీ


గోమూత్రంతో నేలను శుభ్రంచేసే ద్రవాన్ని తయారుచేసేందుకు ప్రతిపాదించిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగువేసింది. గోమూత్రం వినియోగించి ఔషధాలను తయారు చేసింది. ఆయుర్వేద ప్రాధాన్యతను విస్తరించేందుకు కృషి చేస్తున్నది. గోమూత్రాన్ని ఉపయోగించి ఆయుర్వేద విభాగం ఎనిమిది రకాల ఔషధాలను తయారుచేసింది. ఈ ఔషధాలతో కాలేయ వ్యాధులు, కీళ్ల నొప్పులు, వ్యాధి నిరోధక శక్తి లోపించడం వంటి సమస్యలు దూరం అవుతాయి అని యూపీ ఆయుర్వేద షశీ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌ఆర్‌ చౌదరి ఆదివారం మీడియాకు తెలిపారు. 

పసుపు

పసుపు తెలియనివారు ఉండరు అదీకాకుండా దాని లాభాలు తెలుసున్న వారు కోకొల్లలు, గాని ఆయుర్వేద శాస్త్రం ఏమి చెబుతోంది తెలుసుకుందాము ప్రధమం గా ఈ పసుపు వాత దోషాన్ని తగిస్తుంది.

గర్భ సంస్కారం - భారతీయ విధానం

ఇటీవల ఆరోగ్యభారతి పశ్చిమ బెంగాల్‌లో మంచి సంతానాన్ని పొందడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, హిందూ శాస్త్రాల్లో దీనిగురించి చెప్పిన విషయాలను తెలియజేస్తూ గర్భ సంస్కారం అనే ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించి, పంపిణీ చేసింది. హిందూత్వానికి సంబంధించిన ఏ విషయాన్ని అంగీకరించని కొందరు మేధావులు ఇది 'హిందుత్వవాదులను' తయారుచేసేందుకు జరుగుతున్న ప్రయత్నమంటూ గొడవ చేశారు. పాఠశాల స్థాయి నుంచే సెక్స్‌ ఎడ్యుకేషన్‌ ప్రారంభించాలని వాదించే వీరు భారతీయ విజ్ఞానాన్ని మాత్రం అంగీకరించలేక పోతున్నారు.  గర్భస్థ శిశువుకు సంస్కారాలు అందించడం గురించి మన శాస్త్రాలు ఏమి చెపుతున్నాయో చూద్దాం - 

విశ్వగురువు భారత్‌ వైపు చూస్తున్న ప్రపంచం


''మా సంస్కృతీ సంప్రదాయాలూ, జాతీయ విలువలు కాపాడే ఏకైక శక్తి హిందూ దేశం, మా ఆశలన్నీ హిందువుల మీదే పెట్టుకుని భారత్‌ మార్గదర్శనం కోసం ఎదురు చూస్తున్నాం'' అంటున్నారు వివిధ దేశ సంస్కృతీ సంప్రదాయాలకు చెందినవారు. 

దేశ చట్టాలు నన్నుశిక్షించలేవు - కేరళ పాస్టర్‌


చర్చ్‌ ఆస్తుల్ని అక్రమంగా విక్రయించిన కేరళ క్రైస్తవ మతాధికారి కార్టినల్‌ మార్‌ జార్జ్‌ అలన్‌చెర్రి తాను చేసినది తప్పాఒప్పా అని నిర్ణయించి, శిక్షించాల్సింది భారతదేశ చట్టాలు కావని, పోప్‌కు మాత్రమే ఆ అధికారం ఉందని స్పష్టం చేశారు. సాక్షాత్తు కేరళ హైకోర్ట్‌లోనే ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. 

హిందువులు లేనిదే ఈ దేశంలో సెక్యులరిజం లేదు - ఖురాన్‌ సొసైటీ కార్యదర్శి

ఈ దేశంలో హిందూ సంప్రదాయం ఉండడం వల్లనే సెక్యులరిజం బతికి ఉన్నదని కేరళ ఖురాన్‌ సున్నత్‌ సొసైటీ ప్రధానకార్యదర్శి జమీదా అన్నారు. కన్నూర్‌ జిల్లాలో జరిగిన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ స్మృతి సభలో పాల్గొన్న జమీదా ఇటువంటి నిజాలను మాట్లాడుతున్నందుకు తనను వామపక్ష, మతఛాందసవాదులు బెదిరిస్తున్నారని కూడా వెల్లడించారు.