దేశ చట్టాలు నన్నుశిక్షించలేవు - కేరళ పాస్టర్‌


చర్చ్‌ ఆస్తుల్ని అక్రమంగా విక్రయించిన కేరళ క్రైస్తవ మతాధికారి కార్టినల్‌ మార్‌ జార్జ్‌ అలన్‌చెర్రి తాను చేసినది తప్పాఒప్పా అని నిర్ణయించి, శిక్షించాల్సింది భారతదేశ చట్టాలు కావని, పోప్‌కు మాత్రమే ఆ అధికారం ఉందని స్పష్టం చేశారు. సాక్షాత్తు కేరళ హైకోర్ట్‌లోనే ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. 
27 కోట్ల రూపాయల విలువచేసే చర్చ్‌ భూమిని మధ్యవర్తులతో కలిసి కేవలం 13 కోట్లకే అమ్మేశారు కార్టినల్‌ మార్‌జార్జ్‌ అలన్‌చెర్రి. కానీ విచిత్రమేమిటంటే ఆ 13 కోట్లలో కూడా 9.3 కోట్లు మాత్రమే చర్చ్‌కు చేరాయి. మిగిలిన సొమ్మంతా ఏమైందని కార్టినల్‌ను అడిగితే నోట్లరద్దు వల్ల అది ఆవిరైపోయిందని సమాధాన మిచ్చారు. పైగా తాను తప్పుచేశానని నిర్ణయించ డానికి, శిక్ష విధించే హక్కు, అర్హత పోప్‌కు మాత్రమే ఉందని తెగేసి చెప్పారు. పోప్‌ అనుసరించే మత నియమ నిబంధనలు భారత్‌లో చెల్లుబాటుకావని, ఇక్కడ రాజ్యాంగం ఆమోదించిన చట్టాలే వర్తిస్తాయని సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తి చెప్పినా కార్టిన అలన్‌చెర్రి తన వాదన వదలలేదు. కార్టినల్‌ చర్చ్‌ ఆస్తులకు కేవలం సంరక్షకుడు మాత్రమేనని, వాటిని విక్రయించే అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. మోసపూరితంగా చర్చ్‌ ఆస్తులను స్వాహా చేసినందుకు కార్టినల్‌పై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.