ప్రముఖులు మాట

దైవానుగ్రహం ఉండాలంటే సత్కార్యాలు తప్పనిసరి. తోటివారి సేవ పుణ్యానికి మంచి మార్గం. సమాజంలో అట్టడుగున ఉండి అన్నానికి, వస్త్రానికి నోచుకోని వారు, వైద్యసేవలు అందనివారు కోకొల్లలుగా ఉన్నారు. వారందరికి సాయం చేయడం సులువైన మోక్షమార్గం. కంచి పీఠం ప్రధాన లక్ష్యం సేవే.     
- శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి 

సూర్యుడు స్థిరంగానే ఉంటాడు. శాశ్వతంగా ఉంటాడు. నిత్యం ఉంటాడు. అలాగే మన జాతి కూడా స్థిరమైనది, శాశ్వతమైనది, చిరంతనమైనది. అది పుట్టడం, గిట్టడం అనేది ఉండదు. హిందూ పిడివాదం అంటే అకుంఠితమైన సత్యనిష్ట, అచంచలమైన అహింస, సంపూర్ణమైన అస్తేయం, అస్కలిత బ్రహ్మచర్యం, అపరిగ్రహం. మన పిడివాదం ఉదారత్వం కోసం.

- డా.మోహన్‌ భాగవత్‌ జి, ప||పూ||సర్‌ సంఘచాలక్‌, ఆర్‌.ఎస్‌.ఎస్‌. 


మన దేశ వారసత్వమే మనకు గర్వకారణం. అపారమైన జ్ఞానానికి భాండాగారాలైన మన శాస్త్రాలను వాదులుకోకూడదు. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, భాగవతం, మహాభారతం మొదలైనవి మన ప్రాచీన జ్ఞానానికి మూలం.

- ఎ.ఎస్‌. కిరణ్‌ కుమార్‌, ఇస్రో ఛైర్మన్‌