మీరట్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ సమ్మేళనంలో వెల్లివిరిసిన సమరసత


మీరట్‌లో ఫిబ్రవరి 25న జరిగిన రాష్ట్రోదయ సమ్మేళనంలో 3లక్షలమంది స్వయంసేవకులు పాల్గొన్నారు. వారికి మీరట్‌ వాసులే ఆహారం అందజేశారు.6లక్షల ఇళ్ళ నుండి స్వయంసేవకులకు ఆహారపొట్లాలు వచ్చాయి. 


రోహ్తరోడ్‌లో ఉన్న మహమ్మద్‌ అఫ్జల్‌, 50 ఇంటికి ఆర్‌.ఎస్‌.ఎస్‌ స్వయంసేవకులు వచ్చి వాళ్ళింట్లోంచి రెండు పాకెట్లలో పూరీలు,పరోఠాలు ఇవ్వమని కోరారు. ఇంతకీ ఈ పరోఠాలు ఎవరికి అని అడగ్గా  రాష్ట్రోదయ కార్యక్రమంలో పాల్గొనే స్వయంసేవకుల కోసమని చెప్పారు. ఇలాగ మొత్తం 6 లక్షల ఇళ్ల నుండి 3 లక్షల మంది స్వయంసేవకుల కోసం ఆహారం సిద్ధం చేశారు. ఆ రోజున తన ఇంటి నుండి కోరినదాని కంటే ఎక్కువ ఆహారం పంపుతూ అఫ్జల్‌ ''నేను కుల మత విభేదాలను పట్టించుకోకుండా నా వంతుగా ఈ మహాకార్యానికి తోడ్పాటు అందించా లనుకున్నాను. అక్కడికి వచ్చే వాళ్ళందరూ మా అతిధులే. నా భార్య పూరీలు తాజాగా ఉండేటట్లు చేసే ప్రయత్నం చేసింది'' అని అన్నారు ఆయన వృత్తి రీత్యా న్యాయవాది. ఆహారపొట్లాలు శనివారం రాత్రి సేకరించి ఆదివారం కార్యక్రమ స్థలం దగ్గర ఇచ్చారు . 

వాల్మీకి బస్తీలో నివసించే గణేశ్‌ భావర్‌ ఇంటి నుండి కూడా ఆహారపొట్లాలు తీసుకున్నారు. భావర్‌ మీరట్‌ మున్సిపాలిటీ కార్పొరేషన్‌లో సానిటరీ కూలీగా పనిచేస్తున్నారు. వాళ్ళింట్లోంచి ఆహారాన్ని అందించే బాధ్యత తీసుకున్న ఆయన కూతురు సుజాత ''ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యక్రమానికి ఇలా సహకరించడం మాకు గొప్ప అవకాశం. నేను ఇచ్చే ఈ పొట్లం రేపు ఎవరికైనా వెళ్లొచ్చు కానీ ఏ కుల మత వర్గ విభేదం లేని ఈ పద్ధతి అందరినీ కలిపి ఉంచుతుంది''

''ఒక ఇంటికి రెండు నుంచి నాలుగు పొట్లాల వరకు కోరడం జరిగింది . తమ ఇంట్లో వంట చేసేవాళ్ళు లేని ఇళ్ళు తప్ప మిగిలిన అన్నీ ఇళ్లనుంచి మంచి స్పందన వచ్చింది ఈ పొట్లాలతో కార్యక్రమ స్థలం దగ్గర తయారుచేసిన కూర మంచినీటి బాటిల్‌ కలిపి స్వయంసేవకులకి ఇచ్చారు'' అని రాష్ట్ర సేవికా సమితి ప్రాంత బౌద్ధిక్‌ ప్రముఖ్‌ పాయల్‌ అగర్వాల్‌ చెప్పారు. 

మహర్షి వాల్మీకి జీవి మంచ్‌కి చెందిన సుందర్లాల్‌ బృంద ''ఈ కార్యక్రమం ద్వారా అంతరానితనపు ఛాయాల్ని పటాపంచలు చేసినట్లయింది ఒక సదుద్దేశం కోసం అందరూ కలిసి వస్తున్నారు'' అని అన్నారు వీరి శ్రీమతి అమితానందంతో ఆహారాన్ని ఆదివారం కూడా అందించారు .