విశ్వగురువు భారత్‌ వైపు చూస్తున్న ప్రపంచం


''మా సంస్కృతీ సంప్రదాయాలూ, జాతీయ విలువలు కాపాడే ఏకైక శక్తి హిందూ దేశం, మా ఆశలన్నీ హిందువుల మీదే పెట్టుకుని భారత్‌ మార్గదర్శనం కోసం ఎదురు చూస్తున్నాం'' అంటున్నారు వివిధ దేశ సంస్కృతీ సంప్రదాయాలకు చెందినవారు. 
ముంబైలోని రాంభావూమల్లీలో ఫిబ్రవరి- 2018, 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు జరిగిన International Center for Cultural Studies (ICCS) ఆరవ మహాసభలో 30 దేశాలకు చెందిన 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

''మా పద్ధతులూ, సంప్రదాయాలూ కూడా హిందువుల మాదిరిగానే ఉంటాయి. మేము పూజించే దేవతలు కూడా 'అయ్యప్ప' 'కార్తికేయుడు'ని పోలి ఉంటారు'' అన్నారు యజ్‌దీ జాతికి చెందిన నిషాద్‌ హనీఫాలు. యజ్‌దీ మానవ అధికారాల నాయకుడు మిర్జా ఇస్మాయిల్‌ ఆర్గనైజర్‌ పత్రికతో మాట్లాడుతూ ''మేము కూడా హిందువులలాగే పాదరక్షలు ధరించకుండా నిష్టగా దైవారాధన చేస్తాము'' అన్నారు.  గ్వాటిమెలా దేశానికి చెందిన జాతీయ మాయన్‌ పెద్దల సభ నాయకురాలు ఎలిజిబెత్‌ అరాజియో కూడా పై విధంగానే వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేశ్‌జోషి మరియు ఆర్‌ఎస్‌ఎస్‌ ఉప ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ¬సబలే మార్గదర్శనంతో సభ విజయవంతంగా ముగిసింది.