అమరవాణి


శ్లో|| విక్లవో వీర్యహీనో యః

     సదైవ మనువర్తతే |

     వీరా సంభావితాత్మనో 

     న దైవం పర్యుపాసతే ||

    - శ్రీమద్‌ రామాయణం (2:23:16)

భావం : భయస్తుడు, పరాక్రమహీనుడు మాత్రమే అదృష్టాన్ని నమ్ముకుంటాడు. కానీ లోకం గౌరవింపదగిన మహావీరులు, ధైర్యవంతులు, పరాక్రమశీలురు అదృష్టం మీద ఆధారపడరు. దాన్ని నమ్ముకోరు. తమ శక్తిసామర్ధ్యాలపైనే ఆధారపడతారు.