సంఘకార్యంపట్ల విశ్వాసం పెరుగుతోంది


దేశం మొత్తం నుండి ఎన్నికైన ప్రతినిధులతో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అఖిలభారతీయ ప్రతినిధి సభ సమావేశాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. వీటిలో దేశం మొత్తంలో సంఘ కార్యం, వివిధ క్షేత్రాలకు సంబంధించిన పని గురించి సమీక్ష జరుగుతుంది. అలాగే దేశానికి సంబంధించిన ప్రధాన అంశాలపై చర్చ, తీర్మానాలు ఆమోదించడం జరుగుతుంది.  ఈ సంవత్సరం ఈ సమావేశాలు నాగపూర్‌లో జరిగాయి.  మా.సర్‌ కార్యవాహ్‌ సురేశ్‌ జోషిజీ వార్షిక నివేదిక సమర్పించారు. ఆ నివేదిక సారాంశం -

భారతీయ భాషలను పరిరక్షించుకోవాలిరాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అఖిలభారతీయ ప్రతినిధి సభ సమావేశాల్లో ఆమోదించిన తీర్మానం

భాష ఒక సంస్కృతి, వ్యక్తి, సమాజపు అస్తిత్వానికి, భావ వ్యక్తీకరణకు ప్రధాన వాహకమని అఖిలభారతీయ ప్రతినిధి సభ భావిస్తోంది. మన సంస్కృతి, సంప్రదాయాలు, అద్భుతమైన జ్ఞాన సంపద, అపారమైన సాహిత్యాన్ని పరిరక్షించుకోవడంలో, అలాగే సృజనాత్మక ఆలోచనను పెంపొందించడంలో దేశంలోని వివిధ భాషలు, మాండలీకాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనదేశంలో వివిధ భాషలలోని పాటలు, సామెతలు, గిరిజన గీతాలు మొదలైన మౌఖిక జ్ఞాన సంపద లిఖితపూర్వక సాహిత్యం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.

బుద్ధపూర్ణిమ


వైశాఖ మాసంలో గౌతమ బుద్ధుడు జన్మించిన తిథిని బుద్ధపూర్ణిమగా పరిగణిస్తారు. బుద్ధుడు క్రీ.పూ. 563-483 సంవత్సరాల ప్రదేశ్‌లో ఉన్న ''కుసినగర్‌''లో దేహపరిత్యాగం చేశారు. ఆయన జన్మించిన లుంబినితోపాటు, బిహార్‌లోని బుద్ధగయను బౌద్ధులు పవిత్రంగా భావిస్తారు. బుద్దుడు మొదటి సారి సారనాద్‌లో ధర్మం గురించి బోధించారు. బుద్ధుడు బోధనలతో భారత దేశంతో పాటు, అనేక దేశాలలో ప్రభావితం అయ్యారు. ఈనాటికి చైనా, మంగోళియా, శ్రీలంక, ఆగ్నేయాసియా దేశాలు, జపాన్‌లలో బౌద్ధ మతం అనుసరిస్తున్నారు. 

భగత్‌ సింగ్‌ దేశ భక్తి (స్ఫూర్తి)


1919 ఏప్రిల్‌ 13న అమృత్‌సర్‌లోని జలియన్‌ వాలాబాగ్‌ లో  రౌలట్‌ చట్టానికి నిరసన తెలపడం కోసం సమావేశమైన వేలాది ప్రజల మీద జనరల్‌ డయ్యర్‌ మర ఫిరంగులతో కాల్పులు జరిపించాడు. దాదాపు 360మందిని పొట్టనపెట్టుకున్నాడు. ఆ సంఘటనతో దేశమంతా గగ్గోలెత్తింది.

అనంతమైన జ్ఞానం (హితవచనం)


ప్రాణమున్న శరీరం కేవలం కాళ్ళు, చేతులు, రక్త మాంసాలతో కూడిన సమాహారం కాదు. అనంతమైన దృష్టి, అనంతమైన జ్ఞానం, అనంతమైన శక్తి, అనంతమైన ఆనందం కల్గిన ఆత్మకు శరీరం నివాసం. ఆత్మకు సహచరు లెవ్వరూ ఉండరు. ఆత్మ ఒంటిరిగానే వస్తుంది. ఒంటరిగానే వెళ్ళిపోతుంది. అయితే తనను తాను తెలుసుకొనక పోవటం ఆత్మ తప్పిదం. 

అమరవాణి


శ్లో||    అనాగత్‌ విదానం తు

    కరవ్యం శుభమిచ్చాతా |

    ఆపదం శంకమానేన

    పురుషేణ విపశ్చితా    ||

- శ్రీమద్‌ రామాయణం (3:24:11)   

ప్రముఖులు మాట


దేశంలో నక్సలిజం అంతిమ దశకు చేరుకుంది. గతంలో భద్రతా సిబ్బంది, ప్రజలు ఎక్కువగా చనిపోయేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. మావోయిస్టుల మరణాల రేటు ఎక్కువగా ఉంది. పేదలు, గిరిజనుల అభివృద్దికి మావోయిస్టులు వ్యతిరేకమని ప్రజలకు అర్ధమైంది.    

- రాజ్‌ నాధ్‌ సింగ్‌ , కేంద్ర హోమ్‌ మంత్రి

ఆదిశంకరుల వ్యవస్థానైపుణ్యం


దేశరాజకీయాలు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, దార్శనికులు, మతప్రచారకులు దేశంలో అశాంతికి కారణమవుతున్నప్పుడు, భారతీయ సంప్రదాయానికి ఆధారమైన వైదిక వాజ్ఞ్మయాన్ని సరిగా అధ్యయనం చేసేవారు, వ్యాఖ్యానించే వారు చాలా తక్కువగా ఉన్నప్పుడు శంకరభగవ త్పాదులు జన్మించారు. ప్రజల్లో ధార్మికనిష్టను పెంపొందించడానికి నాలుగుమఠాలను స్థాపించారు.

విభజనవాదాలతో దేశానికి చేటు


మార్చి 25, 2018 నాడు మన ప్రధాని మన్‌కీబాత్‌లో మా|| అంబేడ్కర్‌ దార్శనికతను కొనియాడారు. దేశవిభజన, రెండో ప్రపంచ యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధం గురించి మాట్లాడు తున్నపుడు, టీంఇండియా స్ఫూర్తికి పునాదులు వేసి ఫెడరల్‌ స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని అంబేడ్కర్‌ చెప్పిన విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. పాలనలోని అనేక అంశాల్లో పోటీతత్వ సహకార ఫెడరలిజాన్ని కేంద్రం పాటిస్తున్నదన్నారు.

తెలుగు రాష్ట్రాలలో సంఘ కార్యం


అఖిలభారతీయ ప్రతినిధి సభలో నివేదిక

తెలంగాణాలో శాఖలు

గత 8 సంవత్సరాలలో తెలంగాణాలో శాఖలు 1000కి పైగా పెరిగాయి. ప్రస్తుతం 1608 ప్రదేశాలలో 2412 శాఖలు జరుగుతున్నాయి. అదే 2017లో 1495 ప్రదేశాలలో 2302 శాఖలు ఉండేవి.

దేశమంతటా గోజప మహాయజ్ఞం


'గావో విశ్వస్య మాతరః'....ఆవు అఖిల ప్రపంచానికి తల్లి. 'అమ్మ' అనే మధురానుభూతికి పర్యాయమే 'గోమాత'. భారతీయ సంస్కృతి గోసంస్కృతి. గోమాత నివాసమున్న ఇల్లు, పాఠశాల, కార్యాలయం, వ్యవసాయక్షేత్రం, గ్రామం, దేశంలోని ఏ ప్రదేశమైనా సుభిక్షంగా, శుభంగా, శాంతి యుతంగా ఉంటుంది.

వెల్లివిరిసిన సమరసత


సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో తెలంగాణా, ఆంధ్రప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఫిబ్రవరి వరకూ జరిగిన ఈ కార్యక్రమాల సంక్షిప్త నివేదిక ఇలా ఉంది -

బెండకాయ (గృహ వైద్యం)

 
బెండకాయలో పీచుపదార్ధం పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌ సి, ఏ, కె వంటివాటితోపాటు కాల్షియం, పొటాషియం, ఐరన్‌ , మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌ మరియు ఫాస్ఫరస్‌ కూడా ఉంటాయి. ఈ ఫాస్ఫరస్‌ మెదడుకు చుకురుకుదనాన్ని కలిగిస్తుంది. కనుక ఇది పిల్లలు, యువతకు చాలా మంచిది.

అనన్య భక్తురాలు తరిగొండ వేంగమాంబ


వినా వేంకటేశం ననాథో ననాథా

సదా వేంకటేశం స్మరామి స్మరామి

హరే వేంకటేశం ప్రసీద ప్రసీద

ప్రియం వేంకటేశం ప్రయచ్ఛ ప్రయచ్ఛ

క్రైస్తవ వృద్ధాశ్రమంలో మానవ అవయవాల అక్రమరవాణా


తమిళనాడులోని సెయింట్‌ జోసెఫ్‌ హోస్పైస్‌ అనే వృద్ధాశ్రమంలో జరుగుతున్న దారుణాలు బయటపడ్డాయి. కాంచీపురం జిల్లా సలవక్కం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పాలేశ్వరం గ్రామంలో ఫాదర్‌ రెవరెండ్‌ థామస్‌ అనే క్రైస్తవ ప్రచారకుడు  2011లో సెయింట్‌ జోసెఫ్‌ హోస్పైస్‌ అనే వృద్ధాశ్రమం ఏర్పాటు చేశాడు. అధికారికంగా ఈ వృద్ధాశ్రమనికి 2011లో అనుమతి లభించినప్పటికీ ఇది 2006 నుండే కనీసం 500 మంది వృద్ధులతో నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు. 16 ఎకరాల్లో ఉన్న ఈ వృద్దాశ్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఆసరా లేని, అనాధ వృద్ధులను తీసుకువస్తున్నారు. ఈలాంటి ఆశ్రమాలు రాష్ట్రంలోని దిండిగల్‌ మరియు పాలేశ్వరంలో ఉన్నవి.

జమ్మూ కాశ్మీర్లో మరణించిన ఉగ్రవాది ఖమ్మం జిల్లా మణుగూరు వాసి


తీవ్రవాదపు వేళ్ళు మారుమూల గ్రామాలకు, ప్రదేశాలకు కూడా విస్తరించాయని ఇటీవల కాశ్మీర్‌ లో జరిగిన సంఘటనతో తేలిపోయింది. ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన వ్యక్తి అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ సభ్యుడని తెలిసి రాష్ట్రం ఉలిక్కిపడింది.

సైనికుల పిల్లల విద్యకు సంపూర్ణ ఆర్థిక సాయం ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం

సాయుధ దళాల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గట్టి అండగా నిలుస్తోంది. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన, దివ్యాంగులుగా మారిన సాయుధ దళాల సిబ్బంది పిల్లల చదువులకు సంపూర్ణ ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు గరిష్ఠంగా నెలకు రూ.10,000 వరకు మాత్రమే సాయం అందజేస్తోంది.