ప్రముఖులు మాట


దేశంలో నక్సలిజం అంతిమ దశకు చేరుకుంది. గతంలో భద్రతా సిబ్బంది, ప్రజలు ఎక్కువగా చనిపోయేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. మావోయిస్టుల మరణాల రేటు ఎక్కువగా ఉంది. పేదలు, గిరిజనుల అభివృద్దికి మావోయిస్టులు వ్యతిరేకమని ప్రజలకు అర్ధమైంది.    

- రాజ్‌ నాధ్‌ సింగ్‌ , కేంద్ర హోమ్‌ మంత్రి


మన దేశంలో ఏ ప్రభుత్వా మైనా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. ఏ రాజకీయ పార్టీకి గానీ, ప్రభుత్వానికిగాని ఏ వర్గపు (వీరశైవులు - లింగాయతులు) అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునే హక్కు లేదు.

- సంతోష్‌ హెగ్డే, కర్ణాటక మాజీ లోకాయుక్త 
 దురదృష్టవశాత్తు ప్రజలు ఆర్థిక విషయాలు వర్తమానానికి సంబంధించినవి, పర్యావరణ పరిరక్షణ భవిష్యత్తుకు చెందినదని అనుకుంటున్నారు. కానీ నిజానికి పర్యావరణ పరిరక్షణే ఇప్పటి అత్యవసరమైన విషయం. దీనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.  

-జగ్గీవాసుదేవ్‌, ఈశా ఫౌండేషన్‌