బెండకాయ (గృహ వైద్యం)

 
బెండకాయలో పీచుపదార్ధం పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌ సి, ఏ, కె వంటివాటితోపాటు కాల్షియం, పొటాషియం, ఐరన్‌ , మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌ మరియు ఫాస్ఫరస్‌ కూడా ఉంటాయి. ఈ ఫాస్ఫరస్‌ మెదడుకు చుకురుకుదనాన్ని కలిగిస్తుంది. కనుక ఇది పిల్లలు, యువతకు చాలా మంచిది.

మధుమేహ వ్యాధికి బెండకాయ రసం మంచి మందు. 125 గ్రాముల బెండకాయలు శుభ్రంగా కడిగి, మధ్యకు కోసి ఒక గిన్నెలో వేసి అవి మునిగేట్లు నీళ్లుపోయాలి.

రాస్త్రంతా వాటిని నీళ్లలోనే ఉంచి మర్నాడు పొద్దున్నే బెండకాయలు తీసేసి నీళ్ళను మాత్రమే తాగాలి. మొదట్లో ఈ నీళ్ళు తాగడానికి కాస్త కష్టంగా ఉన్నప్పటికి అలవాటు చేసుకోవాలి. ఇలా కేవలం 7రోజులు తాగితే మధుమేహ సమస్య  నయమవుతుంది.