క్రైస్తవ వృద్ధాశ్రమంలో మానవ అవయవాల అక్రమరవాణా


తమిళనాడులోని సెయింట్‌ జోసెఫ్‌ హోస్పైస్‌ అనే వృద్ధాశ్రమంలో జరుగుతున్న దారుణాలు బయటపడ్డాయి. కాంచీపురం జిల్లా సలవక్కం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పాలేశ్వరం గ్రామంలో ఫాదర్‌ రెవరెండ్‌ థామస్‌ అనే క్రైస్తవ ప్రచారకుడు  2011లో సెయింట్‌ జోసెఫ్‌ హోస్పైస్‌ అనే వృద్ధాశ్రమం ఏర్పాటు చేశాడు. అధికారికంగా ఈ వృద్ధాశ్రమనికి 2011లో అనుమతి లభించినప్పటికీ ఇది 2006 నుండే కనీసం 500 మంది వృద్ధులతో నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు. 16 ఎకరాల్లో ఉన్న ఈ వృద్దాశ్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఆసరా లేని, అనాధ వృద్ధులను తీసుకువస్తున్నారు. ఈలాంటి ఆశ్రమాలు రాష్ట్రంలోని దిండిగల్‌ మరియు పాలేశ్వరంలో ఉన్నవి.

అయితే మొదటి నుండీ ఈ వృద్ధాశ్రమం మీద స్థానిక గ్రామస్తులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆశ్రమంలోని అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులను నిర్ధాక్షిణ్యంగా కర్రలతో కొట్టి హింసిస్తుండే వారని తెలిపారు. మరీ దారుణమైన విషయం ఏమిటంటే మరణించిన వారి మృతదేహాలు ఖననం చేయకుండా కుళ్ళబెట్టి ఉంచడం. ఇందుకోసం వాళ్ళు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. శవాలను కుళ్ళబెట్టే వాల్టులు నిర్మించు కున్నారు. అంతేకాదు మరణించిన (మరణానికి దగ్గరగా ఉన్నవారి) వారి అవయవాలు విదేశాలకు అమ్ముకుంటారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

కుళ్ళబెట్టిన మృతదేహాల నుండి వెదజల్లే దుర్గంధం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఇక వర్షాకాలం అయితే శవాలను కుళ్ళబెట్టిన వాల్టులు నుండి నీరు గ్రామంలోకి వస్తోందంటూ గ్రామస్థులు ఎన్ని సార్లు చెప్పినా ఆశ్రమ నిర్వాహకుడు జోసెఫ్‌ పట్టించుకోలేదు.

దీంతో ఫిబ్రవరి 21న  ఆశ్రమం ప్రాంతంలోని మృతదేహాలతో నిండివున్న ట్రక్కుని గ్రామస్థులు అడ్డగించి, దాడి చేయడంతో అందులో శవాలతో పాటు బ్రతికి ఉన్న అన్నామలై అనే వృద్ధ మహిళ కూడా రక్షించమని ఏడుస్తూ కనిపించింది. ఆమెతో పాటు డిందిగల్‌ ప్రాంతానికి చెందిన సెల్వరాజ్‌ అనే వృద్ధుడిని కూడా గ్రామస్థులు రక్షించారు.

ఈ ఆశ్రమానికి విదేశీ నిధులు వస్తున్న విషయాన్నిFCRA Analyst  అనే పరిశోధనాత్మక ట్విట్టర్‌ హ్యాండిల్‌ వెల్లడించింది. లైట్‌ ఫర్‌ బ్లైండ్‌ అనే క్రైస్తవ సంస్థ కింద ఏర్పాటైన ఈ వృద్ధాశ్రమనికి నిధుల కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇదీ క్రైస్తవ సంస్థలు చేస్తున్న 'సేవ'!