అమరవాణి


శ్లో||    అపార భూమీ విస్తారం

    అగణ్య జనసంకులం |

    రాష్ట్రం సంఘటనాహీనం

    ప్రభావేన్నాత్మరక్షణౌ    ||


- సూక్తి సుధ


భావం :
నివశించడానికి అపారమైన, విస్తారమైన భూమీ ఉంది. లెక్కించలేనంత జనాభా ఉంది. అయితే దేశం ఐక్యత, సంఘటన కోల్పోతే ఆత్మరక్షణ చేసుకోవడం కలలో మాట.