పర్యావరణాన్ని కాపాడుకుందాం


జూన్‌ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణం మానవుని శ్రేయస్సుకుపకరించే అంశం. అభివృద్ధి పేరుతో జల, వాయు, భూ కాలుష్యం కల్గిస్తున్న ప్రపంచ దేశాలు రాబోయే ముప్పును గురించి కూడా ఆలోచించాల్సివుంది. భారతీయ చింతనలో ప్రకృతిని తల్లిగా భావించాం. ప్రకృతితో సమన్వయం, సహకారం మన స్వభావం. కాని పాశ్చాత్యదేశాలు ప్రకృతిని కేవలం ఓ భోగ వస్తువుగానే భావించాయి. అందువలన మానవ సౌఖ్యం కోసం ప్రకృతి శోషణ మొదలు పెట్టారు. 

సంఘ కార్యం సర్వవ్యాపి, సర్వ స్పర్శిసంఘ కార్యాన్ని గురించి తెలిసిన వారికి ప్రముఖ వ్యక్తులు కార్యక్రమాలకు రావడం పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించదు, విడ్డూరంగా అనిపించదు. ఎందుకంటే వివిధ కార్యక్రమాల సందర్భంగా సమాజంలో ప్రముఖులను ముఖ్య అతిధులుగా ఆహ్వానించడం సంఘలో పరిపాటే. ఈసారి తృతీయవర్ష శిక్షావర్గ (శిక్షణ శిబిరం) ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొనవలసిందిగా డా.ప్రణబ్‌ ముఖర్జీని కోరినప్పుడు ఆయన అందుకు అంగీకరించారు.

హిందూ సామ్రాజ్య దినోత్సవం


1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు 'హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. 'డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా' అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం.

శివాజీ నిర్భీతి (స్ఫూర్తి)


భయం ఒక అదృశ్యశక్తి. అది చాలా రకాలుగా బయటపడుతూ ఉంటుంది. అందుకనే పతంజలి మహర్షి''నిర్భయత్వం సన్యాసి లేదా సాధకుడి ముఖ్యలక్షణం''అన్నాడు. శివాజీలో ఆ నిర్భయత్వం కనబడుతుంది. రాజాజయ సింగ్‌ను కలవడానికి వెళ్ళినప్పుడు ఒప్పందం ప్రకారం శివాజీ నిరాయుధుడై,కేవలం ఆరుగురు బ్రాహ్మణులను వెంటబెట్టుకుని వెళ్ళాడు. 

ఆదర్శవంతమైన రాజు (హితవచనం)


శివాజీ మహారాజ్‌కి మించిన మహా నాయకుడు, తపస్వీ, భక్తుడు, ప్రజారంజకుడైన రాజు మరొకరు ఉన్నారా? ఒక మహత్కా ర్యాన్ని జన్మించారు. అసాధారణమైన జీవితం ఆయనది. రాజు అనేవాడు ఎలా ఉండాలో, ఎలా ఉంటాడో ఆయన జీవితం చూస్తే తెలుస్తుంది. హిందూజాతి ఆత్మ చైతన్యానికి ప్రతినిధి ఆయన. చిన్నచిన్న రాజ్యాలన్నీ ఒక ఛత్రం కిందకు వచ్చి ఒక సువిశాలమైన, సమైక్య హిందూ సామ్రాజ్యంగా రూపుదిద్దు కుంటుందని చాటి చెప్పిన సాటిలేని వీరుడాయన.

అమరవాణి


    ఉద్యమం సాహసం ధైర్యం

    బుద్ధి శక్తి పరాక్రమః

    షడేతే యత్ర వర్తన్తే

    తత్ర దేవ సహాయకః

ప్రముఖులు మాట
సైనికులు అందరివంటివారు కాదు. మనుషుల్లోనే వారిది అరుదైన జాతి. అంకితభావానికి, గౌరవమర్యాదలకు సైన్యం ప్రతీక. అందుకే జవానును చూడగానే ప్రజలు గర్వపడతారు.
  - రామ్‌నాధ్‌ కోవింద్‌, భారత రాష్ట్రపతి

కథువాలో అసలు ఏం జరిగింది?


నిజనిర్ధారణ బృందపు నివేదిక

జమ్ము కాశ్మీర్‌ లోని కథువ జిల్లాలోని బక్రెవాల్‌ సామాజిక వర్గానికి చెందిన ఎనిమిది సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచారోదంతంలోని నిజనిజాలను శోధించేందుకు మేధావులు, విద్యా వేత్తలతో కూడిన బృందం (జిఐఏ) ఆ ప్రాంతంలో పర్యటించి నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ బృందం ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. ఆ సత్యశోధన జట్టు పరిశోధనలో తేలిన కీలక అంశాలు -

హిందూతనం, హిందూత్వం ఒకటికావా?


ఈ మధ్యకాలంలో బాగా చర్చకు వస్తున్న అంశం, పదం ఏదైనా ఉందంటే అది హిందూత్వం. హిందూత్వాన్నే హిందూతనం అని కూడా అనుకోవచ్చును. బ్రిటిష్‌ వారి నుండి ఈ హిందూత్వం అనే మాట వాడుకలోకి వచ్చింది. కనుక హిందూత్వం, హిందూతనం అనే రెండు పదాలు సమానార్ధాకాలు. అయితే వాటి వాడుకలో తేడా ఉంది.

ఇదీ క్రైస్తవ సెక్యులరిజం!


నాలుగేళ్లలో దేశంలో నెలకొంటున్న పరిణామాలను పరమతాల వాళ్లు తట్టుకోలేక పోతున్నారు. దేశవ్యాప్తంగా వస్తున్న చైతన్యంతో వాళ్లకు వాళ్లే భుజాలు తడుముకుంటున్నారు. ఇంతకాలం సాగించిన ఆరాచకం.. దశాబ్దాల తరబడి అవలంబిస్తున్న తమ అనైతిక కార్యకలాపాలకు అనువైన పరిస్థితులు లేవని గాభరా పడుతున్నారు.

సంఘశిక్షా వర్గలు


ప్రథమ వర్ష
హైదరాబాద్‌ అన్నోజీ గూడాలో మే 4 నుండి 25 వరకూ జరిగిన ప్రథమవర్ష సంఘశిక్షావర్గలో తెలంగాణా ప్రాంతానికి చెందిన 419మంది స్వయంసేవకులు శిక్షణ పొందారు. 25న జరిగిన ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిబిఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ, ముఖ్యవక్తగా ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ సహ ప్రాంత ప్రచారక్‌ లింగం శ్రీధర్‌ పాల్గొన్నారు.

విదేశీ విత్తన కంపెనీలకు చుక్కెదురు


విత్తన కంపెనీలకు విత్తనాలు సరఫరా చేయడానికి వీలులేదంటూ మోన్సాంటో పై డిల్లీ హైకోర్ట్‌ నిషేధం విధించింది. దీనితో విత్తన విక్రయ రంగంపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్న విదేశీ కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. భారత పేటెంట్‌ చట్టంలో పేర్కొన్నవిధంగా విత్తనాలు, జీవ వైవిధ్యాన్ని ఎలాంటి రూపంలో ప్రభావితం చేయడానికి, పేటెంట్‌ చేయడానికి వీలులేదని హైకోర్ట్‌ స్పష్టం చేసింది. దీనితో జన్యు మార్పిడి పంటలను వ్యతిరేకిస్తున్నవారి వాదనకు బలం చేకూరినట్లైంది. అలాగే మొక్కల్లో జన్యు పరమైన పదార్ధాన్ని పేటెంట్‌ (యాజమాన్య హక్కులు) చేయడానికి వీలులేదనే మొక్కల వివిధత్వం, రైతుల హక్కుల పరిరక్షణ చట్టం, 2001 నిబంధనను కూడా హైకోర్ట్‌ సమర్ధించింది. దీనితో మన దేశంలో పెరిగే మొక్కలు, వాటిలోని జీవపదార్ధాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్న మోన్సాంటో వంటి విదేశీ కంపెనీల ప్రయత్నాలకు చుక్కెదురైంది.

తిరుమలపై సిబిఐ విచారణకు విశ్వ హిందూ పరిషత్‌ డిమాండ్‌


హిందువుల పుణ్య క్షేత్రమైన తిరుమల తిరుమల దేవస్థానం వ్యవహరిస్తున్న తీరుపై విశ్వ హిందూ పరిషత్‌ తెలంగాణ అధికార ప్రతినిధి శ్రీ రావినూతల శశిధర్‌ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తక్షణమే కేంద్ర ఇంటలిజెన్స్‌ సంస్థ సిబిఐ ద్వార విచారణ చేయాలని డిమాండ్‌ చేసారు. దాంతో పాటు ఈ వ్యవహారంలో ఆలయ జే ఈ ఓ మరియు ఎండోమెంట్స్‌ ఆఫీసర్‌ పని తీరుపై పలు అనుమానాలను వెలిబుచ్చారు.

మహిళల రక్షణ కోసం...


ప్రకృతినే మాతృస్వరూపంగా భావించి పూజించే దేశం మనది. అలాంటి మనదేశంలో పాశ్చాత్య పోకడల ప్రభావం వల్ల నేడు మహిళలపై అనేక రకాల అక్రమాలు, అత్యాచారాలు జరుగు తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ క్షేమంగా తిరిగి వస్తుందో లేదో అని భయంతో ఇంటివాళ్లు ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. సరే దీనికి ఎవరు కారణం అన్న వాదవివాదాలను పక్కన పెడితే మహిళల రక్షణ అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందన్నది వాస్తవం. ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని చర్యలు తీసుకున్నా రోజురోజుకు పరిస్థితి దిగజారుతుందే తప్ప మార్పు రావడం లేదు. దేశ ఆర్థిక రాజధానిగా పేర్కొనే ముంబాయిలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. అయితే ఈ పరిస్థితిని అదుపులో పెట్టడానికి అక్కడ కొన్ని చర్యలు తీసుకుంటున్నారు.

మునగాకు
మనం నిరంతరం తీసుకొనే ఆహార పదార్థాల్లో, మన ఆరోగ్యానికి దోహదం చేసే పలు కూరగాయాలల్లో మునగ ప్రత్యేక విశిష్టత కలిగి ఉంది. మన దైనందిన ఆహారంలో అంతర్భాగమై మన ఆరోగ్య పరిరక్షణకు నిరంతరం దోహద పడుతుంది. మునక్కాయలే కాకుండా ఆకులలోను ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

హిందూ వ్యతిరేక శక్తుల అసత్యపు ప్రచారం


గౌరవనీయ రాష్ట్ర పతి శ్రీ రాం నాథ్‌ కోవింద్‌ కుటుంబ సమేతంగా మే నెల 14 నాడు రాజస్థాన్‌ పర్యటన జరిపారు. ఈ పర్యటనలో భాగంగా వారు పుష్కర్‌లోని బ్రహ్మగుడిలో మరియు పుష్కర్‌ ఘాట్‌  పూజలు నిర్వహించారు. స్థానిక ఆలయ అధికారులు విస్తత ఏర్పాట్లు చేశారు. 

హైదరాబాద్‌లో పెరుగుతున్న రోహింగ్యాల సంఖ్య

యన్మార్‌ అంతర్యుద్ధం కారణంగా అక్కడి రోహింగ్యాలు పెద్ద ఎత్తున దేశంలోకి ప్రవేశిస్తు న్నారు. అయితే, వారిని శరణార్థులుగా గుర్తించేది లేదని స్పష్టం చేసిన కేంద్రం, ఇప్పటికే దేశంలోకి ప్రవేశించిన వారిని పంపించి వేస్తామని కేంద్రం పలుమార్లు ప్రకటించింది.