ఇదీ క్రైస్తవ సెక్యులరిజం!


నాలుగేళ్లలో దేశంలో నెలకొంటున్న పరిణామాలను పరమతాల వాళ్లు తట్టుకోలేక పోతున్నారు. దేశవ్యాప్తంగా వస్తున్న చైతన్యంతో వాళ్లకు వాళ్లే భుజాలు తడుముకుంటున్నారు. ఇంతకాలం సాగించిన ఆరాచకం.. దశాబ్దాల తరబడి అవలంబిస్తున్న తమ అనైతిక కార్యకలాపాలకు అనువైన పరిస్థితులు లేవని గాభరా పడుతున్నారు.

ప్రధానంగా పాస్టర్లు, ఆర్చి బిషప్‌లు ఈ తరహా భయాందోళనకు గురవుతున్నారు. హిందువుల్లో రోజు రోజుకూ చైతన్యం పెరుగుతోందని, ఇంతకాలం నిరుపేదలు, అవసరార్థులకు ఎరవేసి మత మార్పిడులు యధేచ్ఛగా సాగించుకున్న పరిస్థితులు ఇకపై మగ్యమవుతున్నాయన్న ఆక్రోశంతో, బాధతో అల్లాడిపోతున్నారు మత మార్పిడి దారులు. అందుకే ప్రజాస్వామ్యం, లౌకికవాదం, మత సామరస్యం పేరిట బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.

గుజరాత్‌ ఎన్నికల్లో, నాగాలాండ్‌ఎన్నికల్లో హిందూ అభ్యర్థులకు ఓట్లు వేయొద్దంటూ ఆర్చ్‌బిషప్‌లు బహిరంగ ప్రచారానికి తెగించారు. ఏకంగా లేఖలే విడుదల చేశారు. ఇప్పుడు ఢిల్లీ ఆర్చ్‌బిషప్‌ 2019 ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత సర్కారుపై.. హిందూ సమాజంపై విషం చిమ్ముతూ బహిరంగ లేఖ వదిలారు. 

దేశంలో కల్లోల రాజకీయ వాతావరణం నెలకొందని, ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో ఉన్నాయంటూ ఢిల్లీ ఆర్చ్‌బిషప్‌ అనిల్‌కౌటో లేఖ రాశారు. 2019 లోక్‌సభ ఎన్నికలు టార్గెట్‌చేస్తూ రాసిన ఈ లేఖ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దేశం కోసం ప్రార్థించా లంటూ క్రైస్తవ మతబోధకులను ఉద్దేశించి ఆయన లేఖ రాశారు.

దేశ రాజధాని ఢిల్లీలోని క్రైస్తవ మతాధికారు లకు, ప్రబోధకులకు, పాస్టర్లకు అడ్రస్‌చేస్తూ ఆర్చ్‌బిషప్‌ అనిల్‌కౌటో ఈ లేఖ రాశారు. మే నెల 13వ తేదీ నుంచి ప్రతీ ఆదివారం అన్ని చర్చిల్లో ఈ రకమైన ప్రార్థనలు జరగాలని బిషప్‌ అనిల్‌ కౌటో ఆకాంక్షించారు. అంతేకాదు.. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా క్యాంపెయిన్‌వింగ్‌ను కూడా ప్రారంభించారు.

 గుజరాత్‌ఎన్నికల సందర్భంగా గత యేడాది నవంబర్‌21వ తేదీన గాంధీనగర్‌ అర్జిడయాసిస్‌ పేరిట ఆర్చ్‌బిషప్‌ థామస్‌మాక్వాన్‌ సంతకంతో ఓ లేఖ విడుదలైంది. జాతీయ వాద దళాల నుంచి భారత దేశాన్ని రక్షించేందుకు.. క్రైస్తవులందరూ ప్రార్థన చేయాలని, జాతీయ వాదులంటూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్లకు ఓటు వేయొద్దని ఆ లేఖ సారాంశం. అంతేకాదు.. మనదేశం లౌకిక ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కూడా లేఖలో లెక్చర్లు ఇచ్చారు. గుజరాత్‌ఎన్నికల ప్రభావం దేశమంతా కనిపించే అవకాశం ఉన్నందున.. ఇక్కడ ఎన్నికల్లో సైలెంట్‌గా తమపని తాము చేసుకుపోవాలని పిలుపునిచ్చారు ఆర్చ్‌బిషప్‌.

నాగాలాండ్‌లోనూ ఇదే పరిస్థితి రిపీట య్యింది. నాగాలాండ్‌ బాప్టిస్ట్‌చర్చ్‌ కౌన్సిల్‌పేరిట ఎన్నికల సమయంలో ఈయేడాది ఫిబ్రవరి 28వ తేదీన లేఖ విడుదలయ్యింది. ఎన్నికల్లో మీరు త్రిశూలం వైపు వెళ్తారా..? సిలువవైపు నిలుస్తారా? అని ప్రశ్నిస్తూ కౌన్సిల్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అట్సిడోలి సంతకంతో ఈ బహిరంగలేఖ సంధించారు. జాతీయవాదులకు ఓటు వేయొద్దని చర్చ్‌కౌన్సిల్‌ పిలుపునిచ్చింది.

ఇలాంటి భయంకర పరిణామాలు సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మతం పేరిట ఈ కుప్పిగంతుల వ్యవహారాలు అవసరమైనంత స్థాయిలో ప్రచారంలోకి రాకున్నా.. చాపకింద నీరులా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు దాపురించాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికలకు యేడాది లోపే గడువు ఉన్నందున సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. భారతీయ సంస్కృతిని దెబ్బతీసే ఇలాంటి చర్యలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 

- హంసిని సహస్ర సాత్విక