ప్రముఖులు మాట
సైనికులు అందరివంటివారు కాదు. మనుషుల్లోనే వారిది అరుదైన జాతి. అంకితభావానికి, గౌరవమర్యాదలకు సైన్యం ప్రతీక. అందుకే జవానును చూడగానే ప్రజలు గర్వపడతారు.
  - రామ్‌నాధ్‌ కోవింద్‌, భారత రాష్ట్రపతి


 
దేశభక్తి భావన పెంచడం కోసం మసీదులన్నింటి పైనా (చైనా) జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని చైనాలో ఇస్లామిక్‌ అసోసియేషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

-రాంమాధవ్‌, బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి

 

ప్రాచీన పరంపరను కాపాడుకునేందుకు మనం ఆచారాలు, పద్ధతులను పాటించడం నేర్చుకోవాలి. ప్రతిరోజూ దీపం వెలిగించడం, దేవుడికి పూలు సమర్పించడం వంటివి ఆచరిస్తే అది పిల్లలు చూసి వాళ్ళూ అనుసరిస్తారు. ఆ విధంగా మన ప్రాచీనపరంపరపట్ల అవగాహన, శ్రద్ధ కలుగుతాయి.

- శ్రీశ్రీ రవిశంకర్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌