కథువాలో అసలు ఏం జరిగింది?


నిజనిర్ధారణ బృందపు నివేదిక

జమ్ము కాశ్మీర్‌ లోని కథువ జిల్లాలోని బక్రెవాల్‌ సామాజిక వర్గానికి చెందిన ఎనిమిది సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచారోదంతంలోని నిజనిజాలను శోధించేందుకు మేధావులు, విద్యా వేత్తలతో కూడిన బృందం (జిఐఏ) ఆ ప్రాంతంలో పర్యటించి నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ బృందం ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. ఆ సత్యశోధన జట్టు పరిశోధనలో తేలిన కీలక అంశాలు -

- విచారణ కాలవ్యవధి పది, పన్నెండు రోజుల్లోనే మూడు విచారణ జట్లను మార్చారు. విచారణ చేపట్టిన జమ్ము క్రైంబ్రాంచ్‌ జట్టులో సమతూకం లోపించింది.  ఈ టీమ్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఉర్ఫాన్‌ వానీ మరియు నస్సర్‌ హుస్సైన్ల మీద ఇది వరకే ఆరోపణలున్నాయి. వీటినుండి వాళ్ళు నామమాత్రపు న్యాయవిచారణతో తప్పించుకున్నా వీరికి జమ్ము అంటే గిట్టదని తెలుస్తోంది .

- చార్జ్‌ షీట్‌ లో లోపాలు ఉన్నాయి. చార్జీషీట్‌ లో కనీసం ముగ్గురు వ్యక్తుల ద్వారా అనేక రోజులు అత్యాచారం జరిగిందని ఉంది. కానీ ఇది పోస్టు మార్టం నివేదికలో ఇవ్వబడ్డ గాయాల తాలూకు వివరాలతో సరిపడట్లేదు. నేరస్థలాన్ని చార్జేషీట్లో ''దేవిస్థాన్‌'' గా పేర్కొన్నారు కానీ వాస్తవంగా అది ఒక కులదేవత స్థానము ఒక ''దేవ్‌ స్థానము రసన గ్రామ పొలిమేర ప్రదేశము. నేరస్థలము 20I35 అడుగుల కొలతలు కలిగి ఏమి వసతులు లేని ఒక గది. జనవరి 13,14,15 తేదీలలో లోరీ, సంక్రాంతి, యజ్ఞం మరియు భండారాల సందర్భంగా ప్రజలు వందల సంఖ్యలో అక్కడ ఉన్నారు. నాలుగు అడుగుల ఎత్తులో,మూడున్నర అడుగుల బల్ల కింద ఒక బాలికను దాచడం సాధ్యమా? మూడు ద్వారాలు మూడు కిటికీలు వాటికి గ్రిల్‌ కలిగిన గదిలో ఒక బాలికను దాచడం సాధ్యమా? బాలికను రహస్యంగా దాచడానికి ఈ స్థలం నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉందా? అనేవి సమాధానం లేని ప్రశ్నలు. విశాల్‌ జంగోత్ర నేరం జరిగిన రోజులలో రసనలో ఉన్నాడని చార్జ్‌ షీట్‌ లో ఉంది. కానీ అతను మీరట్‌ ,ఉత్తర్ప్రదేశ్‌ లో పరీక్షలు రాస్తున్నాడని నివేదికలు చెప్తున్నాయి.కాగా ఈ విషయమై నిజాన్ని నిర్ధారించుకోకుండానే చార్జీషీట్‌ లో చేర్చారు.

- విచారణ జరగని కోణాలు కొన్ని ఉన్నాయి. 16 జనవరి 2018 నాడు రసన గ్రామంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్‌ పెద్ద శబ్దంతో పేలింది దాంతో అక్కడ అంతా చీకటి ఆవరించిందని గ్రంస్తులు చెప్తున్నారు. బిషేన్‌ సింగ్‌ అనే వ్యక్తి తను ఒక బుల్లెట్‌ బండి శబ్దం విన్నానని మరలా ఒక అరగంట తరువాత మళ్ళా అదే బండిని తిరిగి రావడం చూశానని, ఇద్దరు వ్యక్తులు ముసుగులు కప్పుకుని వెళ్తున్నారని చెప్పాడు. దీన్ని క్రైమ్‌ బ్రాంచ్‌కి చాలా సార్లు నివేదించినా దీని పై విచారణ చేపట్టలేదు.

 నిజనిర్ధారణ బృందం గమనించిన ప్రధాన విషయాలు

1.    బృందం ఎవరితో మాట్లాడిందో వారందరూ ముక్తకంఠంతో కథువ  ఉదంతాన్ని ఖండిం చారు నేరస్తుడిని కానీ నేరాన్ని కానీ సమర్ధించ లేదు.

2.    అక్కడి ప్రజలకి క్రైమ్‌ బ్రాంచ్‌ విచారణ పట్ల విశ్వాసం లేదు .

3.    సిబిఐకి ఈ కేసుని అప్పగించాలని అందరూ కోరారు

4.    విచారణలో భాగంగా క్రైమ్‌ బ్రాంచ్‌ మానవ హక్కుల ఉల్లంఘన కు పాల్పడిందని చాలా మంది తెలిపారు ఎవర్నిపడితే వాళ్ళని పట్టుకొని విచారణ పేరిట హింసించారని, వేధించారని చెప్పారు

5.    నిందితుడి కుటుంబం తమ పట్ల మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని అలాగే నిందితుని పట్లా జరిగిందిని, అదీ పోలీసు కస్టడీలో జరిగిందని తెలిపారు.