తిరుమలపై సిబిఐ విచారణకు విశ్వ హిందూ పరిషత్‌ డిమాండ్‌


హిందువుల పుణ్య క్షేత్రమైన తిరుమల తిరుమల దేవస్థానం వ్యవహరిస్తున్న తీరుపై విశ్వ హిందూ పరిషత్‌ తెలంగాణ అధికార ప్రతినిధి శ్రీ రావినూతల శశిధర్‌ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తక్షణమే కేంద్ర ఇంటలిజెన్స్‌ సంస్థ సిబిఐ ద్వార విచారణ చేయాలని డిమాండ్‌ చేసారు. దాంతో పాటు ఈ వ్యవహారంలో ఆలయ జే ఈ ఓ మరియు ఎండోమెంట్స్‌ ఆఫీసర్‌ పని తీరుపై పలు అనుమానాలను వెలిబుచ్చారు.

1000 సంవత్సరాల పోటు తవ్వకాలకు సంబంధించి ఎలాంటి నియమనిబంధనలు పాటించారో వాటికి సంబంధించి అధికారిక అనుమతులు ఎమి తీసుకున్నారో ఎండోమెంట్స్‌ ఆఫీసర్‌ ఎందుకు వివరించ లేక పోతున్నారు?

స్వామి వారికి 25 రోజులు భోజనం పెట్టని విషయం తెలియని ఈ ఓ కు పురాతన ఆభరణాలు భధ్రంగా ఉన్న విషయం తెలుసు అని నమ్మగలమా?

స్వామి వారి నగల మాయం పై వచ్చిన తాజా ఆరోపణలపై కనీస ప్రాధమిక ధర్యాప్తు కూడా జరుపకుండా పాత రిపోర్టులను చూపెడుతూ ఇప్పుడు కూడా అంతా బాగానే ఉందని ఈ ఓ గారు మీడియాకు చెప్పడం దాన్ని గుడ్డిగా నమ్మిన మీడియా తాటిపండు అక్షరాలతో అంతా క్షేమమే అని వ్రాయడం హస్యాస్పదం కాదా?

ఆరోపణలు వచ్చాక స్వామి వారి నగలు ఈ.ఓ ప్రత్యక్షంగా చుసారా, తిరుమల జీయంగార్లకు కానీ నూతనంగా తాను నియమించిన ప్రధాన అర్చకులకు గాని కనీసం చూపెట్టకుండా అంతా బాగుంది అని చిలుక పలుకులు పలికితే దాన్ని హిందూ సమాజం గుడ్డిగా నమ్మాలా?

ఎందుకు వెంటనే రికార్డులు సీజ్‌ చేసి తాజాగా ఆభరణాల లెక్కింపు మరియు దర్యాప్తు చేయించడానికి ప్రభుత్వం వెనుకడుగు వేయడంలో కారణాలు ఏమై ఉంటాయి?

రమణదీక్షితులు గారు చేసిన ఆరోపణలను పక్కదారి పట్టించడానికి వారిపై వ్యక్తిగత ఆరోపణలు చేయించడం వాటిని పతాక శీర్షికలతో ప్రచురించడంలో దాగున్న కుట్ర ఏమిటి?

స్వామి వారి నగలు అన్యమతస్థుల చేతిలో భధ్రంగా ఉన్నాయి అని చెబితే సమాజం నమ్మాలా?

ఇవి సగటు భక్తుని ప్రశ్నలు. ఇక్కడ సమస్య ప్రభుత్వ ముఖ్య మంత్రిదో లేదా రమణదీక్షితులు గారిది అని చూడొద్దు ఇది తిరుమల తిరుపతి పవిత్రత అక్కడి వ్యవస్థల సంరక్షణ అంశంగా పరిగణించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించి జరుగుతున్న చర్చకు ముగింపు పలికి తిరుమల పవిత్రత కాపాడాలని శశిధర్‌ డిమాండ్‌ చేశారు.