వన సంరక్షణలో టుడూ మహిళలు


టుడూజాతికి చెందిన మహిళ జమునా టుడూ. ఒరిస్సాలో పుట్టిపెరిగి వివాహానంతరం ఈమె ఝార్ఖండ్‌ ముతర్ధం గ్రామంలో స్థిరపడింది. ''వృక్షాలను రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి''అనే విషయం ఆమె మనసులో నాటుకుపోయింది. అందుకే జమునకు చెట్లంటే అమితమైన ప్రేమ. రక్షాబంధన్‌ రోజున సోదరీ, సోదరులకు రాఖీకట్టడం ఒక వంతు అయితే ఈమె చెట్టకు రాఖీలు కట్టి, చెట్లను తన తోబుట్టువులుగా చూసుకునేది.

సూర్యుడు 'అస్తమించని' గ్రామం!!బంజేరుపల్లి.. తెలంగాణలో మెదక్‌ జిల్లా సిద్దిపేట మండలంలో ఒక చిన్న పల్లెటూరు. 120 ఇళ్ళు ఉంటాయి. నాలుగేళ్ల క్రితం కరెంటు కోతలతో గ్రామంలోని ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతూ ఉండేవారు. విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ ఊరి రూపమే మారిపోయింది. ఎందుకంటే  ఈ గ్రామంలో సూర్యుడు ఎప్పుడూ 'అస్తమించడు'! పగలంతా వెలుతురు ఇచ్చి, రాత్రయ్యే సరికి సోలార్‌ విద్యుత్‌ రూపంలో పల్లెకు వెలుగునిస్తాడు. ఈ గ్రామంలో అన్ని ఇళ్ళు ఇప్పుడు పూర్తిగా సౌర విద్యుత్‌ ను ఉపయోగించుకుంటున్నాయి. ప్రతి ఇంటి పైకప్పు మీద సౌర ఫలకాలు కనిపిస్తాయి. 

గురు పౌర్ణమి
ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ జరుపుకొంటారు.

వ్యాసాయ విష్ణు రూపాయ

వ్యాస రూపాయ విష్ణవే

నమో వైబ్రహ్మనిధయే

వాసిష్ఠాయ నమోనమః

బెంగాల్‌ విభజనను అడ్డుకున్న శ్యామప్రసాద్‌ ముఖర్జీ (స్ఫూర్తి)


 
'ఏక్‌ దేశ్‌ మే దో విధాన్‌, దో ప్రధాన్‌, దో నిశాన్‌ నహి చెలేగా,  నహి చెలేగా' అంటూ జాతీయ సమైక్యత కోసం పోరాడారు డా.శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ. ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు అశుతోష్‌ ముఖర్జీ కుమారుడైన శ్యామ ప్రసాద్‌  రెండవసారి బెంగాల్‌ విభజన జరగకుండా అడ్డుకున్నారు. 1946లో కలకత్తా విశ్వవిద్యాలయ నియోజక వర్గం నుంచి బెంగాల్‌ అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన ఆ తరువాత రాజ్యాంగ సభలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించారు.

కర్మయోగమే భగవద్గీత (హితవచనం)
పాశ్చాత్య విద్యా విధానం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అగౌరపరచి భారతీయ విద్యార్థులను చిన్న బుచ్చే విధంగా ఉంది. ప్రజలకు మంచి విద్యను అందించటం ద్వారానే, వాళ్ళను మంచి పౌరులుగా  తీర్చిదిద్దవచ్చు. ప్రతి భారతీయుడికి భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నత్యాన్ని గురించి బోధించాలి.

ప్రముఖులు మాటమనం కోపం, హింస, ఘర్షణ నుండి సమరసత, సౌఖ్యంవైపు వెళ్ళాలి. ఇందు కోసం స్వయం సేవకులు వారధిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే వీటి ద్వారానే సంతోషభరితమైన భారతాన్ని నిర్మించగలుగుతాము.

      - ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి

అమరవాణి

    ఉపకారేణ నీచానాం

     అపకారోహి జాయతే

     పయః పానం భుజంగానాం

     కేవలం విష వర్ధనం

పదసంపద పోగొట్టుకుంటున్నాం


మన భాష, మాండలీకం, పదాలు ఉపయో గించకపోతే క్రమంగా కనుమరుగవుతాయి. 'భాష ఒక వ్యక్తి, సమాజపు గుర్తింపు అవుతుంది. అలాగే అది సంస్కృతిని నిలబెట్టిఉంచే, వ్యాపింపచేసే వాహకం.' కానీ నేడు అనేక భారతీయ భాషల వాడకం క్రమక్రమంగా తగ్గిపోతోంది. అలాగే అనేక విదేశీ భాషా పదాలు మన భాషల్లోకి చొచ్చుకు వచ్చేశాయి. ఇప్పటికే అనేక భారతీయ భాషలు, మాండలీకాలు మాయమయ్యాయి. ఇది చాలా విచారించవలసిన విషయం.

రాజస్థాన్‌లో ప్రాచీన నీటి సంరక్షణ విధానాలు
రాజస్థాన్‌ దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటి. ఇది జనాభాపరంగా తొమ్మిదివ స్థానంలో ఉంది. అయినప్పటికీ వర్షపాతానికి సంబంధించి అన్ని రాష్ట్రాల కన్నా వెనుకబడి ఉంది. ఒకానొకప్పుడు ఇక్కడ సముద్రం నుంచి చల్లని గాలులు వీస్తుండేవి. కానీ నేడు ఇసుకతో కూడిన గాలి దుమారాలు కనిపిస్తున్నాయి.

దేశ ప్రగతిలో సంస్కృతి పరంగా మనమంతా ఒక్కటే అనే భావన కీలకం


సంస్కృతి ఫౌండేషన్‌ కార్యక్రమంలో వక్తలు

దేశ ప్రగతి లో సంస్కృతి పరంగా మనమంతా ఒక్కటే అనే భావన కీలక పాత్ర పోషిస్తుందని గౌరవనీయ దేశ రక్షణ శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ అన్నారు. దేశంలోని వివిధత్వాన్ని పరిరక్షించడానికి ఒక సమైక్యతా సూత్రం అవసరమని, దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

మానవ హక్కులపై మనకు పాఠాలా? !

జమ్మూ కాశ్మీర్‌లో, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరగుతున్నవని, దీనిపై అంతర్జాతీయ విచారణ జరపాలంటూ ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి భాతదేశంపై కొన్ని విమర్శలు చేసింది. ఈ సమితిలో 47 సభ్య దేశాలున్నాయి. సమితి నివేదికలో అనేక అంశా లున్నాయి. మయన్మార్‌లో రోహింగ్యాల గురించిన విషయాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయిల్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని, ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొన్నందుకు ఇటీవలే అమెరికా ఈ సమితి నుంచి వైదొలగింది. జమ్మూ కశ్మీరుపై మొదటిసారి ఈ సమితి నివేదిక విడుదల చేసింది.

కాశీ లో ఆవుపేడతో దహన సంస్కారాలు


గంగానది ప్రక్షాళన దిశగా అడుగులు..

కాశీకి పోతే కాటికి పోయినట్టే' అనే నానుడి భారతీయులకు తెలిసిందే. జీవితంలో ఒక్కసారైనా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలని కోరుకోని హిందువు ఉండడు. అంతటి పుణ్య తీర్థాన్ని కాపాడేందుకు, అక్కడి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కృషి చేస్తోంది.

గాంధీ ఆస్పత్రిలో సేవాభారతి సేవలు'వైద్యో నారాయణో హరిః' అన్నారు. కానీ ఆ వైద్యుడు రోగికి సరైన వైద్యం చేయాలంటే తగిన పరిస్థితులు, సౌకర్యాలు కూడా ఉండాలి. అవి లేనప్పుడు వైద్యుడు ఎంత చిత్తశుద్ధితో, శ్రద్ధతో తన పని చేయాలనుకున్నా ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే ఉంటుంది. పేదలకు ఆధారమైన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సౌకర్యాల లేమి కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది.ముఖ్యంగా భాగ్యనగర్‌లోని గాంధీ, ఉస్మానియావంటి ప్రధాన, పెద్ద ఆసుపత్రుల్లో ఈ లోటు బాగా ఉంది. ప్రతిరోజు వేలసంఖ్యలో రోగులు, వారితోపాటు సహాయకులు వస్తుంటారు. ఏ వార్డు ఎక్కడ ఉందో, ఏ డాక్టర్‌ను ఎప్పుడు కలవాలో చెప్పేవారు లేక ఇబ్బందులు పడతారు. అలాగే రోగులతోపాటు వచ్చిన సహాయకులు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. ఇక వార్డుల్లో కూడా సదుపాయాలు అంతంతమాత్రమే.

బొప్పాయి


గృహిణులు బొప్పాయి గురించి తెలియని వారుండరు, అవును కదా...

బొప్పాయి ముక్కలు ఆకులు... గింజలు... అన్నీ ఔషధాలు... నిజంగా మనకు దేవుడు ఎన్నో వరాలు ఇచ్చేడు, మజ్జ ధాతు (పశీఅవ ఎaతీతీశీష) నిర్మాణంకి ఎంతో మేలు చేస్తుంది. తెల్ల రక్తకణాలు.. ఎర్ర రక్తకణాలు పెంచే ఔషధం

గింజలు లివర్‌కి మంచిది. ఇందులో లభించే పెప్సీన్‌ అనే ఎంజైమ్‌ మనం తినే ఆహారంలోని ప్రోటీన్‌లను జీర్ణం చేస్తుంది.

గ్రామదేవతైన పేరంటాలు వెంగమాంబ


వెంగమాంబ అనే పేరంటాలు ఆలయం నెల్లూరుజిల్లా నర్రవాడలో ఉంది. పేరంటాలు అంటే సహగమనం చేసిన స్త్రీ. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. శ్రీకృష్టదేవరాయలు కాలం నుంచే ఇక్కడి అమ్మవారికి పూజలు జరుగుతున్నట్లు ఆధారా లున్నాయి. ఇక్కడి అమ్మవారిని స్థానికులు ఎంతో భక్తిప్రపత్తులతో కొలుస్తారు. ప్రతి ఏటా జ్యేష్ట మాసంలో పౌర్ణమిరోజుతో మొదలుపెట్టి ఐదురోజుల పాటు వెంగమాంబ బ్రహ్మూెత్సవాలు నిర్వహిస్తారు.

దళితులపై 'దాడి'

అసత్యాలు, అపోహలు ప్రచారం చేయడం ద్వారా సమాజంలో కలతల్ని, కల్లోలాన్ని రేపేందుకు కొన్ని శక్తులు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఒక సంఘటన, దేశంలో మహిళల రక్షణకు గురించి ఒక విదేశీ సంస్థ వెలువరించిన నివేదిక, రాష్ట్రపతి పూరీ దేవాలయ సందర్శన పై వివాదం వంటివి అటువంటి దుష్ప్రచారానికి, కుట్రకు ఉదాహరణలు.