స్వాతంత్య్రం వచ్చింది.. సాధించిందేమిటి?


వేల సంవత్సరాల విదేశీ దాడులను మన దేశం ఎదుర్కొన్నది. చివరిగా బ్రిటీషువారు 325 సంవత్సరాలు మనల్ని పరిపాలించారు. విభజించు, పాలించు నీతిని అనుసరించారు. 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో దేశ ప్రజలందరూ మత భేదాలు, వర్గ విభేదాలు మరచి భారతీయులుగా ఉద్యమించారు. ఇది బ్రిటీషువారికి రుచించలేదు. సన్యాసుల విప్లవం జరిగింది. బంకించంద్రచటర్జీ 'వందేమాతరం' అనే మంత్రాన్నిచ్చారు. విప్లవ కారులు బ్రిటీషుపాలకుల నెదిరించి, తెగించి ఉరికంబాల నెక్కారు. 

కృషితో నాస్తి దుర్భిక్షంఇది ఒక ఆదర్శవంతమైన కథ.

వీధులను శుభ్రపరిచే ఒక మహిళ తన పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దిందో తెలియజేసే కథ. సుమిత్ర దేవి గత 30 సంవత్సరాలుగా జార్ఖండ్‌ ప్రాంతంలోని జజకూ టౌన్‌ షిప్‌లో వీధులను శుభ్రపరిచే పని చేసింది. చివరికి ఉద్యోగవిరమణ సమయంలో ఆమె ఎంతో గౌరవ మన్ననలు అందుకుంటుందని ఈ ప్రాంతంలో ఎవరు ఊహించలేదు.

వరలక్ష్మీ వ్రతం - రక్షాబంధన్‌


హిందువులకు శ్రావణమాసం చాలా పవిత్రమైనది. ఈ మాసంలో రెండు ప్రముఖ ఉత్సవాలు ఉంటాయి. ఒకటి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం. రెండవది  పౌర్ణమి రోజున జరుపుకొనే రక్షాబంధన్‌. ఐతిహాసికంగా ఈ రెండు పండుగలు లక్ష్మీ దేవి ఆరాధనకు సంబంధించినవి.

ప్రజల్ని ప్రేమించనివాడు నాయకుడు కాదు (స్ఫూర్తి)


1928లో సైమన్‌ కమిషన్‌ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి మద్రాస్‌ లో జరిగిన ప్రదర్శనలకు బారిస్టర్‌ ప్రకాశం పంతులు నాయకత్వం వహించారు. అప్పటికి ఆయన వయస్సు 56ఏళ్ళు.

అజేయమైన శక్తి (హితవచనం)


మునుపెన్నడూలేని విధంగా మనం శక్తిని సముపార్జించాలి. అవసరమైతే మన ప్రవృతిని మార్చుకొని సరిక్రొత్త వ్యక్తిగా రూపాంతరము చెందాలి. అ

అమరవాణి


ముఖం పద్మదళాకారం

వచశ్చందన శీతలం

హృదయం కర్తరీ తుల్యం

అతివినయం ధూర్త లక్షణమ్‌

ప్రముఖులు మాటఅసోంలో రూపొందించిన జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సి) అంతిమ జాబితా కాదు. ఇది ముసాయిదా మాత్రమే. పౌరులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

 - రాజ్‌ నాధ్‌ సింగ్‌ , కేంద్ర హోమ్‌ మంత్రి

ధర్మో రక్షతి రక్షితః


ఆగస్ట్‌ 15, 1947 స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా కంచి పరమాచార్య పూజ్యశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి సందేశం

మన భారతదేశం స్వాతంత్య్రం పొందిన ఈ సంతోష సమయంలో, ఈ ప్రాచీన దేశానికి చెందిన ప్రజానీకమంతా హృదయపూర్వకంగా భగవంతుడిని ప్రార్ధించాలి. అధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించ డానికి అవసరమైన శక్తిని, బుద్ధిని ఇవ్వమని భగవంతుని అందరం ప్రార్ధిద్దాం. భగవంతుని దయ ఉన్నప్పుడే మనం సాధించుకున్న ఈ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోగలం, అలాగే ఈ భూమిపై ఉన్న సర్వ జీవకోటి సుఖసంతోషాలతో ఉండేందుకు సహాయ పడగలం.

భారతీయతే మన అస్తిత్వంమతమార్పిడి చర్చ్‌ మద్దతు, అభారతీయ కమ్యూనిస్ట్‌ సిద్ధాంతపు ప్రభావం కలిగిన కాంగ్రెస్‌ నాయకులు కొందరు భారతదేశ పేరుప్రతిష్టలు, అస్తిత్వాన్ని దెబ్బతీసేవిధంగా ప్రకటనలు చేయడం ఎంతో బాధాకరం. బాగా చదువుకున్న ఇలాంటి నేతలు చేసే ప్రకటనలు చూస్తూ ఉంటే మాజీ రాష్ట్రపతి డా.ఎస్‌. రాధాకృష్ణన్‌ చెప్పిన ఒక మాట గుర్తుకువస్తుంది. 1949 విద్యాసంఘం నివేదికలో డా. రాధాకృష్ణన్‌ మన దేశంలో (ఆంగ్ల)విద్యకున్న అభారతీయ లక్షణాన్ని గురించి ఇలా వ్రాసారు -

రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంస్థల రాస్తారోకోస్వామి పరిపూర్ణనందకు నగర బహిష్కరణ విధిస్తూ హైదరబాద్‌ పోలీసులు జారీ చేసిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకుని, ఆయనను నగరానికి తేవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో హిందూ సంస్థల కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహించారు. జులై 19న జరిగిన ఈ రాస్తారోకో కార్యక్మ్రంలో విశ్వహిందూ పరిషత్‌, బజారంగ్‌ దళ్‌తో పాటు వివిధ హిందూ సంస్థలు పాల్గొన్నాయి.

సజీవంగా ఉన్న ముస్లిం వేర్పాటు వాద దోరణి


ఇటీవలే ఆల్‌-ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వారు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో షరియా న్యాయస్థానాలు నెలకొల్పుతామని ముస్లింలకు సంబంధించిన చట్టాలు, తీర్పులను ఖురాన్‌, హదీస్‌ ఆధారంగా ఈ షరియా కోర్టులు నిర్ణయిస్తాయని   బహిరంగంగా ప్రకటించారు. మీడియా కథనాల ప్రకారం ఇప్పటికే ఇలాంటివి 40 వరకు కోర్టులు ఉత్తరప్రదేశ్‌లో పనిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే కొంతమంది ముస్లిం మహిళలు మూడుసార్లు తలాఖ్‌ అని చెప్పి విడాకులు ఇచ్చే పద్ధతి అన్యాయం అంటూ సుప్రీం కోర్టులో కేసు వేశారు. 

పర్యావరణ 'భక్తి'- ప్లాస్టిక్‌కు స్వస్తి


 
మహారాష్ట్రలోని ఆళంది గ్రామం నుండి తొలి ఏకాదశినాడు పాండురంగడిని దర్శించడం కోసం ప్రతి సంవత్సరం పాద యాత్ర చేయడం ఆనవాయితి. కొన్నిసంవత్సరాలుగా ఐటి ఉద్యోగులు గ్రామ ప్రజలతో కలిసి సామాజిక సమస్యలపై ప్రజలను జాగృతపరుస్తున్నారు.

గోసంతతి అమ్మకాన్ని ఆపడం ఎలా?


గ్రామాలలో గోసంతతిని రక్షించటానికి పూర్వకాలం నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని గ్రామాల్లో చాలామంది తమ మొక్కులు తీరిన వెంటనే ఆవులు లేదా కోడెదూడలను గ్రామ దేవాలయాలకు తీసుకెళ్ళి పూజలు చేసి, ఆలయం చుట్టూ తిప్పి దేవుని పేరుతో గ్రామంలో వదిలి పెట్టడం ఆనవాయితీగా వస్తున్నది.

ఆర్థరైటిస్‌ (కీళ్లనొప్పులు)


ఇది కీళ్ళకి సంబంధించిన ఒక రకమైన వ్యాధి. ఈ వ్యాధి ప్రారంభం లో అంతగా బాధ ఉండదు. అందుకని మనం అందరం దానిని చిన్నదే అని వదిలేస్తాము. కానీ  దీర్ఘకాలంలో మాత్రం కీళ్ళలో బిరుసుదనం (stiffness), వాపులు బొత్తిగా కదల లేకపోవడం వంటి లక్షణాలు బాగా తెలియవస్తూంటాయి..

కానీ ఇది ఎందుకు వస్తుందో కొంచెం తెలుసు కుందాం. అలాగే ఎలాగ దాన్ని నివారించవచ్చు కూడా చూద్దాం.

స్వాతంత్య్ర పోరాటంలో తెలుగు మహిళలు


బ్రిటీష్‌ రాజ్యంలో వారి అరాచకాలకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ ఇచ్చిన సందేశాలకు ప్రభావితమై ఎందరో తెలుగు మహిళలు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. బ్రిటీష్‌ పాలకులకు దేశం నుంచి వెళ్లగొట్టాలనే గట్టి నిర్ణయంతో ముందుకు సాగారు. అలాంటివారిలో మాగంటి అన్నపూర్ణాదేవి, దువ్వూరి సుబ్బమ్మ గాంధీజీ ప్రశంసలు పొందిన వనితలు.

సేవ ముసుగులో మిషనరీలు చేసే అకృత్యాలు
పాఠశాలలు, ఆసుపత్రులు, అనాధశరణాలయాలు మొదలైనవాటి ద్వారా క్రైస్తవ మిషనరీలు ఎంతో సేవ చేస్తున్నారని చాలామంది భావిస్తుంటారు. కానీ సేవ ముసుగులో మిషనరీలు చేసే అకృత్యాలు, మతమార్పిడులు ఇటీవల కాలంలో బాగా బయటపడుతున్నాయి.