సేవ ముసుగులో మిషనరీలు చేసే అకృత్యాలు
పాఠశాలలు, ఆసుపత్రులు, అనాధశరణాలయాలు మొదలైనవాటి ద్వారా క్రైస్తవ మిషనరీలు ఎంతో సేవ చేస్తున్నారని చాలామంది భావిస్తుంటారు. కానీ సేవ ముసుగులో మిషనరీలు చేసే అకృత్యాలు, మతమార్పిడులు ఇటీవల కాలంలో బాగా బయటపడుతున్నాయి.

ఆదిలాబాద్‌లో ప్రిన్సిపాల్‌ మతమార్పిడి చర్యలు

ఆదిలాబాద్‌ జిల్లాలోని బజార్‌ హుత్నూర్‌ మండలంలోని  ప్రభుత్వ ఆదర్శ పాఠశాల (మోడల్‌ స్కూల్‌)లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న 50 మంది విద్యార్థులను వారి వసతి గృహం నుండి ఎలాంటి అనుమతి లేకుండా స్కూల్‌  ప్రిన్సిపాల్‌ లావణ్య ఆదివారం (14-జూలై) నాడు స్థానిక చర్చిలోని  ప్రార్థనకు తీసుకొని వెళ్ళింది.

ఈ విషయాన్నీ తెలుసుకున్న గ్రామస్తులు చర్చి వద్దకు వెళ్లి పాఠశాల ప్రిన్సిపాల్‌ వ్యవహార శైలిని, అమాయక పిల్లల చేత క్రైస్తవ మత మార్పిడిని ప్రోత్సహిస్తున్న ఆమెను కలిసి నిలదీసారు.

ఈ విషయం తెలుసుకున్న విహెచ్‌పి, భజరంగ్‌దళ్‌, బిజేపి కార్యకర్తలు సైతం అక్కడికి చేరుకున్నారు. వసతి గృహం నుండి నియమాలకు విరుద్ధంగా విద్యార్థులను గత మూడు అదివారముల నుండి చర్చ్‌కి తీసుకొని వెళ్లి అక్కడ మత మార్పిడికి ప్రయత్నం చేస్తున్న ప్రిన్సిపాల్‌ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ సంఘటనపై బజార్‌ హుత్నూర్‌ గ్రామస్తులు డిఎస్‌పి నరసింహ రెడ్డి, డిఈఓ జనార్ధన్‌రావుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు చర్చ్‌ వద్దకు చేరుకొని విచారణ జరిపారు. విచారణలో లావణ్య మతమార్పిడికి పాల్పడుతున్న మాట నిజమేనని నిర్ధారణ కావడంతో ఆమెను వెంటనే విధుల నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

పసిపిల్లలను అమ్ముకుంటున్న మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ

సేవస్వరూపిణిగా ప్రపంచమంతటా పేరుపొందిన మదర్‌ తెరెసా స్థాపించిన మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ పసిపిల్లల అక్రమ రవాణా సాగిస్తోందని తేలింది. పసిపిల్లల విక్రయానికి సంబంధించి జార్ఖండ్‌ పోలీసులు ఇద్దరు నన్‌లను అరెస్ట్‌ చేశారు. రాంచి శిశుసంక్షేమ కమిటీ ఆదేశాల మేరకు ఈ నన్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

శిశు సంక్షేమ కమిటీ  మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీలో సాధారణ తనిఖీ కోసం వెళ్లినప్పుడు పసిపిల్లలు అదృశ్యమైన విషయం బయటపడింది. కమిటీ సభ్యురాలైన ప్రతిమా తివారీ ఈ వ్యవహారం గురించి ఇలా వివరించారు - ''మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీకి చెందిన జైల్‌ రోడ్‌ కేంద్రం వివాహం కాకుండానే తల్లులైన మహిళలకు ఆశ్రయం ఇస్తుంది. అలాంటి మహిళలు ఇక్కడే ప్రసవిస్తారు. వారం క్రితం మేము ఇక్కడికి సాధారణ తనిఖీ కోసం వచ్చినప్పుడు ఒక మగ శిశువు కనిపించకుండా పోయినట్లు తెలుసుకున్నాము. ఈ విషయాన్ని గురించి అడిగినప్పుడు అక్కడి నన్‌లు శిశువును తల్లికి ఇచ్చేశామని చెప్పారు. కానీ తల్లిని అడిగితే బిడ్డ తన దగ్గర లేదని చెప్పింది. దీనితో నన్‌లను గట్టిగా నిలదీయడంతో వారు శిశువును ఎవరికి అమ్మివేశారో ఆ దంపతులను యూపీ నుండి పిలిపించారు. వారికి ఒకటిన్నర లక్షల రూపాయలకు శిశువును అమ్మేసినట్లు అంగీకరించారు. తమ నుంచి ఆసుపత్రి రుసుము అంటూ అంత మొత్తాన్ని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నన్‌లు వసూలు చేశారని యూపీకి చెందిన ఆ దంపతులు కూడా చెప్పారు.''

ఇదిలా ఉంటే పసిపిల్లల విక్రయం చాలా కాలంగా సాగుతోందని, ఇప్పటికి కనీసం 280మందికి పైగా పిల్లలు మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నుండి మాయమై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

2015 -2018 మధ్య సంస్థకు చెందిన వివిధ కేంద్రాల్లో 450మంది మహిళలు చేరారు. అయితే 170మంది శిశువుల వివరాలే రికార్డుల్లో ఉన్నాయి. అంటే 280 మంది ఆచూకీ తెలియదు. వీరిని కేవలం పిల్లలు లేనివారికే విక్రయించి ఉంటారని అనుకోలేమని, అవయవాల అక్రమ రవాణా చేసేవారికి, పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి అందజేసి ఉండవచ్చని, ఆ వివరాలన్నీ విచారణలో తెలుతాయని పోలీసులు అంటున్నారు. ఇదీ మదర్‌ థెరీసా సంస్థ చేసే మానవ -సేవ'.