అమరవాణి


ముఖం పద్మదళాకారం

వచశ్చందన శీతలం

హృదయం కర్తరీ తుల్యం

అతివినయం ధూర్త లక్షణమ్‌


భావం : ముఖం పద్మం లాగా ఉంటుంది. మాటలు చందనం వలె చల్లగా ఉంటాయి. కానీ దుర్జనుడి మనసు మాత్రం కత్తెర వంటిది. పై గుణాలతో అతివినయం నటిస్తూ దుష్టుడు మనలను మోసపుచ్చుతాడు సుమా!! తస్మాత్‌ జాగ్రత్త!!