ప్రముఖులు మాటఅసోంలో రూపొందించిన జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సి) అంతిమ జాబితా కాదు. ఇది ముసాయిదా మాత్రమే. పౌరులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

 - రాజ్‌ నాధ్‌ సింగ్‌ , కేంద్ర హోమ్‌ మంత్రిఏ భారతీయుడి పేరు జాబితా నుండి తొలగించే ప్రసక్తి లేదు. 1985 రాజీవ్‌ ఒప్పందం ప్రకారమే, సుప్రీం కోర్ట్‌ ఆదేశాల మేరకే పౌర రిజిస్టర్‌ తయారు చేస్తున్నాం. దేశంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులకు వంతపాడాలని ఎవరు చెప్పినా అంగీకరించబోము. జాతీయ భద్రత కోసమే ఈ నిర్ణయం.

- అమిత్‌ షా, బిజెపి జాతీయాధ్యక్షుడు

 
ప్రజల వ్యహారశైలిని మార్చే ఉద్యమాలలో స్వచ్ఛ భారత్‌ ప్రపంచంలోనే అతి పెద్దది, విజయవంతమైనది. దీని ద్వారా భారతదేశంలో ఎంతో మార్పు కనిపిస్తోంది.

- వాల్‌ కర్టీస్‌, డైరెక్టర్‌,  పర్యావరణ ఆరోగ్య సంస్థ, లండన్‌