రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంస్థల రాస్తారోకోస్వామి పరిపూర్ణనందకు నగర బహిష్కరణ విధిస్తూ హైదరబాద్‌ పోలీసులు జారీ చేసిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకుని, ఆయనను నగరానికి తేవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో హిందూ సంస్థల కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహించారు. జులై 19న జరిగిన ఈ రాస్తారోకో కార్యక్మ్రంలో విశ్వహిందూ పరిషత్‌, బజారంగ్‌ దళ్‌తో పాటు వివిధ హిందూ సంస్థలు పాల్గొన్నాయి.

ఇతర వర్గాలను, వారి నాయకులను ఉద్దేశించి నవంబర్‌, 2017 నారాయణ్‌ ఖేడ్‌లో జరిగిన ఒక సభలో స్వామి పరిపూర్ణనంద అనుచితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అందుకే ఆయనకు నగర బహిష్కరణ విధించామని పోలీసులు అంటున్నారు. సమాజ వ్యతిరేక, ప్రమాదకర కార్యకలాపాల (నిరోధక) చట్టం, 1980 కింద ఆరునెలలపాటు బహిష్కరణ విధిస్తున్నట్లు జులై 11వ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

పెద్ద సంఖ్యలో రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు వెంటనే స్వామీజీపై నిషేధాజ్ఞలు తొలగించా లని డిమాండ్‌ చేశారు. అలాగే భావప్రకటన స్వేచ్చ, సెక్యులరిజం పేరుతో హిందూ మతవిశ్వాసాలను కించపరుస్తూ పదేపదే చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టివి9 వంటి ఛానళ్లపై చర్య తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్‌ చేశారు.

మైనారిటీల ఓట్లకోసం పాకులాడుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హిందువులకు అన్యాయం చేయాలని, వారి గొంతునొక్కాలని చూస్తోందని పలు హిందూ సంస్థల నాయకులు ఈ సందర్భంగా ఆరోపించారు. అనేక సందర్భాల్లో మజ్లిస్‌ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ హిందువులకు వ్యతిరేకంగా చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఉపన్యాసాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకో లేదని వారు అన్నారు. ఇదిలా ఉంటే స్వామి పరిపూర్ణానందకు నగర బహిష్కరణ విధించడాన్ని ప్రశ్నిస్తూ బిజెపి రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఒక లేఖ రాశారు. అరాచక వాదులు, గుండాలకు వ్యతిరేకంగా ప్రయోగించా ల్సిన చట్టాన్ని ఒక స్వామీజీపై ఎలా ఉపయో గిస్తారంటూ స్వామి తన లేఖలో ప్రశ్నించారు. నిషేధాజ్ఞలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే కోర్టులో సమాధానం చెప్పుకోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.