కరవును జయించిన కామేగౌడమంచి ఆలోచన, నలుగురికి పనికివచ్చే పని చేయాలనే సంకల్పం ఉంటే ఎలాంటి కార్యాన్నైనా చేయవచ్చని నిరూపించాడు కర్ణాటకలోని మాండ్యకి చెందిన కామేగౌడ. 40 ఏళ్లపాటు అతను చేసిన కృషి వల్ల వర్షాలు లేనప్పుడు కూడా ఆ గ్రామంలో పుష్కలంగా నీరు లభిస్తోంది. ఇటీవల కామేగౌడ చనిపోయినా అతను చేసిన పని మాత్రం గుర్తుండిపోతుంది.

కుల ఘర్షణలు, ప్రధాని హత్యకు కుట్ర ఇదీ 'నగర నక్సల్స్‌' చరిత్ర


మహారాష్ట్ర పోలీసులు ఆగస్ట్‌ 28వ తేదీన పలు రాష్ట్రాల్లో వామపక్ష కార్యకర్తల ఇళ్ళపై దాడులు నిర్వహించి, మావోయిస్ట్‌/నక్సల్‌ సంబంధాలున్నాయని అనుమానిస్తున్న నలుగురిని అరెస్ట్‌ చేసి నిర్బంధంలోకి తీసుకున్నారు. గత సంవత్సరం డిసెంబర్‌31 తేదీన పూణే నగరం సమీపంలోని భీమా-కోరేగావులో చెలరేగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి పోలీసులు జరుపుతున్న విచారణలో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి.

శ్రీకృష్ణ జన్మాష్టమి


చేతవెన్నముద్ద చెంగల్వపూదండ

బంగారు మొలతాడు పట్టుదట్టి

సందె తావీదులు సరిమువ్వగజ్జెలు

చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు

గురువు, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్‌ (స్ఫూర్తి)


మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఎంతో గొప్ప గురువుగా, మార్గ దర్శకుడిగా పేరుపొందారు. చైనా, పాకిస్థాన్‌ యుద్ధ సమయాల్లో రాష్ట్రపతిగా ప్రభుత్వానికి విలువైన మార్గదర్శనం చేశారు. విజ్ఞాన సముపార్జనలో కూడా ఆయన ఎంతో ముందుండే వారు. రోజుకు 12 గంటలు పుస్తకపఠనం చేసేవారు. 

గతం తిరిగిరాదు (హితవచనం)


ప్రాచీనమైన విషయాలన్నీ శ్రేష్టమైనవి కాకపోవచ్చు. అశాస్త్రీయమైన, అసంబద్ధమైన ఆలోచనలు సమాజంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. కాలం చెల్లిన వాటిని పట్టుకోని వ్రేలాడవద్దు. ఎల్లపుడూ గతించిన కాలంలోనికి తొంగిచూస్తూ సమయం వృదా చేసుకోవచ్చు.

ప్రముఖులు మాటప్రస్తుతం రాజకీయాలు అన్ని రంగాల్లోకి వ్యాపించాయి. నేతలు ధర్మబద్ధంగా నడుచుకోవడం లేదు. అందువల్ల ధర్మాచార్యులు కల్పించుకోవలసి వస్తోంది.

- స్వామి పరిపూర్ణానంద, శ్రీ పీఠం

అమరవాణి


జీవంతం మృతవన్మన్యే

దేహినామ్‌ ధర్మవర్జితం

మృతో ధర్మేణ సంయుక్తో

దీర్ఘజీవి న సంశయః

గాంధీ, లోహియా, దీన్‌ దయాళ్‌జీల ప్రతిరూపం స్వయంసేవక్‌ 'అటల్‌'


అటల్‌ బిహారీ వాజ్‌పాయి బాల్యం నుంచి అంతిమ క్షణం వరకు నిష్ఠవంతుడైన స్వయంసేవక్‌ గానే వ్యవహరించారు. దేశం, సమాజం కోసం నిస్వార్ధంగా పనిచేసే ఈ స్వయంసేవక్‌ తత్వం ఆయనలో నిత్యం ప్రకటితమయ్యేది.

ప్రపంచం మరవలేని హైఫా యుద్ధం


సెప్టెంబర్‌ 22,23, 1918న జరిగిన హైఫా యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైనది. స్వతంత్ర ఇజ్రాయిల్‌ ఏర్పాటుకు ఈ యుద్ధమే పునాది వేసింది. జోధ్‌పూర్‌ మహారాజా, మైసూర్‌ మహారాజా పంపిన అనేకమంది భారతీయ సైనికులు మొదటి ప్రపంచయుద్ధంలో ఇజ్రాయిల్‌ (వెస్ట్‌ బ్యాంక్‌)లో ప్రాణత్యాగం చేశారు. టర్కులు, జర్మన్లు, ఆస్ట్రియన్లతో కూడిన సంయుక్త సేనను ఓడించి ఇజ్రాయిల్‌ రేవు పట్టణం హైఫాను సెప్టెంబర్‌, 1918లో విముక్తం చేశారు. ఇజ్రాయిల్‌ను అప్పట్లో పాలస్తీనాగా పిలిచేవారు. 1516 నుండి 402 ఏళ్ళపాటు ఇది టర్కీ ఒట్టమాన్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.

మెత్తబడ్డ నాగా తిరుగుబాటుదారులు

 

బృహత్‌ నాగాలిమ్‌ (నాగాలాండ్‌) డిమాండ్‌ను వదిలిపెడుతున్నట్లు నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ ప్రకటించడంతో చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ ఊపిరి తీసుకుంటున్నాయి. దీనితో నాగా సమస్య ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నాయి. 20 సంవత్సరాలపాటు చుట్టుపక్కల రాష్ట్రాలతో కలిపి బృహత్‌ నాగాలాండ్‌ (గ్రేటర్‌ నాగాలాండ్‌) ఏర్పాటు చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్న నాగా తిరుగుబాటుదారులతో కేంద్ర ప్రభుత్వ చర్చలు చివరికి ఫలితాన్ని ఇచ్చాయి. నాగాలాండ్‌కు చుట్టూ ఉన్న రాష్ట్రాల సరిహద్దుల జోలికి పోమని ఎన్‌ఎస్‌సిఎన్‌ అంగీకరించింది. అయితే నాగాలకు ప్రత్యేక రాజ్యాంగ హోదాను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది.

రాఫెల్‌పై రాద్ధాంతం ఎందుకు?


దేశ రక్షణ విషయాలపై కూడా కొందరు రచ్చ చేస్తున్నారు. రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంపై దేశప్రజల మనస్సుల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని 'బిజెపి బోఫోర్స్‌'గా చిత్రీకరించేందుకు తాపత్రయ పడుతున్నారు. ఫ్రాన్సు దేశంతో కుదిరిన రాఫెల్‌ ఒప్పందం అనేక సాంకేతిక అంశాలతో కూడుకున్న అంశం. దసాల్ట్‌ పేరుగల ఫ్రెంచి విమాన నిర్మాణ తయారీ సంస్థ నుంచి 36 యుద్ధ విమానాలను కొంటున్నట్లు 3 ఏళ్ళ క్రితం ప్రధాని నరేంద్రమోదీ ప్రకటనచేశారు. 

కేరళలో 75వేల మందిని రక్షించిన సేవాభారతి


కేరళలో 100 ఏళ్లలో కనీవినీ ఎరుగని వరదల నుంచి 75 వేల 6వందల మందిని సేవభారతి కాపాడింది. ప్రపంచంలో ఇలా ఒక స్వచ్ఛంద సంస్థ ఇంతమందిని కాపాడగలగడం ఇదే ప్రధమం. వరద ముంచెత్తిన ప్రారంభ దినాల్లో ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తున్నప్పుడు సేవభారతి కార్యకర్తలు ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడారు. ఈ ప్రయత్నంలో 2 కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఆరు సంపదల్ని రక్షించుకోవాలి


ప్రకృతికీ, మానవుడికీ అవినాభావ సంబంధం ఉంది. ఆ ప్రకృతిలో ముఖ్యంగా ఆరింటిని మనషి తప్పనిసరిగా రక్షించుకోవాలి. అవి లేకపోతే మానవాళి మనుగడే లేదు. అవేమిటి?

నిజాం నెదిరించిన మహిళా యోధులునిజాం ఏలుబడి అంతా హత్యలు, దౌర్జన్యాలు, దోపిడీలతో కొనసాగింది. గ్రామాలన్నీ తగలబెట్టి రజాకారులు తెలంగాణ పల్లెలను రావణ కాష్టంగా మార్చారు. నిజాం మూకలు, రజాకార్‌ల దౌర్జన్యాలతో తెలంగాణ పల్లెలు నిద్ర లేచేవి. ఎదురించిన గ్రామాల్లో నరమేధాన్ని సృష్టించి తిరుగుబాటును ఆదిలోనే అణచి వేయాలని కలలు కనేవారు. అత్యంత క్రూరంగా ప్రజలను హత్య చేసినప్పటికీ ప్రజలు వెనుకకు తగ్గకుండా తమ పోరాటం కొనసాగించారు.

రక్తహీనత (ఎనీమా)


రక్తంలో ఎఱ్ఱరక్తకణాలు తక్కువగా ఉండడం వలన ఈ వ్యాధి బయటపడుతుంది.

శ్వాస సంబంధించిన సమస్యలు, శరీరపు రంగు పాలిపోయినట్లు తెల్లగా ఉండడం, గోళ్ళరంగు మారడం, అతిత్వరగా అలిసిపోవడం, తరచూ తలతిరుగుతున్నట్టుండడం మొదలగునవి ఈ వ్యాధి  లక్షణాలు.

కానీ ఇది ఎందుకు వస్తుందో కొంచెం తెలుసుకుందాం. అలాగే ఎలాగ దాన్ని నివారించవచ్చు కూడా చూద్దాం.

అనాథాశ్రమ బాలికలపై క్రైస్తవ మత ప్రచారకుడి లైంగిక దాడి

సేవ పేరుతో అమాయకులను మోసగించడం, ఆ మోసాలు బయటపడితే ఏమి జరగనట్లు బుకాయించడం  క్రైస్తవ మిషనరీలకు వెన్నతోపెట్టిన విద్య.  వాటికన్‌ అధినేత పోప్‌ నుండి అంతా అలాగే వ్యవహరిస్తారు.