అనాథాశ్రమ బాలికలపై క్రైస్తవ మత ప్రచారకుడి లైంగిక దాడి

సేవ పేరుతో అమాయకులను మోసగించడం, ఆ మోసాలు బయటపడితే ఏమి జరగనట్లు బుకాయించడం  క్రైస్తవ మిషనరీలకు వెన్నతోపెట్టిన విద్య.  వాటికన్‌ అధినేత పోప్‌ నుండి అంతా అలాగే వ్యవహరిస్తారు.


సేవ ముసుగులో అనాథాశ్రమ బాలికలపై క్రైస్తవ మత ప్రచారకుడి లైంగిక దాడి

ఒంగోలులోని ఇండియా ఎవాంజిలకల్‌ రిలీఫ్‌ ఫెలోషిప్‌ (ఐఈఆర్‌ఎఫ్‌) నిర్వాహకుడు కొడవటి కంటి జోసఫ్‌ అకృతాలు అన్నీ ఇన్నీ కావు.

అనాథాశ్రమాల్లో జరుగుతున్న అక్రమాలపై ఇటీవల సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాల్లోని ఆశ్రమాలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల అమలుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిద్ధ మైంది. జిల్లా ప్రొహిబిషన్‌ అధికారి ఎస్‌కె ఫరూక్‌ బాషా, జిల్లా బాలల సంరక్షణ కమిటీ చైర్‌పర్సన్‌ సీహెచ్‌ భారతి తదితరులతో తనిఖీ కమిటీ ఏర్పా టైంది. ఈ కమిటీ నిర్వహించిన సోదాల్లో 76 ఏళ్ల జోసెఫ్‌ అకత్యాలు బయటపడ్డాయి. కమిటీ అధికారులకు అక్కడ జరుగుతున్న ఘోరాలను బాలికలు చెప్పారు. ఒక్కొక్కరుగా కమిటీ చైర్‌పర్సన్‌ భారతి ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాలికలపై వికత చేష్టలకు పాల్పడిన పాస్టర్‌ జోసఫ్‌పై ఫోక్సో చట్టం కింద కేసులు నమోద య్యాయి.

బాలల సంక్షేమ కమిటీ కన్వీనర్‌ ఫరూక్‌ బాషా ఫిర్యాదు మేరకు ఒంగోలు టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ కుమార్‌రెడ్డి కేసు నమోదు చేసి జోసఫ్‌ ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత ఫోక్సో చట్టం 10, 12 జువైనల్‌ యాక్టు 75, ఐపీసీ 354, 509 కింద కేసు నమోదు చేసి ఎక్సైజ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి సుధ నిందితుడు జోసఫ్‌కు ఈ నెల30వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. 46 మంది బాలికలకు రాంనగర్‌లోని బాలసదన్‌లో రక్షణ కల్పించారు. బాలసదన్‌లో చేర్పించిన బాలికలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజావెంకటాద్రి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌-2 మార్కండేయులు, ఒంగోలు ఆర్డీవో కమ్మ శ్రీనివాసరావు, డీఎస్పీ శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు తమ్మిశెట్టి మాధవి, డీఎంహె చ్‌వో రాజ్యలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ కమిటీ చైర్‌పర్సన్‌ భారతి, ఐసీడీఎస్‌ పీడీ సరోజిని తదితరులు విచారించారు.

ఇండియా ఎవాంజిలకల్‌ రిలీఫ్‌ ఫెలోషిప్‌ (ఐఈఆర్‌ఎఫ్‌) పేరుతో ఒంగోలులోని క్లౌపేటలోని ఆరవ లైను (కృపాదానం వీధి)లో మూడున్నర దశాబ్దాలుగా కొడవటికంటి జోసఫ్‌ నడుపుతున్నారు. జిల్లాలోనే అతి పెద్దదైన ఈ సంస్థకు విదేశాల నుంచి భారీగా నిధులు వస్తాయి. ఏడాదికి సుమారు రూ. 30 లక్షల నుంచి 50 లక్షల వరకు విదేశాల నుంచి వస్తున్నట్లు సమాచారం. జోసఫ్‌ ఆ సొమ్ముతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. ఒంగోలు చిల్డ్రన్‌ హోంలో (అనాథఆశ్రమం) ఉన్న బాలికలతో పాస్టర్‌ జోసఫ్‌ సపర్య లు చేయించు కునేవారు. ఈ వ్యవహారం అప్పట్లో బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. కానీ ఈసారి సాక్షాత్తు ప్రభుత్వాధికారులకే పట్టుబడిపోవడంలో పాస్టర్‌ జోసెఫ్‌ జైలుకు వెళ్లకతప్పలేదు.నేరస్తులను కాపాడారన్న ఆరోపణలపై నోరువిప్పని పోప్‌

లైంగిక నేరాలకు పాల్పడిన పాస్టర్లు, చర్చి అధికారులను కాపాడారంటూ వాటికన్‌ మాజీ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలపై ప్రతిస్పందించేం దుకు పోప్‌ ఫ్రాన్సిస్‌ నిరాకరించారు. ఐర్లాండ్‌లో పర్యటించిన పోప్‌ ఫ్రాన్సిస్‌ వాటికన్‌ మాజీ అధికారి తయారుచేసిన 11 పేజీల పత్రం పై మాట్లాడ బోనని స్పష్టం చేశారు. చర్చి అధికారులు పాల్పడిన నేరాలను పోప్‌ ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుతూ వచ్చారని, ఇప్పుడు ఆ నేరాలన్నీ బయటపడిన సందర్భంగా పోప్‌ ఫ్రాన్సిస్‌ రాజీనామా చేయాలని మాజీ అధికారి ఆ పత్రంలో డిమాండ్‌ చేశారు. అమెరికా కార్డినల్‌ థియోడోర్‌ మెక్‌ కారిక్‌ చిన్న పిల్లలపై పాల్పడిన లైంగిక నేరాల గురించి పోప్‌ ఫ్రాన్సిస్‌ కు తెలుసని, తెలిసినా ఆ విషయాల్ని పట్టించుకోకుండా కార్డినల్‌ను ఏకంగా తన 'విశ్వసనీయ సలహాదారు'గా నియమించు కున్నారని ఆరోపించారు. కార్డినల్‌ నేరాలను పోప్‌ దృష్టికి తీసుకువెళ్లినా వాటిని పట్టించుకోలేదని వాటికన్‌ మాజీ అధికారి వెల్లడించారు.

చర్చి అధికారులు చిన్న పిల్లలపై సాగించిన లైంగిక నేరాలను అరికట్టడంలో కాథలిక్‌ చర్చి పూర్తిగా విఫలమైందని ఐర్లాండ్‌ పర్యటనలో ఉన్న పోప్‌ విచారం వ్యక్తం చేశారు. ఇందుకు తాను ఎంతో 'బాధ పదడమేకాక, సిగ్గు పడుతున్నానని' పోప్‌ అన్నారు. మతాధికారుల చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులను ఆయన కలిశారు. కానీ నేరస్తులపై ఎలాంటి చర్యలు తీసుకుని బాధితు లకు న్యాయం చేయనున్నారనే విషయం గురించి మాత్రం పోప్‌ ఫ్రాన్సిస్‌ నోరువిప్పలేదు.