రక్తహీనత (ఎనీమా)


రక్తంలో ఎఱ్ఱరక్తకణాలు తక్కువగా ఉండడం వలన ఈ వ్యాధి బయటపడుతుంది.

శ్వాస సంబంధించిన సమస్యలు, శరీరపు రంగు పాలిపోయినట్లు తెల్లగా ఉండడం, గోళ్ళరంగు మారడం, అతిత్వరగా అలిసిపోవడం, తరచూ తలతిరుగుతున్నట్టుండడం మొదలగునవి ఈ వ్యాధి  లక్షణాలు.

కానీ ఇది ఎందుకు వస్తుందో కొంచెం తెలుసుకుందాం. అలాగే ఎలాగ దాన్ని నివారించవచ్చు కూడా చూద్దాం.

కారణం

-    పౌష్టికాహారం తగు మోతాదులలో తీసుకోకపోవడం

-    దెబ్బలు తగిలి అధికంగా రక్తం పోవడం

-    రజస్వల సమయంలో ఎక్కువగా రక్తస్రావం

-    పైల్స్‌ సమస్య

-    పొట్టలో పురుగులు

నివారణ

ఇనుము అధికంగా ఉండేటటువంటి పదార్థములు ఎక్కువగా తీసుకోవాలి. ఉదా|| పప్పు దినుసులు, చేప, కోడిగుడ్లు, మాంసం, పాలు, పెరుగు, ఆకుకూరలు, బీట్రూట్‌, నిమ్మకాయలు, బత్తాయి పళ్ళు, ఉసిరికాయ, యాపిల్‌...

ఉల్లి, మెంతులు, అధికంగా తీసుకోవాలి

బూడిద గుమ్మడికాయ రసం

ఉసిరికాయ రసం.