గురువు, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్‌ (స్ఫూర్తి)


మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఎంతో గొప్ప గురువుగా, మార్గ దర్శకుడిగా పేరుపొందారు. చైనా, పాకిస్థాన్‌ యుద్ధ సమయాల్లో రాష్ట్రపతిగా ప్రభుత్వానికి విలువైన మార్గదర్శనం చేశారు. విజ్ఞాన సముపార్జనలో కూడా ఆయన ఎంతో ముందుండే వారు. రోజుకు 12 గంటలు పుస్తకపఠనం చేసేవారు. 

మైసూర్‌, కోల్‌కతా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా పని చేయడమేకాక ఆంధ్ర, బెనారస్‌ హిందూ విశ్వ విద్యాలయాల్లో ఉపకులపతిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు, అభిమానులు పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేస్తామని అడిగినప్పుడు ఆ వేడుకలకు బదులు ఉపాధ్యయులను సత్కరించమని కోరారు. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఆయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తనకు వచ్చే వేతనంలో 75శాతం ప్రధానమంత్రి సహాయనిధికి ఇచ్చేసేవారు సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ఆయన రచించిన 'ఇండియన్‌ ఫిలాసఫీ' ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.