ప్రముఖులు మాటప్రస్తుతం రాజకీయాలు అన్ని రంగాల్లోకి వ్యాపించాయి. నేతలు ధర్మబద్ధంగా నడుచుకోవడం లేదు. అందువల్ల ధర్మాచార్యులు కల్పించుకోవలసి వస్తోంది.

- స్వామి పరిపూర్ణానంద, శ్రీ పీఠం 
ప్రతిఒక్కరు దైవభక్తి కలిగి ఉంటే నేరాలు, విధ్వంసక చర్యలు తగ్గుతాయి. రాత్రి పడుకునే ముందు అందరూ తమతమ ఇష్టదైవాలను ప్రార్ధించాలి. సంప్రదాయ సిద్ధాంతాలను ప్రజలందరూ పాటించి, నిరాడంబర జీవితానికి అలవాటుపడిన రోజు దేశంలో 100 శాతం అవినీతిని నిరోధించవచ్చును.  

- భన్వారిలాల్‌ పురోహిత్‌, తమిళనాడు గవర్నర్‌ఆసియా క్రీడల షూటింగ్‌ పోటీల్లో భారత క్రీడాకారులు పతకాలు సాధించడం చాలా సంతోషంగా ఉంది. యువ ప్రతిభను అన్వేషించి, శిక్షణనిచ్చి, తగిన ప్రోత్సాహాన్ని అందించిన ఒలంపిక్‌ సంఘం, కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ, కోచ్‌ లు అభినందనీయులు.

- సచిన్‌ టెండుల్కర్‌, మాజీ క్రికెటర్‌