అమరవాణి


జీవంతం మృతవన్మన్యే

దేహినామ్‌ ధర్మవర్జితం

మృతో ధర్మేణ సంయుక్తో

దీర్ఘజీవి న సంశయః

భావం : ఎవరైతే జీవితంలో ధర్మాచరణ చేయరో, ధర్మబద్ధంగా జీవించరో అలాంటివారు బతికి ఉన్నా మరణించినవారితో సమానం. కానీ ఎవరైతే ధర్మ కార్యాలు చేస్తారో వారు మరణించిన తరువాత కూడా జీవించే ఉంటారు.