కుల ఘర్షణలు, ప్రధాని హత్యకు కుట్ర ఇదీ 'నగర నక్సల్స్‌' చరిత్ర


మహారాష్ట్ర పోలీసులు ఆగస్ట్‌ 28వ తేదీన పలు రాష్ట్రాల్లో వామపక్ష కార్యకర్తల ఇళ్ళపై దాడులు నిర్వహించి, మావోయిస్ట్‌/నక్సల్‌ సంబంధాలున్నాయని అనుమానిస్తున్న నలుగురిని అరెస్ట్‌ చేసి నిర్బంధంలోకి తీసుకున్నారు. గత సంవత్సరం డిసెంబర్‌31 తేదీన పూణే నగరం సమీపంలోని భీమా-కోరేగావులో చెలరేగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి పోలీసులు జరుపుతున్న విచారణలో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి.

హైదరాబాదులో కవి వరవరరావు, ముంబైలో కార్యకర్తలు వెర్నాన్‌ గొంజాల్వేస్‌ మరియు అరుణ్‌ ఫెర్రేరా, ఫరీదాబాద్‌లో కార్మికసంఘ కార్యకర్త సుధా భరద్వాజ్‌, ఢిల్లీలో పౌరహక్కుల కార్యకర్త గౌతమ్‌ నవ్లాఖా ఇళ్ళను పోలీసులు సోదా చేసారు.

ఈ కార్యకర్తలు 'అతి పెద్ద కుట్ర'కై పధకం వేస్తున్నారు. భీమా-కోరేగావు సంఘటన ముందు 'రెచ్చగొట్టే' విధంగా ప్రసంగాలు చేసారు.

'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా' ప్రకారం, మావోయిస్ట్‌/నక్సల్‌ నాయకుల మధ్య జరిగిన రెండు ఉత్తర ప్రత్యుత్తరాల ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి. ఈ లేఖలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు, ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాలను హత్య చేయాలనుకునే కుట్ర వెల్లడి అయింది.

ఈ కధనం ప్రకారం, మహారాష్ట్ర గడ్చిరోలిలో నక్సల్స్‌కు వ్యతిరేకంగా జరిగే పోలీస్‌ ఆపరేషన్స్‌లో ఈ లేఖలు దొరికాయి. 2017లో వ్రాసిన ఒక లేఖ, ఎన్డియే (చీణూ) ప్రభుత్వాన్ని కూలదోయ డానికి 'సీనియర్‌ కామ్రేడ్లు' 'నిర్దిష్టమైన చర్యలు' తీసుకోవాలని సూచిస్తుంది.

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధి వీరందరికీ మద్దతు ప్రకటించారు. మార్క్సిస్టు చరిత్ర కారిణి రోమిలా థాపర్‌, ఇతర వామపక్ష కార్య కర్తలు, ఆ మరుసటి రోజే అరెస్టును ఆపేయాలని సుప్రీమ్‌ కోర్ట్‌లో అర్జీ పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు అభిషేక్‌ మను సింఘ్వి ఈ కార్యకర్తల తరుపున వాదించారు. అత్యవసర విచారణ చేపట్టిన సుప్రీం కోర్ట్‌ వీరిని జైలులో బంధించడానికి వీలులేదని, సెప్టెంబర్‌ 5 వరకు గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది.

వివాదాస్పద వామపక్ష కార్యకర్త, రచయిత్రి అరుంధతి రాయ్‌ కూడా వారందరికీ మద్దతు ప్రకటించి, 'హిందూ మెజారిటి భావజాలానికి' వ్యతిరేకంగా న్యాయంకోసం మాట్లడుతున్నవారిపై ఇది దాడి అని పేర్కొన్నారు. కానీ విచిత్రమేమిటంటే వీరిని తమ పాలనలో అనేకసార్లు అరెస్టు చేసి జైల్లో పెట్టిన కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇప్పుడు గగ్గోలు పెడుతోంది. అసమ్మతి గొంతునోక్కేస్తున్నారని గుండెలు బాదుకుంటోంది. విపక్షంకాని, మేధావుల మనుకునేవారు కానీ ప్రధాని హత్యకు కుట్ర పన్నడం గురించి ఏమి మాట్లాడటంలేదు. అరెస్ట్‌ అయినవారి వివరాలు చూస్తే వారు ఎలాంటి 'మేధావులో' అర్ధమవుతుంది.

వరవరరావు.పి

బీబీసి కధనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ 2005లో, నిషేధించబడిన కమ్యూనిస్టు పార్టీ అఫ్‌ ఇండియా (మావోఇస్ట్‌)కు సహకరిస్తున్నాడని, అప్పటి కాంగ్రెస్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం, పెండ్యాల వరవరరావును అరెస్టు చేసింది.   రెండేళ్ళు జైలు శిక్ష విధించింది. 1971 నుండి వరవరరావు అనేకసార్లు అరెస్ట్‌ అయ్యారు.

సుధా భరద్వాజ్‌

సుధా భరద్వాజ్‌ కామ్రేడ్‌ ప్రకాష్‌కి, మార్చ్‌ 2017 నాగపూర్లో జరిగిన ఒక సమావేశం గురించి లేఖ వ్రాసినట్లు రిపబ్లిక్‌ టీవీ జూలై 2018లో ఒక వార్త ప్రసారం చేసింది. ఈ ఛానెల్‌ ప్రకారం, సుధా భరద్వాజ్‌ తన లేఖలో ప్రస్తావించిన సమావేశంలో, కామ్రేడ్లు సురేంద్ర గాడ్లింగ్‌, సోమా సేన్‌ పాల్గొన్నారు. వీరిని పూణే పోలీసులు భీమా-కోరేగావు కేసులో అరెస్టు చేసారు. మావోఇస్ట్‌/నక్సల్స్‌కి, కాశ్మీరు వేర్పాటువాదులకి మధ్య సంబంధాలను ఈ లేఖ బయటపెడుతుందని ఈ టీవీ ఛానల్‌ పేర్కొంది. 'నగర నక్సల్స్‌' మరింత చురుకుగా పని చేయడానికి తగినన్ని నిధులు సమకూర్చాలని సుధా భరద్వాజ్‌ జెఎన్‌యు, ఛత్తీస్‌ గఢ్‌లో పనిచేసే టిఐఎస్‌ఎస్‌లను గతంలో కోరారు. తీవ్రవాది అఫ్జల్‌ గురును ఉరితీయడాన్ని కూడా ఈమె తీవ్రంగా వ్యతిరేకించారు.

గౌతమ్‌ నవ్లాఖా

శ్రీనగర్‌ విమానాశ్రయంలో 2011లో నవ్లాఖా నిర్బంధంలోకి తీసుకోబడ్డాడు, జమ్మూ & కాశ్మీరు ప్రభుత్వం 'ఈయన ఇక్కడ ఉంటే, కాశ్మీరు లోయలో ప్రశాంతత భగ్నం అవచ్చు' అని తెలియచేసింది. భారత రక్షణ ఏజెన్సీలు 2016 సంవత్సరంలో ఉగ్రవాది బుర్హాన్‌ వానిని అంతంచేసిన తరువాత, ఇతను ఉగ్రవాదుల పట్ల సానుభూతి వ్యక్తపరుస్తూ వ్యాసం వ్రాసినట్లు చెప్పబడింది. ఈ వ్యాసంలో ఉగ్రావాదులను 'బుర్హాన్‌ వాని అతని కామ్రేడ్లు' అని సంబోధిస్తూ వ్రాసినట్లు తెలుస్తోంది. 2010లో జమ్మూలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ భారత సైన్యంపై అనేక ఆరోపణలు గుప్పించాడు. కాశ్మీర్‌లో సైన్యం అనేక అరాచకాలకు పాల్పడు తోందని, కాశ్మీరీ మహిళలపై అత్యాచారాలు చేస్తోందని ఆరోపించాడు. కాశ్మీర్‌కు 'ఆజాదీ' ఇవ్వాలని ఈ పి డబ్ల్యూ అనే వామపక్ష పత్రికలో సంపాదకీయాలు వ్రాశాడు.

వెర్నన్‌ గొంజాల్‌ వెజ్‌

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, అక్రమ ఆయుధ చట్టం కింద అనేకసార్లు అరెస్ట్‌ అయ్యాడు. మావోయిస్ట్‌ లకు సహాయసహకారాలు అందిస్తున్నాడని వెర్నన్‌ ను 2007లో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. 20 గ్రనేడ్లు, 9 జిలెటిన్‌ పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. 2014 ఏప్రిల్‌ 11న నాగపూర్‌ కోర్టు 5 ఏళ్ళు జైలు శిక్ష విధించింది కూడా.

అరుణ్‌ ఫెరిరా

స్వచ్ఛంద సంస్థ ముసుగులో మావోయిస్ట్‌ లకు సహకార అందిస్తున్నదని అరుణ్‌ను 2007లో అరెస్ట్‌ చేశారు. ఆ తరువాత అనేకసార్లు అరెస్టు చేసి, విచారించారు. ఒక పోలీసుపై కాల్పులు జరిపాడన్న నేరం కింద విచారణ ఎదుర్కొంటు న్నాడు.