అందరి కోసం, అందరితో కలిసి పనిచేస్తుంది ఆర్‌ఎస్‌ఎస్‌ - డా. మోహన్‌ భాగవత్‌సెప్టెంబర్‌ 17,18,19 ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘచాలక్‌  శ్రీ మోహన్‌ భాగవత్‌ సమాజంలో సంఘాన్ని గురించి ఉన్న అనేక సందేహాలకు సమాధానం ఇచ్చారు.  'భవిష్యత్‌ భారతం : సంఘ దృష్టి కోణం' అనే అంశంపై ఆయన ప్రసంగించారు.

భక్తిమార్గాన్ని చూపిన మధ్వాచార్యులు


(విజయదశమి - శ్రీమధ్వాచార్యుల జయంతి)
శ్రీ మధ్వాచార్యులు 1238వ సంవత్సరం విజయదశమి రోజున కర్ణాటకలోని ఉడుపి సమీపాన 'పాజక' అనే కుగ్రామంలో జన్మించారు. శ్రీ  మధ్వాచార్యులు ప్రవచించిన 'ద్వైత వేదాంతం' ప్రకారం ఆత్మ, పరమాత్మ వేర్వేరు. పరమాత్మ సర్వ స్వతంత్రమైనది, ఆత్మ పరమాత్మ మీద ఆదారపడి ఉంటుంది అని 'ద్వైతం' తెలియ జేస్తుంది.

అభిమానం (స్ఫూర్తి)


లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రధాని అయ్యే సమయానికి ఆయన పెద్ద కుమారుడు హరికృష్ణ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. ఆ తరువాత అతనికి సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌గా ప్రమోషన్‌ వచ్చింది. అదే విషయం ఆయన తన తండ్రి అయిన లాల్‌ బహదూర్‌కు చెప్పారు.

పరిశుభ్రతే పుణ్యం (హితవచనం)తీర్థయాత్రలకు వెళ్ళి, కుంభమేళాలలో పాల్గొంటే సరిపోదు. మనం ఎక్కడకు వెళితే అక్కడ వాతావరణాన్ని, పరిసరాలను శుభ్రంగా ఉంచడం కూడా మన సంప్రదాయం, సంస్కృతిలో భాగమని గుర్తుంచుకోవాలి. అలా ప్రవర్తించాలి. అప్పుడే మనకు పూర్తి పుణ్యం, ఫలితం దక్కుతాయి. భక్తి, శ్రద్ధలు కేవలం భగవంతుని పైనే కాదు. ఆ భగవంతుడు నిండి ఉన్న పరిసరాల పట్ల కూడా ఉండాలి.

ప్రముఖులు మాట


ఆర్‌ఎస్‌ఎస్‌ ఏమిటి? ఏం చేస్తుందనే విషయం ఇప్పుడు చాలా మందికి తెలిసింది. ఆ సంస్థ కేవలం హిందువుల కోసమే కాదు, మొత్తం దేశం కోసం పని చేస్తుంది. అది క్రైస్తవులు, ముస్లిముల సంక్షేమాన్ని కూడా కోరుకుంటుంది.

- రాజా రెడ్డి, ప్రముఖ కూచిపూడి గురువు

అమరవాణి


అభ్యాసానుసరీ విద్యాః

బుద్ధిః కర్మానుసారిణీ!

ఉద్యోగానుసారీ లక్ష్మీ

ఫలం భాగ్యానుసారిణీ!

మన ఇల్లు ఇలా ఉండాలి...


-    ఇంటిపై ఓంకార చిహ్నముండాలి.

-    ఇటిపై కాషాయ ధ్వజము ఎగరాలి.

-    ఇంటి వాకిట్లో తులసి ఉండి రోజూ సేవించాలి. ఆవును పూజించాలి.

-    ఇంటిలో దేవతల, మహనీయుల చిత్ర పటములు మాత్రమే ఉండాలి.

సంఘాన్ని ప్రత్యక్షంగా చూడండి - డా. మోహన్‌ భాగవత్‌'భవిష్యత్తులో భారతం : ఆర్‌ఎస్‌ఎస్‌ దష్టి కోణం' అనే అంశంపై న్యూ డిల్లీలో ఏర్పాటుచేసిన మూడు రోజుల ఉపన్యాస కార్యక్రమంలో చివరిరోజున ఆర్‌ ఎస్‌ ఎస్‌ సర్‌ సంఘచాలక్‌ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

స్వామి పరిపూర్ణానందకు ఘన స్వాగతం


55 రోజుల తర్వాత స్వామి పరిపూర్ణానంద తిరిగి తెలంగాణలో అడుగుపెట్టారు (సెప్టెంబర్‌ 4). కాకినాడ నుండి బయలు దేరిన స్వామి మార్గ మద్యలో విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన తరువాత హైదరాబాద్‌ నగరానికి బయల్దేరారు. తెలంగాణలో ప్రవేశించిన తరువాత కోదాడ, సూర్యాపేట రహదార్లలో ప్రజలు రోడ్లపైకి వచ్చి స్వాగతం పలికారు. హైదరాబాద్‌లో హయత్‌నగర్‌, ఎల్‌బి నగర్‌ వీదులలో ప్రజలు ర్యాలి రూపంలో స్వాగతం పలికారు.

చమురు మంట చల్లారె దారి లేదా!చమురు ధరలపై చర్చ ముదిరి పాకానపడింది. ప్రతి వాళ్ళనోట చమురు మాటే. చమురు లేకపోతే బ్రతుకులేదన్న చందంగా చర్చలు సాగుతున్నాయి. కారణం భారతదేశం చమురు వాడకంలో ప్రపంచం లోనే మూడవ పెద్దదేశం. ఒకప్పుడు బస్సులో, రైలులో ప్రయాణం చేయడమే కష్టంగా ఉండేది. క్రమంగా దేశం అభివృద్ధి పథంలోకి రావడం, కొనుగోలు సామర్థ్యం పెరగడం, బ్యాంకులు వాహనాలు కొనుక్కునేందుకు ఋణాలివ్వడం, సులభవాయిదాలు, రహదారుల అభివృద్ధి, కాలం విలువ పెరగడం, ఖర్చుకు వెనుకాడకపోవడం ఇవన్నీ ఒక్కసారిగా సగటు మనిషికి సదుపాయాలు అందుబాటులోకి తెచ్చాయి.

స్వచ్చ భారత్‌ - ఆరోగ్య భారత్‌


మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్‌ 2న తెలంగాణ సేవాభారతి ఆధ్వర్యంలో భాగ్యనగర్‌లో స్వచ్చ భారత్‌ - ఆరోగ్య భారత్‌ కార్యక్రమం జరిగింది. మొత్తం 64 ప్రదేశాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన కార్యకర్తలు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్ధినీవిద్యార్ధులతో సహా 10వేల మందికిపైగా పాల్గొన్నారు.

బంజరును 'బంగారం'గా మార్చే అమృత్‌ మిట్టి


బంజరు భూమిని బంగారంగా మార్చే ప్రక్రియను కనిపెట్టింది ఉత్తర్‌ ప్రదేశ్‌ కు చెందిన అల్కా లహొటి. బిజ్నూర్‌కు చెందిన అల్కాకు  నాగినా గ్రామంలో పెద్ద గోశాల ఉంది. అక్కడి గోవుల మూత్రం, పేడ ఉపయోగించి భూమిని సారవంతం చేసే ప్రత్యేకమైన 'అమృత్‌ మిట్టి'ని తయారుచేసింది అల్కా. ఈ అమృత్‌ మిట్టి నిస్సారమైన నేలను కూడా సారవంతంగా తయారు చేస్తుందని ఆమె అంటోంది.

భారత మాత సేవలో సోదరి 'నివేదిత'


మనదేశం బ్రిటిష్‌వారి పాలనలో ఉన్న కాలమది. అనేక సమస్యలు, అవిద్య, పేదరికం ఇతర సామాజిక రుగ్మతలలో సతమతమవుతున్న మనదేశానికి పశ్చిమ దేశాల నుండి సేవాభావంతో సహాయం చేసేందుకు కొందరు వ్యక్తులు వచ్చారు. వారిలో మార్గరెట్‌ నోబుల్‌ ఒకరు. కేవలం సేవా భావమే కాకుండా భారత దేశపు సాంస్కృతిక జ్యోతి తనను ఆకర్షించిన కారణంగా భారతదేశమే తమ గమ్యంగా భావించి ఆజీవన పర్యంతం ఇక్కడి ప్రజలలో మమేకమై సోదరి నివేదితగా మనకు ప్రాతఃస్మరణీయురాలైనది.

తలనొప్పి (వాత దోషం)


త్రిదోషాలలో (వాత, కఫ, పిత్త) ఏ దోషము ఎక్కువవ్వడం వల్లనైనా తల2నొప్పి రావచ్చని ఆయుర్వేదము చెబుతుంది. తలనొప్పి రాగానే వెంటనే ఇంగ్లీషు మందు వేసుకొనే కంటే, ఎందుకు వచ్చిందో కాస్త పరిశీలించాలి.

ఐకమత్యమే బలం


అవగాహన, సంస్కరణ, పురోగతి కోసం షికాగోలో ప్రపంచ హిందూ సదస్సు
 
'ఓ హిందూ! మేలుకో!' అన్న స్వామి వివేకానందుని పిలుపునకు మేల్కొని వచ్చిన హిందూ జనవాహినితో నిండినట్టే కనిపించింది షికాగో నగరం. ఈ సెప్టెంబర్‌ 7,8,9 తేదీలలో అక్కడే రెండవ విశ్వహిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. మళ్లీ ఒక్కసారి ప్రపంచదేశాలు ఆ నగరం వైపు చూశాయి. 125 ఏళ్ల క్రితం ఈ నగరం నుంచే వివేకానందుడు చేసిన గర్జనతో ప్రపంచం అటు దృష్టి సారించింది.