తలనొప్పి (వాత దోషం)


త్రిదోషాలలో (వాత, కఫ, పిత్త) ఏ దోషము ఎక్కువవ్వడం వల్లనైనా తల2నొప్పి రావచ్చని ఆయుర్వేదము చెబుతుంది. తలనొప్పి రాగానే వెంటనే ఇంగ్లీషు మందు వేసుకొనే కంటే, ఎందుకు వచ్చిందో కాస్త పరిశీలించాలి.


ఉదాహరణ

మానసిక వత్తిడి, జ్వరము, మత్తు పదార్థాలు ఎక్కువ సేవించడం, టీవీని దగ్గరగా ఎక్కువ సమయం చూడడం, గతంలో తీసుకున్న ఇంగ్లీషు మందుల సైడ్‌-ఎఫెక్ట్‌, సమీపకాలంలో తలకి తగిలిన గాయాలు, తగినంత నిద్ర లేకపోవడం మొదలగు కారణాల వల్ల కూడా రావచ్చు.

చిట్కాలు

-    బాదంనూనె ముక్కు రంధ్రాలలో చెరొక చుక్క బాదంనూననె వేసుకోవాలి.

-    ఒక చంచా దాల్చినచక్క నూనె, మరో చంచా లవంగనూనె కలిపి నుదురుపై మర్దన చేసుకోవాలి.

-    తడి తువ్వాలును మెడ చుట్టూ కట్టుకోవాలి.

-    కొబ్బరి నూనె గాని, నువ్వులునూనె గాని జుట్టు కుదుళ్ళలో బాగా మర్దన చేసుకోవాలి.

-    వేయగలిగితే శీర్షాసనం చాలా ఉపశమనం ఇస్తుంది.

ఆహారనియమాలు

-    వేరు శనగలు, బాదాం పప్పు, ప్రొద్దుతిరుగుడు పువ్వు గింజలు మొదలగునవి నానపెట్టి తినవలెను. నానపెట్టనిచో వాతదోషం ప్రకోపిస్తుంది

-    సొరకాయ, బీరకాయ మొదలగు తొందరగా జీర్ణమయ్యే కూరగాయలనే తినవలెను. మాంసాహారము, కోడిగుడ్లు, చేపలు అస్సలు తినరాదు.

ఇవే కాక ఎల్లప్పుడూ మల, మూత్ర విసర్జనలు ఎక్కువగా ఆపరాదు. పగలు నిద్ర పోకూడదు. తీక్షణమైన ఎండలో బయటకు పోకూడదు. ఇవన్నీ పాటించినా ఉపశమనము లేనిచో, దీర్ఘకాలంగా ఒకే ప్రదేశంలో తలనొప్పి ఉన్నచో వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి.