పరిశుభ్రతే పుణ్యం (హితవచనం)తీర్థయాత్రలకు వెళ్ళి, కుంభమేళాలలో పాల్గొంటే సరిపోదు. మనం ఎక్కడకు వెళితే అక్కడ వాతావరణాన్ని, పరిసరాలను శుభ్రంగా ఉంచడం కూడా మన సంప్రదాయం, సంస్కృతిలో భాగమని గుర్తుంచుకోవాలి. అలా ప్రవర్తించాలి. అప్పుడే మనకు పూర్తి పుణ్యం, ఫలితం దక్కుతాయి. భక్తి, శ్రద్ధలు కేవలం భగవంతుని పైనే కాదు. ఆ భగవంతుడు నిండి ఉన్న పరిసరాల పట్ల కూడా ఉండాలి.
గంగా నదిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాం. పూజిస్తాం. కానీ అదే గంగను కలు షితం చేస్తాం. కాబట్టి శ్రద్ధ అనేది మానసిక మైనది, శారీరికమైనది కూడా. మతం పేరుతో పరిసరాలను కలుషితం చేయడం దారుణమైన విషయం. అది ఎవరు చేసినా సరికాదు.

- మహాత్మా గాంధీ