ప్రముఖులు మాట


ఆర్‌ఎస్‌ఎస్‌ ఏమిటి? ఏం చేస్తుందనే విషయం ఇప్పుడు చాలా మందికి తెలిసింది. ఆ సంస్థ కేవలం హిందువుల కోసమే కాదు, మొత్తం దేశం కోసం పని చేస్తుంది. అది క్రైస్తవులు, ముస్లిముల సంక్షేమాన్ని కూడా కోరుకుంటుంది.

- రాజా రెడ్డి, ప్రముఖ కూచిపూడి గురువు

 

ఆర్‌ఎస్‌ఎస్‌ ఏం చెపు తోందన్నది తెలుసుకోవడం కేవలం భారతీయులకే కాదు మొత్తం ప్రపంచానికి అవసరం. సర్‌ సంఘచాలక్‌ మన సంస్కృతి, సంస్కారాల గురించి మాట్లాడారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సంస్కృతి, సంస్కారాల్లోనే పరిష్కారం ఉందని నేను భావిస్తాను.

- సంతోష్‌ యాదవ్‌ , పర్వతారోహకురాలు 


ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ప్రబల శక్తిగా రూపొందింది. అయినా ఇప్పటికీ ఆ సంస్థ గురించి అనేక సందేహాలు ఉన్నాయి. సంఘానికి రాజకీయాలతో సంబంధం లేదన్న మోహన్‌ భాగవత్‌జీ మాటలు చాలా ప్రధానమైనవి. అలాగే ఆయన హిందువు అంటే ఎవరన్న విషయాన్ని కూడా స్పష్టంగా వివరించారు.

- సర్దార్‌ తార్లోచన్‌ సింగ్‌, జాతీయ మైనారిటీ సంఘం మాజీ అధ్యక్షుడు