మన ఇల్లు ఇలా ఉండాలి...


-    ఇంటిపై ఓంకార చిహ్నముండాలి.

-    ఇటిపై కాషాయ ధ్వజము ఎగరాలి.

-    ఇంటి వాకిట్లో తులసి ఉండి రోజూ సేవించాలి. ఆవును పూజించాలి.

-    ఇంటిలో దేవతల, మహనీయుల చిత్ర పటములు మాత్రమే ఉండాలి.

-    ఇల్లు ఆవరణ, పరిసరాల పరిశుభ్రత, ముగ్గులు వ్యవస్థితంగా ఉందాలి.

-    ఇంటిలో శుద్ద త్రాగు నీటి వ్యవస్థ, మురుగునీరు పోవుటకు వ్యవస్థ ఉండాలి.

-    ఇంటి ఆవరణలో ఆకుకూరలు, కూరగాయలు మరియు వేప వంటి నీడ మొక్కల పెంపకము జరగాలి.

-    ఇంటి వారంతా ప్రాతఃకాలమే లేచుట, వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని వ్యాయామము, యోగ చేయాలి.

-    ప్రతి నిత్యం స్నానం, కుంకుమధారణ చేయాలి. దేవునికి నమస్కరించి, కలసి ప్రార్థన చేయాలి. అందరి క్షేమము, దేశ క్షేమము కోరుకోవాలి.

-    కుటుంబ సభ్యులు నియమింతంగా దేవాలయానికి వెళ్ళాలి.

-     పిన్నలు తమ ఇంటిలోని పెద్దలకు, తల్లి దండ్రులకు పాదాభివందనం చేయాలి.

-    భోజనము ముందు భగవంతుని స్మరించాలి.

-    ఇంటి వారంతా కనీసం ఒక పూట కలిసి భోజనం చేయాలి.

-    ఇంటి వారంతా ఆత్మీయంగా కలసిమెలసి ఉండాలి.

-    ఇంటిలో అతిథి మర్యాదలను పాటించాలి.

-    కుటుంబ వాతావరణం సంస్కారప్రదంగా ఉండాలి. అరుపులు కేకలు కాక పరస్పరము ప్రేమపూర్వకముగా మాట్లాడుకోవాలి. అనుభవములు పంచుకోవాలి.

-    ఇరుగు పారుగు వారితో సత్సంబంధము కలిగి ఉండాలి.

-    ఇంటి వారంతా సామాజిక సమరసతను పాటించుట, హిందూ బంధువులందరితో (కుల ప్రసక్తి లేకుండా) సహపంక్తి భోజనం చేయాలి.

-    మాతృభాషను, సంస్కృతమును నేర్చుకోవాలి, మాట్లాడాలి.

-    ఇంటిలో సత్‌గ్రంథ శ్రవణము, పఠనము పట్ల ఆసక్తి.

-    ఇంటిలో యోగ్య పత్రికల పఠనము, వార్తలు వినుటలో ఆసక్తి.

-    ఇంటిలో టెలివిజన్‌, టేప్‌ రికార్డర్‌ల వాడకంపై అదుపు.

-    ఇంటిలో స్వదేశీ వస్తువులనే వాడుట, విదేశీ వ్యామోహానికి దూరంగా ఉండుట, అనుకరణకూ దూరంగా ఉండుట.

-    ఇంటిలో మిత వ్యయమును పాటించుట, పొదుపు చేయట.

-    ధర్మసేవా కార్యముల కోసం ఖర్చు చేయుట.

-    ఇంటిలో వారంతా పొగాకు, మద్యపానము, జూదము మొదలగు దుర్వ్యసనములకు దూరంగా ఉండుట.

-     తమ వీధి శుభ్రత, బాగోగులను పట్టించు కోవాలి.

-     పెళ్ళివంటి శుభకార్యములలో దుబారా ఆడంబరములు లేకుండా చేసుకోవాలి.

-    మన వేషభాషలందు భారతీయ సంస్కారము కలిగియుండాలి.