స్వామి పరిపూర్ణానందకు ఘన స్వాగతం


55 రోజుల తర్వాత స్వామి పరిపూర్ణానంద తిరిగి తెలంగాణలో అడుగుపెట్టారు (సెప్టెంబర్‌ 4). కాకినాడ నుండి బయలు దేరిన స్వామి మార్గ మద్యలో విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన తరువాత హైదరాబాద్‌ నగరానికి బయల్దేరారు. తెలంగాణలో ప్రవేశించిన తరువాత కోదాడ, సూర్యాపేట రహదార్లలో ప్రజలు రోడ్లపైకి వచ్చి స్వాగతం పలికారు. హైదరాబాద్‌లో హయత్‌నగర్‌, ఎల్‌బి నగర్‌ వీదులలో ప్రజలు ర్యాలి రూపంలో స్వాగతం పలికారు.

స్వామి పరిపూర్ణానంద పై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను ఎత్తివేయాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి న్యాయస్థానం ఆగస్ట్‌ 14 నాడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. తెలంగాణ పోలీసులు, అధికారులు వ్యవహారంచిన తీరు.. స్వామిజీపై విధించిన నిర్భంధం సహజ న్యాయసూత్రాలకు పూర్తి విరుద్ధమని పేర్కొంది..!

సంఘ విద్రోహచర్యలకు పాల్పడుతూ... రెండుసార్లు శిక్షకు గురైన వారికి మాత్రమే నగర బహిష్కరణ విధిస్తారని.., స్వామి పై హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఒక్క కేసు కూడా లేదని.., అలాంటప్పుడు వారిని ఎలా బహిష్కరించడం అంటే.. భారత భూభాగంలో ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించే స్వేచ్ఛా హక్కును హరించడమే! ఇది స్వామిజీ ప్రాథమిక హక్కునకు భంగం కలిగించడమేనని తెలిపింది.