చమురు మంట చల్లారె దారి లేదా!చమురు ధరలపై చర్చ ముదిరి పాకానపడింది. ప్రతి వాళ్ళనోట చమురు మాటే. చమురు లేకపోతే బ్రతుకులేదన్న చందంగా చర్చలు సాగుతున్నాయి. కారణం భారతదేశం చమురు వాడకంలో ప్రపంచం లోనే మూడవ పెద్దదేశం. ఒకప్పుడు బస్సులో, రైలులో ప్రయాణం చేయడమే కష్టంగా ఉండేది. క్రమంగా దేశం అభివృద్ధి పథంలోకి రావడం, కొనుగోలు సామర్థ్యం పెరగడం, బ్యాంకులు వాహనాలు కొనుక్కునేందుకు ఋణాలివ్వడం, సులభవాయిదాలు, రహదారుల అభివృద్ధి, కాలం విలువ పెరగడం, ఖర్చుకు వెనుకాడకపోవడం ఇవన్నీ ఒక్కసారిగా సగటు మనిషికి సదుపాయాలు అందుబాటులోకి తెచ్చాయి.
1993లో లీటరు రూ||11/- ఉన్న పెట్రోలు 25 ఏళ్ళలో రూ.80/- పైకి పాకినా, సగటు మనిషికి వాహనాన్ని మించిన పుష్పక విమానం కనబడల్లేదు. నిజానికి జన బాహుళ్యం ఎక్కువగా వున్న భారత్‌లాంటి దేశాల్లో ప్రజా రవాణా(జూబపశ్రీఱష ్‌తీaఅరజూశీత్‌ీ) పెరగాల్సిన అవసరం ప్రభుత్వాలు గుర్తించేలోపే అందరికీ వాహనాలు అమరడం, కొనుగోలు చేయడం జరిగిపోతోంది. కొందరికి రెండు వాహనాలు కూడా ఉంటున్నాయి. సైకిలు మీద తిరిగే జనం కనపడటం లేదు. నగరాలలో అయితే ఒక్కొక్కరికి రెండు మూడు కార్లుండే ఇళ్లు కూడా ఉన్నాయి. నిత్యావసర వస్తులువులకంటే పెట్రోలు, డీజిలు అవసరం బాగా పెరిగిపోయింది.  

ఢిల్లీలో 14 ఏళ్ళలో పెట్రోలు, డీజిలు ధరలు

 ఎన్‌డిఎ గత నాలుగున్నరేళ్ళ కాలంలో కంటె యూపిఎ 10 ఏళ్ళకాలంలో పెట్రోలు, డీజిల్‌ ధరల వృద్ధి చాలా ఎక్కువగా ఉంది. 2008లో బ్యారెల్‌ ధర గరిష్ఠంగ 140 డాలర్లు వుంది. 2016లో 30 డాలర్లకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 78 డాలర్లకు చేరింది. అయితే బ్యారెల్‌ ధర తగ్గినపుడు కేంద్రం ధర తగ్గిస్తే అందులో 20% వినియోగ దారుడికి లబ్ధి కలుగు తుంది. 20% అభివృద్ధి కోసం వెచ్చించ బడుతోంది. కాని కేంద్రం ధర తగ్గించినపు డల్లా రాష్ట్రాలు వ్యాట్‌ రూపం లో అధిక శాతం వసూలు చేస్తున్నాయి. అందుకనే ఒక్కొ రాష్ట్రంలో వ్యాట్‌ ఒక్కోరకంగా ఉంటోంది. కేంద్రం విధించే ఎక్సైజ్‌ సుంకం 2014లో లీటరుకు రూ.9.45 పైసలుండేది. 2018 జనవరిలో అతి గరిష్ఠంగా రూ.21.48కి చేరింది. కాని ఈ ఎక్సైజ్‌ సుంకంలో 42 శాతం రాష్ట్రాలకు లభిస్తుంది. మిగిలిన మొత్తాన్ని కేంద్రం జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులకోసం వెచ్చిస్తుంది. కనుక పెట్రోలు, డీజిల్‌ ధరల్లో కేంద్ర ప్రమేయం చాలా తక్కువ అనే విషయం స్పష్టమవు తోంది.

అప్పులు తీర్చడానికే సరిపోయింది

మోడీ ప్రభుత్వం వచ్చే సరికి అంతర్జాతీయంగా బ్యారెల్‌ ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ లాభాన్ని చమురు దిగుమతులకై గత యూపిఏ ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడానికి వినియోగించింది. ఆ విధంగా ఇరాన్‌కు రెండు లక్షల కోట్ల రూ||ల అప్పును చెల్లించింది. కాని ఇది ఎవరికి కావాలి? యూపిఎ పాపానికి ఎన్‌డిఎకు పరిహారం తప్పలేదు. అంతర్జాతీయ బ్యారెల్‌ ధరల తగ్గుదలవల్ల ఆదా ఆయిన మొత్తాన్ని ఎన్‌డిఎ ప్రభుత్వం కొన్ని భారీ ప్రాజెక్టుల కోసం వాడింది. పోర్టుల అభివృద్ధి (సాగరమాల), రోడ్ల అభివృద్ధి (భారత్‌మాల),  ఎయిర్‌ పోర్టుల అనుసంధానం, ప్రధానిమంత్రి యోజన, ఉజ్వల (ఎల్‌పిజి కనెక్షన్లు), ఉజాల (ఎల్‌ఇడి బల్బుల పంపిణి), ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రములు (జనరిక్‌ మెడిసిన్‌), ఆయు ష్మాన్‌ భారత్‌ వంటి పథ కాల రూపంలో పేదలలో పేదకు (అంత్యోదయ) లబ్ధి చేకూరే విధంగా యోజన చేసింది. యూపిఎ ప్రారంభించిన మహాత్మాగాంధి జాతీయ ఉపాధి పథకం, ఆహార భద్రతా చట్టం అమలు వంటివి వుండనే ఉన్నాయి.

వ్యాట్‌ తగ్గించిన రాష్ట్రాలు

పెట్రో ధరల పెరుగుదలవల్ల రాష్ట్రాలకు రూ.22,000 కోట్ల ఆదాయం లభిస్తుంది. కనుక వారు వ్యాట్‌ తగ్గించుకొనే వీలుంది. రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, కర్నాటకలు ఇప్పటికే వ్యాట్‌ను తగ్గించాయి. కాని దీననివల్ల కేంద్ర ఆదాయం పెద్దగా పెరిగేది లేదు.

మన జీవితమంతా పెట్రోలు, డిజిల్‌ ధరలపైనే ఆధారపడి లేదు.  ప్రభుత్వాన్ని అన్నింటికీ నిందిస్తే ప్రయోజనంలేదు. గతంలో నేషనల్‌ఫ్రంట్‌ అధికారంలో ఉన్నపుడు పెట్రో ఉత్పత్తుల కొరత కారణంగా కేవలం నియమిత వేళల్లోనే పెట్రోలు బంకులు పనిచేసేవి. పెట్రో ధరలను పక్కనపెట్టి గత జూలై నుంచి అమలులోకి వచ్చిన జిఎస్‌టిని గురించి చర్చిస్తే జిఎస్‌టివల్ల సామాన్యుడి జీవితంలో రూ.7వేల నుండి రూ.12వేల వరకు ఖర్చు తగ్గినట్లు తెలుస్తుంది. పెట్రో ధరల విషయంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకుంటాయని ఆశిద్దాం.

- హనుమత్‌ప్రసాద్‌