విఘటన శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలి - డా. మోహన్‌ భాగవత్‌
ప.పూ. సర్‌ సంఘచలక్‌ విజయదశమి ఉపన్యాసపు సంక్షిప్త రూపం

దేశ భద్రత

ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, సుసంపన్నం కావాలంటే అందుకు తగిన అవకాశం, పరిస్థితులు ఉండాలి. అవి ఏర్పడటానికి సరిహద్దు భద్రత, అంతర్గత భద్రత అత్యవసరం. రక్షణ పరమైన మన సమస్యలను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యల పరిష్కారంలో ఆ దేశాల సహాయ సహకారాలు పొందే విధంగా అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నంలో మనం చాలావరకు ఫలితాన్ని సాధించగలిగాం. 

దీపావళి


 

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్‌|

దీపేన సాద్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే ||

జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనో వికాసానికి, ఆనందానికి, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. దీపాల పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకొంటారు. దీపావళి పర్వదినం శరదృ తువులో వస్తుంది. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం ఇది.

ధర్మరక్షణ కోసం బలిదానం (స్ఫూర్తి)


ఔరంగజేబు అకృత్యాలు, దారుణాలు మితిమీరి పోయాయి. ముఖ్యంగా కాశ్మీర్‌లో పండిట్‌లను మతంమార్చడానికి ప్రయత్నించాడు. దిక్కుతోచక వారు సిక్కు గురువు గురుతేగ్‌బహదూర్‌ దగ్గరకి వచ్చారు. తమ కష్టాల్ని చెప్పుకుని వీటి నుంచి బయటపడే మార్గం చెప్పమని మొరపెట్టు కున్నారు. వాళ్ళ దయనీయ పరిస్థితి చూసిన గురుతేజ్‌ బహదూర్‌ 'ఎవరో ఒక మహాపురుషుని బలిదానంతోకానీ ఈ సమస్య పరిష్కారం కాదు'అని అన్నారు. 

భారతమాత సాక్షాత్కారం కావాలి (హితవచనం)ప్రఖరమైన, నిష్కళమైన దేశభక్తి అంటే భారత భూమిని ఒక దేవతగా ఆరాధించటం. దైవాన్ని సాక్షాత్కరింపచేసుకోవాలంటే, ముందుగా యావత్‌ జాతితో తాదాత్మ్యం చెందాలి. 

అమరవాణి


శైలే శైలే న మాణిక్యం

మౌక్తికం న గజే గజే

సాధవో న హి సర్వత్ర

చందనం న వనే వనే ||


ప్రముఖులు మాట


 కాశ్మీర్‌ను హిందూ రాజు పరిపాలించినంత కాలం అక్కడి హిందువులు, సిక్కులు క్షేమంగానే ఉన్నారు. హిందూ రాజు ప్రాభవం తగ్గడం మొదలవగానే హిందువుల పతనం కూడా మొదలైంది. ఇప్పుడక్కడ హిందువులు, సిక్కుల పరిస్థితి ఏమిటి? అక్కడ వారు క్షేమంగా ఉన్నారని ఎవరైనా గట్టిగా చెప్పగలరా?

- యోగి ఆదిత్యనాధ్‌, యూపీ ముఖ్యమంత్రి 

రామ మందిర నిర్మాణం హిందువుల విశ్వాసానికి సంబంధించిన విషయం - శ్రీ భయ్యాజీ జోషి


ముంబై కేశవ సృష్టిలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అఖిల భారతీయ కార్యకారిణి మండలి సమావేశాలల్లో చర్చించిన వివిధ జాతీయ అంశాలను గురించి సర్‌ కార్యవాహ్‌ శ్రీ సురేశ్‌ జోషి పత్రికలవారికి వివరించారు.

అయ్యప్ప భక్తుల శాంతియుత ఆందోళనల్లో విధ్వంసానికి కుట్ర ?శబరిమల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సాగుతున్న అయ్యప్ప భక్తుల శాంతియుత ఆందోళనల్లో తీవ్రవాదులు విధ్వంసానికి కుట్ర పన్నుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప భక్తుల నిరసనల్లో సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఇబ్రహీం కుట్టీ సివిల్‌ దుస్తుల్లో పాల్గొన్న ఘటన అనుమానాలను మరింత బలపరుస్తోంది. 

శబరిమలలో సమస్య ఏమిటి?కేరళలో వయసుతో నిమిత్తం లేకుండా మహిళ లందరూ శబరిమల ఆలయంలోకి ప్రవేశించ వచ్చనే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత హిందూ సంప్రదాయాల రక్షణకోసం, వేలాదిమంది మహిళలు తీర్పుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసారు. సమానత్వం, హక్కుల పేరుతో శబరిమల ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలను కోవడంపట్ల వీరు అభ్యంతరం తెలిపారు. ఈ నిరసన దృష్ట్యా, 10 నుండి 50 మధ్య వయస్సు గల మహిళల ప్రవేశాలపై నిషేధం వివక్ష, హక్కుల ఉల్లంఘనా అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. అది నిజంగా ఉల్లంఘన అయితే మరి వేలాదిమంది కేరళ మహిళలు ఎందుకు తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు? అనే ప్రశ్న కూడా వస్తుంది.

ఈ ఉద్యమాల్లో నిజమెంత?


 
'మీటూ' పేర మీడియాలో చెలరెగిపోతున్న ఉద్యమం తీరుతెన్నులు చూస్తే దీని నేపధ్యం, వెలికివచ్చిన తీరు, వ్యవహరిస్తున్న తీరు, రాగల కీడు ఇవన్నీ బేరీజు వేసుకోవాల్సిన అవసరం కనపడుతున్నది. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తున్న సమయంలో అనేకమంది స్త్రీలు 'మీటూ' అంటూ తాము గతంలో పడ్డ లైంగిక వేధింపులు, అందుకు కారణమైన వ్యక్తుల పేర్లు, వారి పోకడలు బయటపెడుతూ మీడియాలో 10 రోజుల పాటు నడచిన రచ్చలు, చర్చలు ఏవగింపు కలిగించాయి. 

భాగ్యనగర్ లో జరిగిన విజయదశమి ఉత్సవాలు


బర్కత్ పుర భాగ్

గో పోషణ, గోఉత్పత్తులు తయారీలో శిక్షణ

అఖిల భారత గోసేవా ప్రముఖ్‌ మాన్యశ్రీశంకర్‌ లాల్‌ జీ తెలంగాణా పర్యటనలో సెప్టెంబర్‌ 3 నుండి 9 వతేదీ వరకు భాగ్యనగర్‌ కేంద్రంగా వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ప్రముఖ గోశాలలను సుమారు 10 సందర్శించి ఆయా కార్యకర్తలకు చక్కని మార్గదర్శనం చేశారు. శ్రీ చిన్నజీయర్‌ స్వామి జీవా గోశాలలో శ్రీ కృష్ణాష్టమి ఉత్సవంలో స్వామీజీతో బాటు పాల్గొని సందేశం ఇచ్చారు.

కులాలకతీతంగా అందరూ ఏకం కావాలి - శ్రీ గరికపాటి నరసింహారావు


కులాలకతీతంగా అందరూ ఏకం కావాలని, అహంకారం, మమకారాలు వదలి తోటి ప్రజలతో సామరస్యంగా జీవించాలని, ఎక్కువ తక్కువ భేదాలు మరిచి సమరస భావంతో మెలగాలని సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు ఉద్బోదించారు. సామాజిక సమరసతా వేదిక, ఖమ్మం, ఆధ్వర్యంలో 30 అక్టోబర్‌ నాడు నగరంలోని పెవీలియన్‌ మైదానంలో పెద్ద ఎత్తున నిర్వహించిన సమ్మేళనంలో శ్రీ గరికపాటి నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

దీప్తులు చిందించే దీపావళిచీకటి అజ్ఞానానికి సంకేతం...వెలుగు జ్ఞానానికి చిహ్నం. దీపం చిన్నదైనా చుట్టుపక్కల అంతా వెలుగును నింపుతుంది. అలాగే మనలో ఉన్న జ్ఞానం కూడా వెలుగులు విరజిమ్ముతూ తనతో పాటూ నలుగురిని ప్రకాశవంతులు చేయాలనేదే దీపావళి. అజ్ఞానందకారాన్ని పారద్రోలి జ్ఞాన కాంతులు విరజిమ్మే పండుగ ఇది. దేశమంతా ఆనందోత్సాహాలతో జరుపుకుంటుంది. అమావాస్య నాటి చీకటి రాత్రిని పిండారబోసినట్లు అనిపించే వెన్నెల వెలుతురులా దీపాలకాంతితో నిండి పోతుంది. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి ఇది.

ఇవి మీకు తెలుసా ?


-     అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

-     కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

-     నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్‌ అనే గ్లూకోసైట్‌, మధుమేహాన్ని అదుపులో ఉంచు తుంది.

-     గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

ప్రయాగ్‌రాజ్‌గా అలహాబాద్‌.. పేరు మార్చిన యూపీ ప్రభుత్వం


అలహాబాద్‌ నగరపు పేరును ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తున్నట్లు ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. 2019 కుంభమేళాకు ముందు అలహాబాద్‌ పేరు మార్చాలని యోగి ఆదిత్యనాధ్‌ ప్రభుత్వం మొదటినుంచి అనుకుంటోంది.  గవర్నర్‌ కూడా పేరు మార్పకు సంబంధించి ఆమోద ముద్ర వేయడంతో ప్రభుత్వం ఆ ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో అలహాబాద్‌  ఇక మీదట ప్రయాగ్‌ రాజ్‌గానే గుర్తింపు పొందుతుంది.

రోహింగ్యాలను తిప్పిపంపిన భారత ప్రభుత్వం


అస్సోంలో అక్రమ నివాసం ఏర్పరచుకున్న 15మంది రోహింగ్యాలను భారత ప్రభుత్వం వారి స్వస్థలమైన మయన్మార్‌ కు తిప్పిపంపింది. రోహింగ్యాల విషయమై దేశంలో నెలకొన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అక్రమ చొరబాటుదారులు అసోంలోని సిల్చార్‌లో 2012 నుండి నివసిస్తున్నట్లు పోలీసు దర్యాఫ్తులో తేలింది. వీరికి మయన్మార్‌ పౌరసత్వం ఉన్నట్లు కూడా బయటపడింది. వీరు రఖినే ప్రాంతానికి చెందినవారు.

ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్సిల్‌లో భారత్‌కు సభ్యత్వం


అత్యధిక ఓట్లు సంపాదించడం ద్వారా భారత్‌ అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ యుఎన్‌ హెచ్‌ఆర్‌సిలో సభ్యత్వాన్ని పొందింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి సభ్యులను ఎంపిక కోసం జరిగిన ఎన్నికలో భారత్‌ కు అత్యధికంగా 188 ఓట్లు లభించాయి. మానవహక్కుల కౌన్సిల్‌కు కొత్తగా ఎన్నికైన 18 దేశాల్లో భారత్‌ కూడా స్థానం సంపాదించింది.