అమరవాణి


శైలే శైలే న మాణిక్యం

మౌక్తికం న గజే గజే

సాధవో న హి సర్వత్ర

చందనం న వనే వనే ||భావం : అన్ని పర్వతాలలో మణిమాణిక్యాలు దొరకావు. అన్ని ఏనుగుల శిరస్సుల నుండి మౌక్తికం లభించదు; అన్నిచోట్లా సాధువులు ఉండరు. సువాసనాభరితమైన గంధపు చెట్లు అన్ని అడవులలోనూ ఉండవు. (అమూల్యమైనవి ఎప్పుడూ అరుదు, అపురూపమే)