గో పోషణ, గోఉత్పత్తులు తయారీలో శిక్షణ

అఖిల భారత గోసేవా ప్రముఖ్‌ మాన్యశ్రీశంకర్‌ లాల్‌ జీ తెలంగాణా పర్యటనలో సెప్టెంబర్‌ 3 నుండి 9 వతేదీ వరకు భాగ్యనగర్‌ కేంద్రంగా వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ప్రముఖ గోశాలలను సుమారు 10 సందర్శించి ఆయా కార్యకర్తలకు చక్కని మార్గదర్శనం చేశారు. శ్రీ చిన్నజీయర్‌ స్వామి జీవా గోశాలలో శ్రీ కృష్ణాష్టమి ఉత్సవంలో స్వామీజీతో బాటు పాల్గొని సందేశం ఇచ్చారు.

ఓంకార్‌ గోశాల, సత్యంశివంసుందరం గోశాల, డా.కృష్ణప్రసాద్‌ గోశాల, కీసర సాయిధామం గోశాల, సప్తపర్ణి పిలాయిపల్లిగోశాల, మౌంట్‌ శంబల గ్లోబల్‌ పవర్‌ సెంటర్‌ గోశాల, భూలక్ష్మిగోశాల, జిల్లెళ్ళగూడ వేంకటేశ్వరస్వామి గోశాల, ప్రొ.యమ్‌.యమ్‌.రావు గోశాలలలో ప్రత్యక్షంగా మార్గదర్శనం చేశారు.

ఘటకేసర్‌ ఏదులాబాద్‌ దగ్గరి శ్రీ హంసరాజ్‌ 1000 కెపాసిటి గల పెద్దగోబర్‌గాస్‌ ప్లాంట్‌ను సందర్శించారు. ఐఐసిటిలోని ప్రముఖ శాస్త్ర్‌ వేత్త శ్రీ విజయ్‌ కుమార్‌గారితో గోవు విషయంలో వారి పరిశోధనలపై సమీక్షించారు.


7వ తేదీ ప్రముఖ ప్రభుత్వ ఆయుర్వేదిక్‌ కాలేజీలో పిజి, మరియు ఫైనల్‌ ఇయర్‌ విద్యార్ధులు, వివిధ ప్రొఫెసర్లతో గోవు-పంచగవ్య చికిత్సలపై సంభాషించారు. ఆయూష్‌ డైరెక్టర్‌ శ్రీ రాజేందర్రెడ్డి, ఆరోగ్యభారతి అ.భా. సంయోజక్‌ శ్రీ డా.సురేందర్‌ రెడ్డి, కళాశాల డైరెక్టర్‌ శ్రీనరసింహారెడ్డి, ప్రిన్సిపాల్‌ శ్రీ విజయ గణపతిరెడ్డి, అనేకమంది పెద్దలు పాల్గొన్నారు.

8వ తేదీ KMITలో విశేషంగా 10 సంస్థలతో కలిసి ఏర్పాటైన సమావేశంలో పంచగవ్య వైద్యంపై అనేక విషయాలు, చికిత్సాపద్ధతులు వివరించారు.

చివరగా 2 రోజులు ముఖ్యమైన తెలంగాణా అన్ని జిల్లాల గోసేవ ప్రముఖులు, సంయోజకులు, జిల్లాల శిక్షణాప్రముఖులు, అట్లే విభాగ్‌, ప్రాంత బాధ్యతలు గల వారితో అనేక విషయములపై సమావేశము, సమాలోచనములు జరిగినవి.

అ.భా.సహగోసేవ ప్రముఖ్‌ శ్రీ అజిత్‌ మహా పాత్రోజీ, అ.భా. శిక్షణాప్రముఖ్‌ శ్రీ రాఘవన్‌ జీ, ప్రాంతగోసేవ ప్రభారీ శ్రీ సుందర్‌రెడ్డి పాల్గొన్నారు.

వ్యవసాయంలో గోఆధారితంగా అధికదిగుబడి విధానాలు, కీటనియంత్రికాలు, ముఖ్యమైన సంజీవనీ ఎరువు వంటివి తయారీ, గోవులకు సులభ వైద్య విధానాలు, గోవు ద్వారా మనుష్యులకు అత్యంత ప్రభావితమైన సులభ వైద్యం, గో పోషణ, గోఉత్పత్తులు తయారీ, మొదలగు విషయాలపై చక్కని శిక్షణా, చర్చా కార్యక్రమం ప్రభావంతంగా జరిగింది.