ప్రముఖులు మాట


 కాశ్మీర్‌ను హిందూ రాజు పరిపాలించినంత కాలం అక్కడి హిందువులు, సిక్కులు క్షేమంగానే ఉన్నారు. హిందూ రాజు ప్రాభవం తగ్గడం మొదలవగానే హిందువుల పతనం కూడా మొదలైంది. ఇప్పుడక్కడ హిందువులు, సిక్కుల పరిస్థితి ఏమిటి? అక్కడ వారు క్షేమంగా ఉన్నారని ఎవరైనా గట్టిగా చెప్పగలరా?

- యోగి ఆదిత్యనాధ్‌, యూపీ ముఖ్యమంత్రి విపక్ష పార్టీలు, మేధావులు అసహిష్ణుత, అంతరానితనం  గురించి చాలా బాధపడి పోతుంటారు. కానీ వారే (ఆర్‌ఎస్‌ఎస్‌పట్ల) అసహిష్ణుతను, అంతరానితనాన్ని పాటిస్తూ కనీసం ఎదుటివారు ఏమంటున్నారో వినేందుకు సిద్ధపడటం లేదు. నిజానికి ఒకరిపట్ల మరొకరికి సహనం, సర్దుబాటు ధోరణి ఉండాలి.

- జయా జైట్లీ , సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు పొరుగుదేశాలకంటే భారత్‌ లోనే ముస్లిములు ఎక్కువగా ఉన్నారు. ఇంకా మరింతమంది అవసరం లేదు. కానీ భారతీయ రాజకీయ నాయకులు మాత్రం ఎక్కువమంది ముస్లిములను కోరుకుంటున్నారు.. తమ ఓట్ల కోసం. 

- తస్లీమా నస్రీన్‌, బంగ్లాదేశీ రచయిత్రి