ఇవి మీకు తెలుసా ?


-     అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

-     కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

-     నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్‌ అనే గ్లూకోసైట్‌, మధుమేహాన్ని అదుపులో ఉంచు తుంది.

-     గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

-     జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

-     సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్‌ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

-     మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

-     దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.

-     ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్‌ వద్ది చెందుతుంది.

-     అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్ద కాన్ని కూడా వదిలిస్తుంది.

-     కీరదోసలో ఉండే సిలికాన్‌, సల్ఫర్‌లు శిరో జాలకు మేలు చేస్తాయి.

-     మునగాకు గ్యాస్ట్రిక్‌ అల్సర్‌ ని దరికి చేరనివ్వదు. మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.

-     ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్‌.. ఆస్టియో పొరాసిస్‌ రాకుండా కాపాడుతుంది.

-     బీట్‌ రూట్‌ రసం 'లో బీపీ' సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

-     క్యారెట్‌ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

-     మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

-     ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.

-     అనాసపళ్ళలో బ్రోమిలిన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.

-     పుచ్చకాయలో ఉండే లైకొపీన్‌.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.

-     సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.

-     దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.

-     కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.

-     క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.

-     యాపిల్‌ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

-     వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

-     పచ్చి జామకాయలో ఉండే టానిస్‌ మాలిక్‌, ఆక్సాలిన్‌ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.

-     ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.

-     ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.

-     ప్రోస్త్రేట్‌ క్యాన్సర్‌ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.

-     మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.

-     నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.