అయ్యప్ప భక్తుల శాంతియుత ఆందోళనల్లో విధ్వంసానికి కుట్ర ?శబరిమల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సాగుతున్న అయ్యప్ప భక్తుల శాంతియుత ఆందోళనల్లో తీవ్రవాదులు విధ్వంసానికి కుట్ర పన్నుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప భక్తుల నిరసనల్లో సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఇబ్రహీం కుట్టీ సివిల్‌ దుస్తుల్లో పాల్గొన్న ఘటన అనుమానాలను మరింత బలపరుస్తోంది. 

ఒక వార్తా సంస్థ కధనం ప్రకారం.. గతంలో ఇండియన్‌ ముజాహిద్దీన్‌ తీవ్రవాది, బెంగళూరు పేలుళ్ల కుట్ర దారుడు నజీర్‌ పోలీసు కస్టడీ నుండి తప్పించుకున్న ఘటనలో కానిస్టేబుల్‌ ఇబ్రహీం కుట్టీ పాత్రమీద దర్యాప్తు చేసిన ప్రభుత్వం సంవత్సర కాలం పాటు అతడిని సస్పెండ్‌ చేసింది. తాజాగా ఈనెల 18న జరిగిన ఘటనకు సంబంధించి కానిస్టేబుల్‌ ఇబ్రహీం డ్యూటీలో ఉన్నట్టుగా పోలీసు అధికారులు చెబుతు న్నారు. పైగా డ్రైవర్లు విధినిర్వహణ సమయంలో యూనిఫామ్‌ ధరించాలన్న నియమం లేదని అంటు న్నారు. ఇదిలా ఉండగా నిరసన, ఆందోళనలకు సంబంధించి పోలీసులు విడుదల చేసిన 210 మంది నిందితుల జాబితాలో 167వ పేరు ఇబ్రాహీం కుట్టీదే. అనంతరం పోలీసులు దాన్ని పొరపాటుగా పేర్కొంటూ తొలగించడం జరిగింది.