పవిత్ర గంగా ప్రక్షాళన ఉద్యమంలో కీలక ముందడుగు


పవిత్ర గంగా నది ప్రక్షాళన ఉద్యమంలో భాగంగా భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన 'నమామి గంగా' ప్రాజెక్టులో ఒక కీలక ముందడుగు పడింది. ప్రతిరోజూ దాదాపు కోట్లాది లీటర్ల వ్యర్ధాలను గంగానదిలో ప్రవేశ పెడుతున్న సిసామావు కాలువ నీటిని సమీపంలోని జాజ్మావు నీటి శుద్ధి కేంద్రానికి మళ్లిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆధునిక కాలంలో అశ్వమేధం చేస్తున్న అనీల్ దాగర్


ఉజ్జయిని వీధుల్లో గోడలమీద ఒక విచిత్రమైన విజ్ఞప్తి కనిపిస్తుంది. 'అనాధ శవం కనిపిస్తే తెలియజేయండి' అని. ఇది నగర పాలిక సంస్థ చేసిన సూచన కాదు. ఏ సేవా, ఆధ్యాత్మిక సంస్థ వ్రాయించిన విజ్ఞప్తి కూడా కాదు. దానితోపాటు ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌ ఆ నగరంలోనే ఉండే అనీల్‌ దాగర్‌ అనే వ్యక్తిది. 

ధనుర్మాసం విశిష్టతదక్షిణాయనానికి చివర, ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసం పవ్రితమైనది. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే 'భోగి' రోజు వరకు ధనుర్మాసం కొన సాగుతుంది. ఈ మాసం రోజుల్లో విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మార్గశిర పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. 

స్వామి శ్రద్ధానంద (స్ఫూర్తి)స్వామి శ్రద్ధానంద పూర్వ నామం మున్షీరామ్‌ విజ్‌. గొప్ప విద్యావేత్తగా, ఆర్యసమాజ్‌ కార్యకర్తగా ప్రసిద్ధులు. స్వామి దయానంద సరస్వతి ఉపన్యాసా లతో ప్రభావితులై సామాజిక సరస్కర ణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. 

సంతోషంగా ఉండాలంటే.. (హితవచనం)చాలా మంది సంతోషం బయట నుండి వస్తుందని, బౌతికమైన సంపదలతో ఏర్పడుతుందని అనుకొంటారు. నిజంగా సంపదకు అనుగుణంగా సంతోషం కలిగినట్లయితే సంపద పెరుగుతున్న కొలదీ అది పెరగాలి. అలాగే సంపద ఏమాత్రం లేనివారి దగ్గర సంతోషం అనేదే ఉండకూడదు. కానీ నిజంగా అలా జరుగదు కదా! 

అమరవాణి


ప్రథమా నార్జితా విద్యా

ద్వితీయే నార్జితం ధనం

తృతీయే నార్జితో ధర్మః

చతుర్థే కిం కరిష్యతి ||

ప్రముఖులు మాటపాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ జనాభా స్వరూ పాన్ని పాకిస్థాన్‌ మార్చే సింది. గిల్గిట్‌ బాల్టిస్థాన్ను తమ ప్రజలతో నింపు తోంది. దీనివల్ల గిల్గిట్‌లో స్థానికులు మైనారిటీలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి.

- బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌

రామమందిర నిర్మాణం కోసం చట్టం చేయవలసిందే - డా. మోహన్‌ భాగవత్‌


కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడిన అయోధ్య శ్రీ రామజన్మభూమి మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘచాలక్‌ డా. మోహన్‌ భాగవత్‌ అన్నారు. అయోధ్య విషయమై విచారణ చేపట్టి ఒక నిర్ణయాన్ని త్వరితంగా తీసుకునేందుకు కోర్ట్‌ నిరాకరించడం, తమ ప్రాధామ్యాలు వేరని చెప్పడంతో చట్టం అనివార్యమవుతుందని ఆయన అన్నారు. కనుక చట్టం చేసే విధంగా ప్రభుత్వంపై ప్రజలు ఒత్తిడి తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇస్లాం పట్ల డా.బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ దృష్టికోణం - రాంస్వరూప్‌ అగ్రవాల్‌


భారత రాజ్యాంగ రూపకల్పనలో డా.బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ భాగస్వామ్యం మనం ఎప్పటికీ మరచిపోలేము. అలాగే సమాజంలో వెనుకబడిన వర్గాల ఉన్నతి కోసం, వారిని ఒక తాటిపై నడపడం కోసం ఆయన చేసిన కృషి కూడా చాలమందికి తెలుసు. అయితే స్వాతంత్య్రానికి ముందు, ప్రస్తుతం కూడా బాగా చర్చలోకి వచ్చే 'హిందువులు, ముస్లింల మధ్య మతపరమైన వైషమ్యం' గురించి ఆయన ఏమి చెప్పారో చాలామందికి తెలియదు. 

ప్రభుత్వ అరాచకాలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలుశబరిమలలోని అయ్యప్ప భక్తులపై కేరళ కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలపై మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. జిల్లా కేంద్రాలలో అయ్యప్ప భక్తులు శాంతియుత నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాదులోని ఇందిరాపార్కు సమీపంలోని ధర్నా చౌక్‌ వద్ద వందలాది మంది అయ్యప్ప మాలధారణలో ఉన్న దీక్షాపరులు  ధర్నా నిర్వహించారు. ధర్నా చౌక్‌ ప్రాంతం మొత్తం అయ్యప్ప భజనలతో మార్మోగి పోయింది. కేరళ దుష్ట ప్రభుత్వానికి గుణపాఠం నేర్పి, ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ కి సద్భుద్ది ప్రసాదించమంటూ భజనల ద్వారా అయ్యప్పను ప్రార్ధించారు.

మతమార్పిడికి దారితీసే ప్రత్యేక కోడ్‌ఈ దేశాన్ని ప్రాంత, భాష, కుల, వర్గాల పేరున విభజించి, విచ్ఛిన్నం చేసి తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించిన శక్తులు చాలానే ఉన్నాయి. ఇప్పటికీ అవి వేరువేరు రూపాల్లో, పద్దతుల్లో తమ విఘటన, వినాశకారి ధోరణిని కొనసాగిస్తూనే ఉన్నాయి. వీటినే 'విచ్ఛిన్న శక్తులు' (బ్రేకింగ్‌ ఇండియా ఫోర్సెస్‌) అనవచ్చును. ప్రజలను, ముఖ్యంగా గిరిజనులను, వారి మూల సంస్కృతి, సభ్యతల నుంచి వేరుచేసి వారి ద్వారా తమ విఘటన, వినాశకారి విధానాన్ని అమలు చేయడానికి బ్రిటిష్‌ వారి కాలం నుంచి ఈ శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి.

హిమాచల్‌లో సేవభారతి సేవలుహిమాచల్‌ ప్రదేశ్‌ కొన్ని ప్రాంతాల్లో సంవత్స రంలో 9 నెలలు విపరీతమైన మంచు కురుస్తుంది. ఆ సమయంలో ఆ ప్రాంతాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. కరెంట్‌ ఉండదు. ఆహార పదార్ధాలు దొరకవు. సాధారణ జనజీవనం కూడా స్తంభించిపోతుంది. మామూలు రోజుల్లో కూడా సదుపాయాలు అంతంతమాత్రమే.  ఇక సుదూర కొండల్లో విసిరేసినట్లుగా అక్కడ ఒకటి, ఇక్కడొకటిగా ఉండే గ్రామాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అలాంటి సుదూర గ్రామాలే పంగి, వయారా.

ప్రజాపోరాటం
క్రీ.శ-1528 బాబర్‌ ప్రధాన సేనాధిపతి అయిన మీర్‌ బాకీ అయోధ్యలోని రామ జన్మభూమి మందిరాన్ని కూలగొట్టాడు. 1528 నుండి 1934 మధ్య కాలంలో దీని కోసం 76 యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నీ ఎన్నో తరాల హిందువులు అయోధ్య రామజన్మస్థలం కోసం చేసినవే. ఆ తరువాత 90వ దశకంలో ఇది దేశవ్యాప్త ఉద్యమం అయింది. మర్యాదాపురుషోత్తముడైన శ్రీ రాముని జన్మస్థలంలో మందిరం కోసం హిందువులు 500ఏళ్లుగా సాగిస్తున్న పోరాటపు సంక్షిప్త వివరాలు చూద్దాం

మాచిపత్రి (గృహ వైద్యం)మాచిపత్రి గురించి సంపూరణ వివరణ - ఉపయోగాలు.
  • ఈ మాచిపత్రి నుంచి ''శాంటోనైన్‌'' అను ఔషధాన్ని తయారుచేస్తారు. ఈ ఔషధం అల్లోపతి వైద్యవిధానంలో కడుపులో నులిపురుగులు, ఎలికపాములు మొదలగు క్రిములను చంపుటకు ఉపయోగిస్తారు.

అమ్మకు ప్రతిరూపం శారదామాత


భారతదేశంలోని గొప్ప గురువుల గురించి చెప్పుకొనేటప్పుడు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందల ప్రస్థావన ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వస్తుంది. వీరందరి గురించి చెప్పుకునే ముందు శారదామాత గురించి కూడా ప్రస్థావించా ల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆ ప్రస్థావన అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. సాధకుడైన భర్తకు కాళీమాతలా, అతని శిష్యులకు తల్లిలా భాసించిన శారదాదేవి మాతృమూర్తి అన్న మాటకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది.

క్రైస్తవ వసతిగృహంలో మతమార్పిళ్లు..


25 మంది చిన్నారులను రక్షించిన అధికారులు

హర్యానా అంబాలాలోని కళారహేలి ప్రాంతంలో ఒక క్రైస్తవ సంస్థ నిర్వహిస్తున్న 'మెర్సీ హోం' అనే బాలల వసతి గృహం నుండి 25 మంది చిన్నారులను అధికారులు రక్షించారు. ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి వీరిని తీసుకువచ్చిన వసతి గృహ నిర్వాహకులు చిన్నారులను మతమార్పి డికి గురిచేస్తున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు.