మాచిపత్రి (గృహ వైద్యం)మాచిపత్రి గురించి సంపూరణ వివరణ - ఉపయోగాలు.
  • ఈ మాచిపత్రి నుంచి ''శాంటోనైన్‌'' అను ఔషధాన్ని తయారుచేస్తారు. ఈ ఔషధం అల్లోపతి వైద్యవిధానంలో కడుపులో నులిపురుగులు, ఎలికపాములు మొదలగు క్రిములను చంపుటకు ఉపయోగిస్తారు.
  • ఈ శాంటోనైన్‌ ఔషధమును రాత్రి సమయం నందు రోగులకు ఇచ్చి తెల్లవారిన తరువాత ఆముదమును త్రాగించెదరు. ఇందువలన కడుపులో పురుగులు చచ్చి మలముతో కలిసి పడిపోవును. ఈ ఔషధం చాలా వేడిని కలిగించును. దీనిని సేవించిన కొందరికి రెండుమూడు రోజుల వరకు కండ్లు పచ్చగా అవ్వడం మొదలగు బాధలు కలుగును. ఔషధం మోతాదు ఎక్కువ అవ్వడం వలన పైన చెప్పిన బాధలు కలుగును. మూలిక నుండి తీయబడిన శాంటోనైన్‌ వాడటం వలన ఇటువంటి ఇబ్బంది కలుగుచున్నది. అసలు మూలికనే కషాయంగా గాని చూర్ణంగా గాని ఉపయోగించినచో ఎటువంటి దుష్ఫలితాలు కలగవు.
  • మాచిపత్రిని అప్పుడప్పుడు నోట్లోవేసుకొని తులసి ఆకువలే తినుచున్న అన్నాశయం నందు పురుగులు నశించి మంచి ఆకలి కలుగును.
  • మాచిపత్రితో రెండు మూడు మిరియాలను కలిపి చిన్నచిన్న ఉండలు చూసి చిన్నపిల్లలకు ఇచ్చుచున్న కడుపులో పురుగులు నశించును.  అందువలన చిన్నపిల్లలకు వచ్చు అనేకరకాల రోగాలు రానివ్వదు.
  • మాచిపత్రి ఆకులతోను, కంకులతో చేసిన కషాయం వ్రణములను, దద్దులను, కుష్ఠు రోగమును మాన్పును.
  • శరీరంలోని వాతమును, చిన్నపిల్లలకు వచ్చు ఈడ్పురోగమును నయం చేయును. క్రిములను హరించును.
  • వరుసగా వచ్చు జ్వరమును, అజీర్తిని, మూర్చ రోగమును, అపస్మారం, కలరా, రుతుబద్ధం వంటి వాటికి మాచిపత్రి ఆకులు, వెన్నులతో కషాయం అద్బుతంగా పనిచేయును.
  • పుళ్ళతో ఇబ్బంది పడుతున్నవారు పైన చెప్పిన కషాయంతో పుళ్ళను కడిగితే అవి త్వరగా నయం అగును.
  • తలపోటు, తలనొప్పి, వాతనొప్పులకు ఈ ఆకులను వేడిచేసి కట్టుకట్టిన తగ్గిపోవును.