అమరవాణి


ప్రథమా నార్జితా విద్యా

ద్వితీయే నార్జితం ధనం

తృతీయే నార్జితో ధర్మః

చతుర్థే కిం కరిష్యతి ||


భావం : బాల్యంలో అశ్రద్ధ చేసి విద్య ఆర్జించక పోతే, యవ్వనంలో ధన సంపాదన చేయకపోతే, మధ్యవయస్సులో ధర్మాన్ని అనుసరించకపోతే ఇక పెద్ద వయస్సులో చేయగలిగినది ఏముంటుంది? (ఏ సమయంలో చేయాల్సినవి అప్పుడు చేయకపోతే కష్టాలే మిగులుతాయి.)