ధనుర్మాసం విశిష్టతదక్షిణాయనానికి చివర, ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసం పవ్రితమైనది. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే 'భోగి' రోజు వరకు ధనుర్మాసం కొన సాగుతుంది. ఈ మాసం రోజుల్లో విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మార్గశిర పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. 
గోదాదేవి 'మార్గళి' వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి శ్రీ మహావిష్ణువును ఆరాధించింది. ధనుర్మాసం నెల రోజులు సాక్షాత్తు భూదేవి అవతారంగా భావించే 'ఆండాళ్‌' రచించిన విద్య ప్రబంధము 'తిరుప్పావై' (పవిత్ర వ్రతం) బ్రహ్మీ ముహూర్తంలో పఠిస్తే దైవానుగ్రహాన్ని పొందు తారని శాస్త్రాలు ఘోసిస్తున్నాయి. విష్ణుచిత్తుడు కుమార్తె గోదాదేవి 'పాశురం' పేరుతో ఒక కీర్తనతో నారాయణుడిని ఆరాధించింది'. ఈ మాసంలో మహిళలు ఇంటిముందు గొబ్బెమ్మలు పెట్టి అలంక రించి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ నెల రోజులు హరిదాసు సంకీర్తనలతో, జంగమదేవర లతో, గంగిరెద్దులను ఆడించే వారితో గ్రామాలలో సందడిగా ఉంటుంది. తిరుమలలో ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్ర నామార్చనలో తులసీదళాల బదులు బిల్వపత్రాలు ఉపయో గిస్తారు. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా పరమ పవిత్రంగా భావిస్తారు. శివాలయాలలో ఆ ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం ప్రవేశించిన రోజున ప్రముఖ మైనదిగా భావించి పూజలు చేస్తారు. ఈ మాసంలో సూర్య నమస్కారాలు విశేషంగా చేస్తారు.