నిత్య చైతన్య స్వరూపిణి


జనవరి 26వ తేదీన దేశమంతా అధికారి కంగా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. దీనివెనుక ఒక చరిత్ర ఉంది. 1929లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశాలలో ఒక సంవత్సరంలో ''సంపూర్ణ స్వరాజ్యం'' అని పిలుపునిచ్చారు. కాని 1930లో స్వరాజ్యం రాలేదు. కాని దేశమంతా తమ ఆకాంక్షను, దీక్షను వెల్లడి చేస్తూ 1930 జనవరి 26న సాతంత్య్ర దినోత్సవం జరిపారు నాటి స్వాతంత్య్ర సమరయోధులు. స్వతంత్రం ఆగస్టు 15న వచ్చింది.  మన రాజ్యాంగాన్ని అమలులోకి తేవడానికి నాటి దేశభక్తుల పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ జనవరి 26న మన దేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు.

భారతీయ ఏకాత్మతకు ప్రతీక సమరసతా కుంభడిసెంబర్‌ 15,16వ తేదీల్లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, ఫైజాబాద్‌, అయోధ్యలోని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా అవధ్‌ విశ్వవిద్యాలయంలో సమరసత కుంభ జరిగింది. మొదటి రోజు శ్రీరామ జన్మభూమి న్యాస్‌ అధ్యక్షులు మహంత్‌ నత్య్‌ గోపాల్‌ దాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కుంభలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాననీయ శ్రీ యోగి ఆదిత్యనాథ్‌ మహరాజ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 

శ్రీ గురుగోవింద్‌ సింగ్‌ (జనవరి 5న జయంతి సందర్భంగా)


గురుగోవింద్‌ సింగ్‌గా ప్రసిద్ధమైన గోవింద రామ్‌ క్రీ.శ. 1666 జనవరి 5న పాట్నాలో గురుతేజ్‌ బహదుర్‌, మాతా గుజ్రి దంపతులకు జన్మించారు. గురునానక్‌, గురు అర్జున్‌దేవ్‌ల తర్వాత సిక్కు సంప్రదాదాయాన్ని అత్యంతంగా ప్రభావితం చేసినవాడు గురుగోవింద్‌ సింగ్‌. ఈయన సిక్కుల పదవ మరియు చివరి గురువు. 

ఏ అపచారాన్ని సహించలేదు (స్ఫూర్తి)స్వామి వివేకానంద విద్యార్థిగా ఉన్న రోజులలో జరిగిన సంఘటన. ఒక క్రైస్తవ మత ప్రచారకుడు నడివీధిలో మన ధర్మాన్ని, దేవీ దేవతలను హేళన చేస్తూ 'నేను మీ దేవతా విగ్రహాన్ని  కొడితే మీ దేవుడేంచేస్తాడు?'' అని అపహస్యం చేశాడు. ఆ దారిన వెళ్తున్న నరేంద్రుడు ''నేను మీ దేవుడి విగ్రహాన్ని కొడితే అప్పుడేం చేస్తాడు?'' అని ప్రశ్నించాడు. 

ప్రజలు ఒక అద్భుత వస్తువు (హితవచనం)ఈ యుగంలో భగవంతుడు మానవుల్ని ఒక అద్భుత వస్తువుగా రూపొందించాడు. మనకు రెండు బలమైన కాళ్ళను ఇచ్చాడు. అయితే కనీసం నలభై, యాభై మైళ్ళు కూడా నడవడానికి ఇష్టపడం. మనకు రెండు చేతులనిచ్చాడు. కానీ వాటిని ఉపయోగించడానికి మనం సిగ్గుపడతాం. మనకు భగవంతుడు బలమైన శరీరాన్నిచ్చాడు. అయినా మనం కష్టపడటానికి ఇష్టపడం. మనం ఏమీ చేయలేని అకర్మణ్యులుగా తయారయ్యాం. మనం జన్మించింది ఉష్ణదేశంలో అయినా ఎండ అంటే భయపడతాం. వేసవికాలంలో చెమటలు కారుస్తూ నిట్టూర్పులు వదులుతుంటాం.

ప్రముఖులు మాటమానవ సమాజంలోనే కాదు, సర్వ సష్టిలో ఉన్న భిన్నత్వం వెనుక ఏకత్వాన్ని దర్శించ గలిగినవాడే హిందువు. ఈ ఏకత్వ దర్శనమే హిందూత్వం ప్రపంచానికి అందించిన అపురూపమైన కానుక.

- డా.మోహన్‌ భాగవత్‌, సర్‌ సంఘచాలక్‌, ఆర్‌ఎస్‌ఎస్‌

అమరవాణిఅనిర్వేదః శ్రియోమూల

మనిర్వేదః పరం సుఖమ్‌

అనిర్వేదో హి సతతం

సర్వార్ధేషు ప్రవర్తకః


(శ్రీమద్‌ రామాయణం 5:12:10)

బీమా-కోరేగావ్‌ హింస వెనుక కుట్ర ఉందిఎల్గార్‌ పరిషద్‌-బీమా కోరేగావ్‌ సంఘటనల వెనుక లోతైన కుట్ర ఉందని, దీని దుష్పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని ముంబై హైకోర్ట్‌ ఒక తీర్పులో పేర్కొంది. తనపై పోలీసులు మోపిన అభియోగాలను కొట్టివేసి, మొత్తం కోరేగావ్‌ కేసును తిరస్కరించాలంటు ప్రొ. ఆనంద్‌ తెల్తుంబ్డే దాఖలు చేసిన పిటిషన్‌ ను పరిశీలించిన కోర్ట్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. బీమా కోరేగావ్‌ కేసు దర్యాప్తు చేసిన పూనా పోలీసులు పలువురు న్యాయవాదులు, ఉద్యమ కారులకు నిషేధిత సిపిఐ (మావోయిస్ట్‌) పార్టీతో సంబంధాలు ఉన్నాయని కోర్ట్‌కు తెలియజేశారు.

సోమనాథ మందిర పునర్నిర్మాణం ఇలా జరిగింది - డా. మన్మోహన్‌ జీ వైద్య, సహ సర్‌ కార్యవాహ, ఆర్‌.ఎస్‌.ఎస్‌.అయోధ్యలో రామమందిర నిర్మాణం, సోమనాథ్‌లో దేవాలయ పునర్నిర్మాణం పూర్తిగా వేరువేరు విషయాలు. అయినా అయోధ్యా విషయంపై త్వరితంగా నిర్ణయం తీసుకోవడానికి సుప్రీం కోర్ట్‌ నిరాకరించిన తరుణంలో 1948 నాటి సోమనాథ మందిర చర్చ గుర్తుకు వచ్చింది. సోమనాథ్‌ మందిరాన్ని కూడా ముస్లిం దురాక్రమణ దారులు ఒకప్పుడు ధ్వంసం చేశారు.

రఫెల్‌పై సుప్రీంకోర్టును కూడా తప్పుపడతారా?


రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు విషయమై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. అయిదోతరం, అత్యాధునిక యుద్ధవిమానాల కొనుగోలు అవసరాన్ని ఈ తీర్పు సమర్థించింది. అనేక రోజులుగా ఈ విషయంలో అవినీతి జరిగిందంటూ రాహుల్‌ గాంధితో సహా ప్రశాంత్‌ భూషణ్‌ లాంటి కుహన మేధావులు అబద్ధపు ప్రచారం చేశారు. ధరల విషయమై ప్రభుత్వం కూడా పార్లమెంటులో ఎలాంటి ప్రస్తావన చేయలేదు. 

ఘోష్‌ సాధనతో చైతన్యం, ధైర్యం, సాహసం వస్తాయి - ఆర్‌ఎస్‌ఎస్‌ సహ సర్‌కార్యవాహ శ్రీ భాగయ్య పిలుపురాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ తెలంగాణ ప్రాంత బాలల, యువకుల ఘోష్‌ శిబిరం సిద్ధిపేట జిల్లా పొన్నాలలోని ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశా లలో 23, 24, 25 తేదీలలో జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి 688 మంది శిక్షార్థులు పాల్గొన్నారు. మొదటి రోజున జరిగిన ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సహ సర్‌కార్యవాహ శ్రీ భాగయ్య, తెలంగాణ ప్రాంత సంఘచాలక్‌ శ్రీ దక్షిణామూర్తి, తదితరులు మార్గదర్శనం చేశారు. 

రామమందిరముండేదనడానికి ఆధారాలువిస్తృతమైన తవ్వకాల తరువాత పురావస్తు పరిశోధన శాఖ రామ జన్మభూమిలో నిస్సందేహంగా ఒక గొప్ప ఆలయము ఉండేదని నిర్ధారించింది. అలాగే దానిని కూల్చి ఆ స్థానంలోనే బాబరీ కట్టడ కట్టారని కూడా తేల్చింది.

సినిమా కథలను భారత చారిత్రక ఇతిహాసాల నుండి గ్రహించాలి - ఉమేష్‌ ఉపాధ్యాయ్‌


సమాచార భారతి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో రెండవ కాకతీయ ఫిలిం ఫెస్టివల్‌ అవార్డు ప్రధానోత్సవాలు డిసెంబర్‌ 23 సాయంత్రం మాదాపూర్లోని సెంటర్‌ ఫర్‌ కల్చరల్‌ రిసోర్సెస్‌ అండ్‌ ట్రైనింగ్‌ ప్రాంగణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా పోటీలలో పాల్గొన్న ఉత్తమ లఘు చిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రిలియన్స్‌ సంస్థల మీడియా విభాగం డైరెక్టర్‌ శ్రీ ఉమేష్‌ ఉపాధ్యాయ్‌ మాట్లాడుతూ..

ఆధ్యాత్మికత, ఆరోగ్యం కలగలిసిన సంక్రాంతి


సంక్రాంతి పండుగ రాగానే తెలుగు రాష్ట్రాలలో సంబరాలు అంబరాన్ని అంటు తాయి. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను వివిధ పేర్లతో జరుపుకుంటారు. పేరు ఏదైనా.. సంక్రాంతి అనగానే పాడి, పంటలతో ముడిపడిన పల్లె పండుగగానే గుర్తొస్తుంది. ముఖ్యంగా భారతీయ సంప్రదాయంలో వ్యవసాయా నికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అంతేకాకుండా శ్రమ జీవుల కష్టానికి ఈ పండుగ అద్దం పట్టేలా ఉంటుంది. పంటలు చేతికొచ్చే సమయానికి సంక్రాంతి పండుగను జరుపు కోవడం మరో విశేషం. ముఖ్యంగా వ్యవసాయా నికి.. బ్రతుకు దెరువుకు అండగా నిలిచే ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యదేవుణ్ణి కొలిచే ప్రత్యేక పండుగే ఈ సంక్రాంతి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అన్నపూర్ణను ఇంటింటికి అందించేందుకు తమకు సహకరించే పాడి పశువులకు రైతులు కృతజ్ఞతను చూపించడం సంక్రాంతి పండుగలో ఉన్న ఆత్మీయ భావాన్ని మన కళ్ళకు కడుతుంది.

జొన్నలు


  •      రుచికి వెగటుగా ఉంటుంది.
  •       శరీరంలో కఫం, పైత్యాన్ని హరిస్తుంది.
  •       వీర్యవృద్ధి, బలాన్ని ఇస్తుంది.
  •      జొన్నలలో ఎరుపు, తెలుపు, పసుపు మూడు రంగుల జాతులు ఉంటాయి.
  •       జొన్నలలోని మాంసకృత్తుల్లో మనకు అవసర మయిన అన్ని ఎమినో ఆమ్లాలు  తగినంతగా ఉంటాయి. వీటిలో విటమిన్‌ B కాంప్లెక్స్‌ మరియు సెల్యూలోజులు సమద్ధిగా లభిస్తాయి.

పోలీసుల పర్యవేక్షణలో గోదావరి తీరంలో సామూహిక మతమార్పిళ్లు.. హిందువుల పుష్కర ఘాట్ల కబ్జాకు యత్నం


హిందువులు పరమ పవిత్రంగా భావించే గోదావరి నదీ తీరంలో సామూహిక మతమార్పిళ్లు జరిగాయి. ఏకంగా పోలీసుల పర్య వేక్షణలో ఇది జరగడం గమనార్హం. అంతంతరం పుష్కర ఘాట్లలో తమ మతమార్పిడి కార్యకలాపాలకు అనుమతివ్వాలని కొన్ని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ అధికారులను కోరడం, వారు సరేనంటూ అంగీకరించడం, అభ్యంతరం తెలియజేసిన హిందూ కార్యకర్తలను పోలీసులు కేసుల పేరిట భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనల నేపథ్యంలో రాజమండ్రిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.