పోలీసుల పర్యవేక్షణలో గోదావరి తీరంలో సామూహిక మతమార్పిళ్లు.. హిందువుల పుష్కర ఘాట్ల కబ్జాకు యత్నం


హిందువులు పరమ పవిత్రంగా భావించే గోదావరి నదీ తీరంలో సామూహిక మతమార్పిళ్లు జరిగాయి. ఏకంగా పోలీసుల పర్య వేక్షణలో ఇది జరగడం గమనార్హం. అంతంతరం పుష్కర ఘాట్లలో తమ మతమార్పిడి కార్యకలాపాలకు అనుమతివ్వాలని కొన్ని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ అధికారులను కోరడం, వారు సరేనంటూ అంగీకరించడం, అభ్యంతరం తెలియజేసిన హిందూ కార్యకర్తలను పోలీసులు కేసుల పేరిట భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనల నేపథ్యంలో రాజమండ్రిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

హిందూ చైతన్య వేదిక తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి :

15 నవంబర్‌ 2018 సాయంత్రం సమయంలో పట్టణంలోని మార్కండేయ స్వామి దేవాలయ సమీపంలో గల గోదావరి తీరంలో కొందరు క్రైస్తవ పాస్టర్లు హిందువులను మతం మారుస్తూ, ఆ ప్రక్రియను తమ వీడియో కెమెరాల్లో చిత్రీకరించసాగారు. ఇది గమనించిన సమీపంలోని హిందువులు తమ పవిత్ర ప్రాంతంలో క్రైస్తవ మార్పిళ్లు ఎలా చేస్తారని ప్రశ్నించారు. జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు హిందువులు సమీపం లోని మూడవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు వెళితే క్రైస్తవ పాస్టర్లు కూడా వారి వెనుకే పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. 2007 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన 'అన్యమత ప్రచార నిరోధక చట్టం' (జీవో నెం. 746 & 747) ప్రకారం హిందూ దేవాలయాల వద్ద, ప్రార్ధనా ప్రదేశాలవద్ద ఇతర మతాల ప్రచారం, కార్యక్రమాలు జరుపరాదు. ఈ విషయమై హిందువులు చేసిన ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాక రించారు. పోలీసులు జరిగిన ఘటన గురించి రాజమండ్రి సబ్‌-కలెక్టరుకు తెలియజేసినప్పుడు ఆయన ''నదీ జలాలపై అందరికీ హక్కు ఉంటుంది'' అని ముక్తాయించడంతో.. పట్టణ పోలీసులు మరియు ఇద్దరు సర్కిల్‌ ఇన్స్పెక్టర్ల పర్య వేక్షణలో మార్కండేయ దేవాలయ పుష్కర ఘాట్లో క్రైస్తవులు యథేచ్ఛగా మతమార్పిళ్లు కొనసాగించారు. దీనిపై రాజమండ్రి డీఎస్పీ మరియు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ వివరణ ఇస్తూ.. మతమార్పిళ్ల కార్యక్రమానికి భద్రత కల్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ నుండి ఆదేశాలు ఉన్నాయని తెలియ జేయడం గమనార్హం.

నిజానికి అక్కడ ఆ సమయంలో మతం మారుతున్న వారు ఎవరు, మార్చుతున్న వ్యక్తులు ఎవరు అనే కీలకమైన ప్రాథమిక సమాచారం కూడా పోలీసులు సేకరించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

రాజ్యాంగ వ్యతిరేకమైన, దేశ భద్రతకు, సంస్కృతీ సాంప్రదాయాలకు సంబంధించిన ఈ అంశాన్ని చట్టబద్ధం చేసే అధికారం ఎవరికీ లేదు. క్రైస్తవ మిషనరీ గృహంలో బాలికలపై అకృత్యాలు

దేశంలో క్రైస్తవ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాల నిజస్వరూపం మరోసారి బయటపడింది.

ఓడిశాలోని దేనికనాల్‌ జిల్లా బెల్టికిరి గ్రామంలో గుడ్‌ న్యూస్‌ ఇండియా అనే క్రైస్తవ సంస్థలో ఆధ్వర్యం లోని డ్రీమ్స్‌ బాలికల వసతిగృహంలో జరుగుతున్న అత్యాచారాలు వెలుగుచూశాయి. దీంతోపాటు బాలికల క్రైస్తవ మతమార్పిళ్ల వ్యవహారం కూడా బయటపడటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. దీంతో పోలీసులు గుడ్‌ న్యూస్‌ ఇండియా స్వచ్ఛంద సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఫయాజ్‌ రెహ్మాన్‌ మరియు డ్రీమ్‌ వసతి గృహ ఉద్యోగి సీమాంచల్‌ నాయక్‌ లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ వసతి గృహం నిర్వహణకు అసలు అనుమతి లేదని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి ప్రఫుల్ల సమాల్‌ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలియజేసారు.