జొన్నలు


  •      రుచికి వెగటుగా ఉంటుంది.
  •       శరీరంలో కఫం, పైత్యాన్ని హరిస్తుంది.
  •       వీర్యవృద్ధి, బలాన్ని ఇస్తుంది.
  •      జొన్నలలో ఎరుపు, తెలుపు, పసుపు మూడు రంగుల జాతులు ఉంటాయి.
  •       జొన్నలలోని మాంసకృత్తుల్లో మనకు అవసర మయిన అన్ని ఎమినో ఆమ్లాలు  తగినంతగా ఉంటాయి. వీటిలో విటమిన్‌ B కాంప్లెక్స్‌ మరియు సెల్యూలోజులు సమద్ధిగా లభిస్తాయి.
  •      జొన్నపిండితో తయారుచేసిన రొట్టెలు మంచి బలవర్ధకమైన ఆహారం. మలబద్ధకాన్ని తగ్గించి వేయును.
  •      జొన్నలలో అధికంగా ఉన్న 'ఫైటేట్స్‌' అనే పదార్థం వలన మిగతా ఆహారపదార్ధాలలోని క్యాల్షియం, ఐరన్‌ వంటి ఖనిజ లవణాలు శరీరానికి పట్టడం కష్టం అవుతుంది. కాబట్టి జొన్నల్ని శుద్ధిచేసి, మెత్తగా పిండిచేసి  ఉపయోగిస్తే ఫైటేట్స్‌ అడ్డురావు. దీనివల్ల ఐరెన్‌, క్యాల్షియం ఒంటికి పడతాయి.
  •     మంచిగా శుద్ది చేసిన జొన్నపిండిని పాలతో కాని, మజ్జిగలో కాని కలిపి తీసుకుంటే మొలలు, అజీర్తి, B1, B2 లోపంతో బాధపడేవారికి మంచి ఔషధంగా పని చేస్తుంది.
  •     100 గ్రాములు జొన్నలలో పిండి పదార్దాలు 73 గ్రా, మాంసకత్తులు 10.5 గ్రా, కొవ్వులు 1.7 గ్రా, ఫాస్ఫరస్‌ 286 మి.గ్రా, కాల్షియం 20 మి.గ్రా, ఐరన్‌ 6 మి.గ్రా , సోడియం 7 మి.గ్రా, పొటాషియం 130 మి.గ్రా, విటమిన్స్‌ A-140, I.U, B-345 మి.గ్రా, B2 - 365 మి.గ్రా, నియాసిన్‌ 1.7 మి.గ్రా ఉన్నాయి. ఇవి జీర్ణం కావడానికి 3 గంటలు పడుతుంది.
  •      జొన్నలను కడుపులో గుల్మాలు ఉన్నవారు తీసుకోరాదు. జొన్నలు అధికంగా తీసుకోవడం వలన నేత్రసంబంధ సమస్యలు వస్తాయి.
  •       జొన్నలకు విరుగుళ్లు పాలు, నెయ్యి, మిఠాయి, వాము.