ఘోష్‌ సాధనతో చైతన్యం, ధైర్యం, సాహసం వస్తాయి - ఆర్‌ఎస్‌ఎస్‌ సహ సర్‌కార్యవాహ శ్రీ భాగయ్య పిలుపురాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ తెలంగాణ ప్రాంత బాలల, యువకుల ఘోష్‌ శిబిరం సిద్ధిపేట జిల్లా పొన్నాలలోని ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశా లలో 23, 24, 25 తేదీలలో జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి 688 మంది శిక్షార్థులు పాల్గొన్నారు. మొదటి రోజున జరిగిన ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సహ సర్‌కార్యవాహ శ్రీ భాగయ్య, తెలంగాణ ప్రాంత సంఘచాలక్‌ శ్రీ దక్షిణామూర్తి, తదితరులు మార్గదర్శనం చేశారు. 


డాక్టర్జీ సంఘాన్ని స్థాపిం చారు కాబట్టి మనం కలిశాం, మనందరం హిందువులమని భాగయ్య తన ఉపన్యాసంలో అన్నారు. డాక్టర్జీ సంఘాన్ని స్థాపించిన కొత్తలో 8, 9, 10 తరగతుల విద్యార్థులే శాఖలకు వచ్చేవారని, తరువాత ఘోష్‌ శిక్షణ సంఘంలో భాగమైందని ఆయన గుర్తు చేశారు. హిందూ సమాజంలో సంగీతానికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. భారతీయ సంగీతం చాలా శ్రేష్ఠమైనది. సంగీతంతో మానవత్వం మేల్కొలపాలన్నారు భాగయ్య. యాదవరావ్‌జీ జోషీ గురించీ, బాల్యంలోనే వారికి అబ్బిన సంగీత పరిజ్ఞానం గురించి కూడా భాగయ్య వివరించారు. జోషీకి చిన్నప్పుడే బాల గంధర్వ బిరుదుండేది. ఆయన 9వ తరగతిలో ఉండగానే పాఠశాల వార్షికోత్స వానికి డాక్టర్జీ ముఖ్య అతిథిగా వెళ్లారు. యాదవ్‌ రావ్‌జీ పాట పాడుతుంటే డాక్టర్జీ మంత్రముగ్దులై విన్నారు. అటు తర్వాత డాక్టర్జీ ఆయన భుజంతట్టి ప్రోత్సహించారు. యాదవ్‌ రావ్‌జీ యం.ఎ., ఎల్‌.ఎల్‌.బి. పూర్తిచేసి, సంఘ ప్రచారక్‌గా వచ్చి, పూర్తి జీవితాన్ని అంకితం చేశారు. 'డాక్టర్జీ మూజే గీత్‌ గానేకేలియే బులాయా - లేకిన్‌ సంఘ్‌ మేరా జీవన్‌ గీత్‌ బన్‌గయా' అని అన్నారని భాగయ్య తెలిపారు. ఘోష్‌ శిబిరం రెండవ రోజు సిద్ధిపేట నగర పురవీధులలో పథ సంచలన్‌ జరిగింది.

 
సార్వజనికోత్సవం

మూడు రోజుల ఘోష్‌శిబిరం సార్వజని కోత్సవం డిసెంబర్‌ 25న ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలోనే జరిగింది. డా.ఆర్‌.నిహాల్‌ ముఖ్యఅతిథిగా, ఆర్‌.ఎస్‌.ఎస్‌.తెలంగాణ ప్రాంత ప్రచారక్‌ పి.దేవేందర్‌ ప్రధానవక్తగా పాల్గొన్నారు.